India Post Digipin : మనం పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా ఏదైనా పార్శల్ లేదా కొరియర్ని ఒక చిరునామా లేదా ప్రదేశానికి పంపినప్పుడు, మీరు ఆ ప్రదేశం పిన్ కోడ్ తెలుసుకోవడం అవసరం. పిన్ కోడ్ లోపం కారణంగా, మీ పార్శల్ కొన్నిసార్లు తప్పు చిరునామాకు డెలివరీ అవుతుంది. లేదా తిరిగి మీకే చేరుతుంది. కొన్ని సార్లు పార్శిల్ ఎటు వెళ్తుందో తెలియక ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి, పార్శల్ డెలివరీ ప్రక్రియను వేగవంతం చేయడానికి, ఖచ్చితత్వాన్ని తీసుకురావడానికి, ఇండియన్ పోస్ట్ (India Post) మే 27, 2025 న DIGIPIN సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ద్వారా, మీ చిరునామా, చిరునామా లేదా స్థానం ఆధారంగా ఒక పిన్ జనరేట్‌ అవుతుంది. దీని సహాయంతో మీ చిరునామా, అది ఇంటిదైనా లేదా కార్యాలయానిదైనా, కచ్చితంగా ట్రాక్ చేయవచ్చు.

Continues below advertisement

భారత పోస్ట్ (India Post) తన వినియోగదారుల కోసం డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ (DIGIPIN) సౌకర్యాన్ని ప్రారంభించింది. డిజిటల్ ఇండియా యుగంలో, ప్రజలకు ప్రభుత్వ సేవలు, చిరునామా గుర్తింపు, స్థాన ఆధారిత సౌకర్యాలను పొందడం సులభతరం చేయడానికి ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ (DIGIPIN) అనేది 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్, ఇది మీ స్థానం ఆధారంగా ఒక పిన్ లేదా కోడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కోడ్ 4× 4 గ్రిడ్‌లో స్థలాలను చూపుతుంది, దీని ద్వారా ఎవరి స్థానాన్నైనా ఖచ్చితంగా కనుగొనవచ్చు.

మీ ప్రాంతం DIGIPIN ఏమిటో ఎలా తెలుసుకోవాలి?

  • ఎవరైనా తమ ప్రాంతం DIGIPIN ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
  • DigiYatra / India Post / Digital Address సిస్టమ్ అధికారిక వెబ్‌సైట్ https://dac.indiapost.gov.in/mydigipin/homeని సందర్శించండి.
  • మ్యాప్ ఓపెన్ చేసిన తర్వాత, మీ ఇల్లు/స్థానాన్ని పిన్-పాయింట్ చేయండి.
  • స్థానాన్ని సెట్ చేసిన వెంటనే, మీ ప్రత్యేకమైన DIGIPIN జనరేట్‌ అవుతుంది.  
  • అనేక ప్రదేశాల్లో, పంచాయతీ/మున్సిపల్ కార్పొరేషన్ కూడా తమ ప్రాంతం డిజిపిన్‌ను విడుదల చేస్తున్నాయి, మీరు దీన్ని స్థానిక పోర్టల్ లేదా పౌర సేవా కేంద్రం నుంచి కూడా పొందవచ్చు.
  • DIGIPIN సౌకర్యం పూర్తిగా లొకేషన్‌ ఆధారితమైనది, కాబట్టి మీరు మీ చిరునామా లేదా మ్యాప్‌లో సరైన పాయింట్‌ను ఇవ్వాలి.

DIGIPIN ప్రయోజనాలు

  • DIGIPIN సహాయంతో, డెలివరీ భాగస్వామి మీ చిరునామా గురించి కచ్చితమైన సమాచారాన్ని కలిగి ఉంటారు, అది ఇల్లైనా లేదా మీ కార్యాలయమైనా, DIGIPIN కచ్చితమైన స్థానాన్ని చూపుతుంది.
  • DIGIPIN సహాయంతో, ఏదైనా అత్యవసర సేవ మీ ఇంటికి లేదా చిరునామాకు సులభంగా చేరుకోగలదు. DIGIPIN సౌకర్యం అత్యవసర సేవల కోసం కూడా అవసరం.
  • DIGIPIN సౌకర్యంలో, కస్టమర్ లేదా ఏ వ్యక్తి వ్యక్తిగత సమాచారం సేవ్ చేయదు, మీ భౌగోలిక స్థానం గురించిన సమాచారం మాత్రమే ఉంటుంది.
  • అవసరమైన ప్రభుత్వ సేవల్లో మీ ఇల్లు లేదా చిరునామా గురించిన సమాచారం కచ్చితంగా అడుగుతారు, అయితే DIGIPIN సహాయంతో విద్యుత్, నీరు, రేషన్ కార్డు మొదలైన వాటిలో చిరునామా ధృవీకరణ ప్రతిదీ వేగంగా, డాక్యుమెంట్లు లేకుండా చేయవచ్చు.

Continues below advertisement