Indian Railways liquor carrying rules: ట్రైన్ ప్రయాణికుల మధ్య తరచుగా వినిపించే ప్రశ్న – "ట్రైన్‌లో మద్యం బాటిల్స్ తీసుకెళ్లవచ్చా? అనే.  ఈ సందేహానికి స్పష్టమైన సమాధానం భారతీయ రైల్వేస్ ఇచ్చింది.  మద్యం తీసుకెళ్లడం , తాగడం రెండూ కఠినంగా నిషేధించినట్లుగా రైల్వేశాఖ ప్రకటించింది.  ఇటీవలి అధికారిక ప్రకటనల ప్రకారం, మద్యం తీసుకెళ్లడం ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగిస్తుందని, ఇది ఇతరులకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఈ నియమాలు రైల్వే చట్టం 1989, రాష్ట్ర ఎక్సైజ్ చట్టాలు ,  పబ్లిక్ న్యూసెన్స్ చట్టాలపై ఆధారపడి ఉన్నాయి.                 

Continues below advertisement


లిక్కర్ బాటిళ్ల రవాణా పూర్తి నిషేధం
 
భారతీయ రైల్వేస్ ప్రకారం, ప్యాసింజర్ ట్రైన్‌లలో మద్యం,  లిక్వర్ బాటిల్స్ తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించారు.  రైన్‌లు పబ్లిక్ స్పేస్‌లు కావడంతో, మద్యం తీసుకెళ్లడం లేదా తాగడం భద్రతా సమస్యలు, అనవసర గొడవలకు దారితీస్తుంది.  సీల్డ్ బాటిల్స్ కూడా అనుమతించరు. గతంలో  1-2 లీటర్ల వరకు అనుమతి ఉందని  ప్రచారం ఉన్నప్పటికీ  2025లో అధికారికంగా పూర్తి నిషేధం. రాష్ట్రాల మధ్య ప్రయాణాల్లో డ్రై స్టేట్స్  గుజరాత్, బిహార్, నాగాలాండ్ వంటి చోట్ల మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారు.  ట్రైన్‌లో, ప్లాట్‌ఫామ్‌లలో లేదా స్టేషన్లలో మద్యం తాగడం చట్టవిరుద్ధం. రన్నింగ్ స్టాఫ్  డ్రైవర్లు, గార్డులు  మద్యం తాగకూడదు.  సీల్డ్ బాటిల్స్ కూడా అనుమతి లేదు. పాత నియమాల్లో 750 మి.లీ. నుంచి 2 లీటర్ల వరకు పరిమితి ఉండేది.. కానీ ఇప్పుడు అనుమతించడం లేదు.       


గతంలో సీల్డ్ బాటిళ్లకు అనుమతి - ఇప్పుడు నిషేధం 


మద్యం తీసుకెళ్లడం రాష్ట్ర ఎక్సైజ్ చట్టాలపై ఆధారపడి ఉంటుంది.  గుజరాత్, బిహార్, మిజోరామ్, నాగాలాండ్, లక్షద్వీప్ లలో మద్య నిషేధం ఉంది. ఆయా రాష్ట్రాల మీదుగా మద్యం తీసుకెళ్లడం చట్టవిరుద్ధం. ఇక్కడి రైల్వే స్టేషన్లలో రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు చెకింగ్ చేస్తారు.  ఉదాహరణకు, గుజరాత్ దాటి ముంబైకి వెళ్తున్న ట్రైన్‌లో మద్యం ఉంటే, ఆ స్టేట్‌లోనే పట్టుబడితే కేసు పెడతారు. 


మద్యం తీసుకెళ్లడం లేదా తాగడం పట్టుబడితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జరిమానా విధిస్తుంది. ధారణంగా ₹500 నుంచి ₹5,000 వరకు, కానీ డ్రై స్టేట్స్‌లో ₹10,000 వరకు లేదా జైలు శిక్ష కూడా ఉంటుంది.  ట్రైన్ నుంచి దింగేయటం, మద్యం జప్తు, లీగల్ యాక్షన్ వంటివి తీసుకుంటారు.  రైల్వే సిబ్బంది మద్యం తాగితే సస్పెన్షన్ లేదా  ఉద్ోయగం నుంచి తొలగిస్తారు.                          


గతంలో కొన్ని రాష్ట్రాల్లో సీల్డ్ బాటిల్స్ అనుమతించేవి, కానీ భద్రతా సమస్యలు పెరగడంతో 2025లో పూర్తి నిషేధం విధించారు. ఫ్లైట్స్‌లో చెక్డ్ బ్యాగేజ్‌లో 5 లీటర్ల వరకు అనుమతి ఉన్నప్పటికీ, ట్రైన్‌లలో ఇది అనుమతించడం లేదు.