Indian Origin Techie Buys Island Turns It Into A Paradise For Startups: సింగపూర్ సమీపంలోని ఓ ద్వీపం స్టార్టప్స్ కు ప్రత్యేకమైన కేంద్రంగా ఉంది. ఆ ద్వీపంలో నెట్ వర్క్ స్కూల్ ఉంది. అదొక్కటే ఉటుంది. ఈ నెట్ వర్క్ స్కూల్ వ్యవస్థాపకుడు బాలాజీ శ్రీనివాసన్.
బాలాజీ శ్రీనివాసన్, కౌన్సిల్ ఇంక్ సహ-వ్యవస్థాపకుడు, కాయిన్‌బేస్ మాజీ CTO, ఆండ్రీసెన్ హోరోవిట్జ్‌లో మాజీ జనరల్ పార్టనర్, ఈ ద్వీపాన్ని ఆగస్టు 2024లో సబ్‌స్టాక్ పోస్ట్ ద్వారా ప్రకటించారు. బిట్‌కాయిన్ ఉపయోగించి కొనుగోలు చేసిన ఈ ద్వీపంలో "నెట్‌వర్క్ స్కూల్" సెప్టెంబర్ 2024లో ప్రారంభమైంది. ఇది మూడు నెలల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, స్టార్టప్ వ్యవస్థాపకులు, టెక్ ఇన్నోవేటర్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం సిద్ధం చేశారు.
శ్రీనివాసన్ "నెట్‌వర్క్ స్టేట్" డిజిటల్-ఫస్ట్ అనే భావనతో దీన్ని రూపొందించారు. సాంకేతికత, క్రిప్టోకరెన్సీ, వ్యక్తిగత స్వేచ్ఛ, ఇన్నోవేషన్ వంటి లక్ష్యాలతో దీన్ని సిద్ధం చేశారు. ఉమ్మడిగా సాధించే అభివృద్ధిపై దృష్టి సారించే "విన్-అండ్-హెల్ప్-విన్" సమాజాన్ని సృష్టించడం లక్ష్యంగా దీన్ని క్రియేట్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు నిక్ పీటర్సన్, నెట్‌వర్క్ స్కూల్‌లో ఉంటున్నారు. ద్వీపంలోని సౌకర్యాల వర్చువల్ టూర్‌ను షేర్ చేశాడు. ఈ ప్రదేశాన్ని "జిమ్ రాట్స్ స్టార్టప్ వ్యవస్థాపకుల కోసం ఒక ఒయాసిస్"గా వర్ణించాడు. AI తరగతులు, జిమ్ వర్కౌట్‌లు, పోషకాహార భోజన సౌకర్యాల గురించి గొప్పగా చెప్పాడు. "కొత్త దేశం సృష్టించడం ఎలా ఉంటుందో" పరీక్షించే ప్రయోగంగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు.
బాలాజీ శ్రీనివాసన్ తమిళనాడు సంతతికి చెందిన యువకుడు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో BS, MS, PhD డిగ్రీలు పొందారు. డిజిటల్ యుగంలో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ద్వీపం టెక్ ఔత్సాహికులు , రిమోట్ వర్కర్ల కోసం ఒక ప్రత్యేక కేంద్రంగా గుర్తింపు పొందింది, భవిష్యత్తులో ఇటువంటి హబ్‌లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో శ్రీనివాస్ ఉన్నారు.
నెట్‌వర్క్ స్కూల్ "డార్క్ టాలెంట్" అంటే గుర్తింపు పొందని ఇన్నోవేటర్ల కోసం వేదికగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది, రిమోట్ వర్కర్లు, డిజిటల్ నోమాడ్‌లు, కంటెంట్ క్రియేటర్లు, ఫిట్‌నెస్ ట్రైనర్లు, ఈవెంట్ ప్లానర్లు, టెక్నాలజిస్ట్‌లను ఆకర్షిస్తోంది.