Boston Luxury Brothel Scandal: అమెరికాలోని కేంబ్రిడ్జిలో పోలీసులు హై ప్రోఫైల్ బ్రోతల్ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా లగ్జరీ అపార్టుమెంట్లలో ఆసియాకు చెందిన మహిళల్ని ముఖ్యంగా సినీ తారల్ని, సెలబ్రిటీలు లాంటి వాళ్లతో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఇక్కడ గంటకు అరు వందల డాలర్లకుపైగా చార్జ్ చేస్తున్నారు. అంటే గంటకు యాభై వేల పైనే వసూలు చేస్‌తున్నారు.
హైక్లాస్ వ్యభిచార ముఠా కావడంతో క్లయింట్లు కూడా ఆ స్థాయిలోనే ఉన్నారు. డాక్టర్లు, లాయర్లు, వ్యాపారవేత్తలు ఈ బ్రోతల్ కంపెనీ సేవలు పొందేవారు. ఇటీవల బోస్టన్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఈ ముఠాను అరెస్టు చేశారు. అక్కడ దొరికిన సాక్ష్యాల ఆధారంగా గ్రేడియంట్ కంపెనీ సీఈవో అనురాగ్ బాజ్ పాయ్ కూడా ఈ జాబితాలో ఉండటంతో న్యూస్ ఒక్క సారిగా వైరల్ అయింది.
అనురాగ్ బాజ్‌పాయ్ మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజినీరింగ్ మాస్టర్స్ చేశారు. పీహెచ్‌డీ కూడా చేశాడు. క్లీన్ వాటర్ టెక్నాలజీ స్టార్టప్ గా గ్రేడియంట్ ను ప్రారంభించారు. ఈ సంస్థ ఇప్పుడు 25 దేశాల్లో విస్తరించింది. బిలియన్ డాలర్లకు పైగా విలువైన గ్లోబల్ కంపెనీగా ఎదిగింది. సెమీకండక్టర్స్, ఫార్మాస్యూటికల్స్, మైనింగ్, ఫుడ్ అండ్ బెవరేజ్ వంటి వంటి రంగాల్లో నీటి సమస్యలకు పరిష్కారం అందిస్తోంది. ఇంత పెద్ద కంపెనీ సీఈవో వ్యభిచార సేవలు పొందినట్లుగా తేలడంతో అమెరికాలోనూ హాట్ టాపిక్ అయింది.
ఈ హై ప్రోఫైల్ బోస్టన్ బ్రోతల్ స్కాం నెట్ వర్క్ చిన్నది కాదు. సీఈవోలు, లాయర్లు, డాక్టర్లు వంటి వారికి మాత్రమే యాక్సెస్ ఉండే బ్రోతల్. అలాంటి వారికి ఇష్టమైన యువతుల్ని సరఫరా చేయడం అంటే చిన్న విషయం కాదు. వారు ఎక్కువగా సెలబ్రిటీలను మాత్రమే ఇష్టపడతారు. ఆసియా మహిళల్ని అక్రమంగా తీసుకు వచ్చి అమెరికాలో ఇలాంటి పనులు చేయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అందులో ఇండియాకు చెందిన సినీ నటులు కూడా ఉన్ారని తెలుస్తోంది. నటీమణులపై ఉండే క్రేజ్ కారణంగానే గంటకు రూ.50వేలకుపైగా చెల్లించేందుకు వీరు సిద్ధపడ్డాలంటే ఖచ్చితంగా ఆ మహిళలు కూడా ఆ స్థాయికి తగ్గవారే ఉంటారని భావిస్తున్నారు.