Prime Minister Modi on Pahalgam Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.

Sachet App గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) ద్వారా CAP ఆధారిత ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్ అయిన సాచెత్ యాప్ (Sachet App) గురించి ప్రస్తావించారు. ఈ యాప్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉందని తెలిపారు. సాచెత్ యాప్ వెబ్‌సైట్‌లో "భౌగోళిక గూఢచారాన్ని ఉపయోగించి టెక్నికల్ పరికరాల ద్వారా ముందస్తు హెచ్చరికను రియల్ టైమ్’ అలర్ట్ చేస్తుంది. సాచెట్ వెబ్‌సైట్ ప్రకారం.. "XX-NDMAEW హెడర్ నుండి ఎంఎంఎస్ రూపంలో విపత్తులకు సంబంధించి హెచ్చరికలు వచ్చినప్పుడు ఆ యాప్ వినియోగదారు జాగ్రత్తగా ఉండనున్నారు.

యాప్ సాధారణంగా వాతావరణ సూచనలు, సమాచారం కోసం దాంతో పాటు సబ్‌స్క్రిప్షన్ సౌకర్యంతో విపత్తు హెచ్చరికలను అందించడానికి సైతం వినియోగిస్తున్నారు. యాప్ వినియోగదారు వారి డెస్క్‌టాప్ బ్రౌజర్‌లలో నోటిఫికేషన్‌లను పొందుతారు. సాచెత్ యాప్ ద్వారా విపత్తు సంబంధిత సమాచారం నోటిఫికేషన్లు మీరు పొందుతారని  వెబ్‌సైట్ తెలిపింది.

మహారాష్ట్ర, ఢిల్లీలో అధికంగా యూజర్లు

యాప్ RSS ఫీడ్‌లో సైతం వార్నింగ్ ప్రచురితం కానుంది. ఆ RSS ఫీడ్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకున్న వార్త సంస్థలు, ఇతర ఏజెన్సీలు ఈ అలర్ట్స్ పొందుతాయి. తద్వారా ఆ ఏజెన్సీలు తమ వినియోగదారులు, యూజర్లకు విపత్తులకు సంబంధించి హెచ్చరికను జారీ చేస్తాయి. సాధ్యమైనంత త్వరగా అలర్ట్స్ గురించి ప్రసారం చేయవచ్చు. ఆ వెబ్‌సైట్‌  డేటా ప్రకారం.. ఈ సాచెత్ యాప్‌ను ఉత్తరప్రదేశ్‌లో దాదాపు 5.4 కోట్ల మంది, మహారాష్ట్రలో 1.1 కోట్ల మంది, దేశ రాజధాని ఢిల్లీలో 46 కోట్ల సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు.

‘మన్ కీ బాత్’ 121వ ఎపిసోడ్​లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఈరోజు తీవ్ర వేదనతో మాట్లాడుతున్నా. పహల్గామ్​ ఘటన దేశ దుఃఖాన్ని ప్రతిబింబిస్తోంది. ఉగ్రవాద దాడి ప్రతి పౌరుడి హృదయాన్ని విచ్ఛిన్నం చేసింది.  ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి పౌరుడు కోపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని నేను అర్థం చేసుకున్నా. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి ఒక్కరూ ప్రగాఢ సానుభూతి చెందుతున్నారు’ అని మోదీ అన్నారు. 

‘పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారి కోపాన్ని ప్రతిబింబిస్తోంది. కాశ్మీర్‌లో శాంతి నెలకొంటున్న సమయంలో దేశ, జమ్ముకశ్మీర్​ శత్రువులకు ఇది నచ్చలేదు. ఉగ్రవాదులు, ఉగ్ర కుట్రదారులు కాశ్మీర్‌ను మరోసారి నాశనం చేయాలని కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద దాడి జరిగింది. ఉగ్రవాదంపై ఈ యుద్ధంలో దేశ ఐక్యతే మనకు అతిపెద్ద బలం. ఈ సవాలును ఎదుర్కోవాలనే మన సంకల్పాన్ని మనం బలోపేతం చేసుకోవాలి’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

1.4 బిలియన్ల భారతీయులకు ప్రపంచం అండగా నిలుస్తోందిఉగ్రదాడులను ప్రపంచ నేతలు ఖండించారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పహల్గామ్ దాడి తర్వాత అనేక మంది ప్రపంచ నాయకులు సందేశాలు, కాల్స్ లేఖల ద్వారా తమ విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ‘ప్రపంచ నాయకులు నాకు ఫోన్ చేశారు. లేఖలు రాశారు, సందేశాలు పంపారు. ఈ దారుణమైన ఉగ్రదాడిని అందరూ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో 1.4 బిలియన్ల భారతీయులకు మొత్తం ప్రపంచం అండగా నిలుస్తోంది’ అని అన్నారు.

భారత పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్ సైన్యం అందుకు తగ్గట్టుగానే దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో దేశంలో మీడియాకు, సోషల్ మీడియా యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున మీడియా కవరేజ్ విషయంలో మోదీ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. సోషల్ మిడియా యూజర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపింది. రక్షణ చర్యలను లైవ్ కవరేజ్ చేయొద్దని తెలిపింది. 

‘జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం (Live Coverage) చేయకూడదు.’ అని పేర్కొంది. ఇలా చేయడం వల్ల దేశానికి సంబంధించిన కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు శత్రువులు పసిగట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ అధికారులకు, ప్రభుత్వానికి చిక్కులు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే అలాంటి ప్రయత్నం చేయొద్దని కేంద్రం సూచించింది.