అన్వేషించండి

India Crude Oil: భారత్‌లో చమురు సంక్షోభం తప్పదా? అమెరికా నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి?

India Crude Oil: రష్యా, ఇరాన్ నుంచి ముడి చమురు దిగమతులపై ఉన్న ఆంక్షల మినహాయింపులను అమెరికా ప్రభుత్వం క్లోజ్ చేసింది. ఈ నిర్ణయం భారత్ చమురు సంస్థలు కొత్త ప్రత్యామ్నాయాల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా, రష్యా, ఇరాన్ చమురు దిగుమతులపై ఆంక్షలు పొడిగించదు.
  • భారత్ రష్యాపై ఆధారపడటం పెరగడంతో సవాలు ఎదుర్కొంటోంది.
  • ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే అమెరికా లక్ష్యంగా ఉంది.
  • భారత్ ప్రత్యామ్నాయ చమురు సరఫరాలపై దృష్టి సారించింది.

India Crude Oil: అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా, ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు దిగుమతులకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆంక్షల మినహాయింపులను ఇకపై పొడిగించబోమని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ఏప్రిల్‌ 15 వైట్‌ హౌస్‌ ప్రెస్‌ బ్రీఫింగ్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 

మార్చి 12 లోపు లోడ్ అయిన రష్యన్‌ కార్గోకు ఇచ్చిన 30 రోజుల సాధారణ లైసెన్స్‌ ఇప్పటికే ముగిసిపోయింది. కాగా ఇరాన్ చమురుపై ఉన్న మినహాయింపు ఏప్రిల19తో ముగియనుంది. ీ పరిణామం భారత్‌కు పెద్ద సవాలుగా మారింది. ఇటీవల కాలంలో భారత్ తన చమురు అవసరాల కోసం రష్యాపై ఆధారపడటం మళ్లీ పెరిగింది. 

అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటీ?

అమెరికా తన ఆంక్షల విధానాన్ని కఠినతరం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఉక్రెయిన్, మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధాల కారణంగా రష్యా, ఇరాన్‌ ార్థిక మూలాలను దెబ్బ తీయడం అమెరికా లక్ష్యం. మార్చి 11 కంటే ముందు సముద్రంలో ఉన్న కార్గోలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని బెస్సెంట్‌ వివరించారు. భారత్ వంటి దశాలు రాయితీ ధరలకు రష్యా చమురును భారీగా కొనుగోలు చేయడం ద్వారా రష్యాకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయనే అభిప్రాయం పశ్చిమ దేశాల్లో ఉంది. అందుకే ఈ మినహాయింపులను ముగించడం ద్వారా ఆ దేశాలపై ఒత్తిడి పెంచాలని అమెరికా భావిస్తోంది. 

గణాంకాలను పరిశీలిస్తే 2026 మార్చి నెలలో భారత్‌ రష్యా నుంచి రోజుకు దాదాపు 1.96 మిలియన్ బారెల్స్‌ ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది ఫిబ్రవరి నెలతో పోలిస్తే 53 శాతం ఎక్కువ. గత 9 నెలల్లో ఇది అత్యధిక స్థాయి. డిసెంబర్‌ 2025లో 1.21ఎంబీపీడీగా ఉన్న దిగుమతులు, జనవరి, ఫిబ్రవరి 2026లో 1.05ఎంబీపీడీకి పడిపోయాయి. కానీ మార్చిలో అనూహ్యంగా పెరిగాయి. 

భారత్ ఎదుర్కునే ఇబ్బందులు సమస్యలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతతో భారత్‌కు రెగ్యులర్‌గా వచ్చే చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. ఇలాంటి సమయంలో రష్యా చమురు భారత్‌కు ఒక రక్షణ కవచంలా నిలిచింది. 2023-24, 2024-25, ఆర్థిక సంవత్సరాల్లో భారత్‌ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా సుమారు 35.8 శాతం నుంచి 35.9  శాతంగా ఉంది. ఇప్పుడు మినహాయింపులు రద్దు కావడంతో ఈ భారీ కోటను భర్తీ చేయడం భారత్ ముందు ఉన్న సవాల్. 

ప్రత్యామ్నాయాలపై భారత్ దృష్టి 

అమెరికా నిర్ణయం తర్వాత భారత్ ఇప్పుడు తన డైవర్సిఫికేషన్ వ్యూహాన్ని వేగవంతం చేసింది. భారత్ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికే 40కిపైగా దేశాల నుంచి చమురును సేకరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. హర్మూజ్‌ జలసంధి వంటి వివాదాస్పద ప్రాంతాలకు అవతల ఉండే దేశాలపై భారత్ దృష్టి పెట్టింది. బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్ దేశాలు భారత్‌కు కీలక సరఫరాదారులుగా మారే ఛాన్స్ ఉంది. 2026 నాటికి రోజుకు 1.1 మిలియన్ బారెల్స్ ఉత్పత్తి సామర్థ్యంతో గయానా ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న చమురు ఎగుమతిదారుగా అవతరించింది. ఈ దేశంపై భారత్‌ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. నైజీరియా, అంగోలా దేశాల నుంచి స్థిరమైన సరఫరా కోసం ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. అమెరికా నుంచి షెల్ గ్యాస్, ముడి చమురు దిగుమతులను పెంచడం ద్వారా విశ్వసనీయతను, పరిమాణాన్ని భారత్ పెంచుకోవచ్చు. 

అమెరికా నిర్ణయంతో భారత్‌కు ఆర్థికంగా కొంత భారం పెరుగుతుంది. రష్యా నుంచి రాయితీ ధరలకు లభించిన చమురు ఇకపై లభించకపోవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి చమురును రవాణా చేయడం వల్ల ప్రైవేటు ఛార్జీలు పెరుగుతాయి. ట్యాంకర్ల లభ్యత కూడా తగ్గే ప్రమాదం ఉంది. 

Frequently Asked Questions

రష్యా, ఇరాన్ ముడి చమురుపై అమెరికా ఆంక్షల మినహాయింపులను ఎందుకు పొడిగించట్లేదు?

ఉక్రెయిన్, మధ్య ఆసియాలో యుద్ధాల నేపథ్యంలో రష్యా, ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ వంటి దేశాలు రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేయడం ద్వారా వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని అమెరికా భావిస్తోంది.

రష్యా, ఇరాన్ చమురుపై అమెరికా మినహాయింపులు ఎప్పటి వరకు ఉండేవి?

మార్చి 12 లోపు లోడ్ అయిన రష్యన్ కార్గోకు ఇచ్చిన 30 రోజుల లైసెన్స్ ఇప్పటికే ముగిసింది. ఇరాన్ చమురుపై ఉన్న మినహాయింపు ఏప్రిల్ 19తో ముగియనుంది.

అమెరికా నిర్ణయం భారత్‌కు ఎలాంటి సవాళ్లు తెచ్చిపెడుతుంది?

ఇటీవల కాలంలో భారత్ రష్యాపై ఆధారపడటం పెరిగింది. ఈ మినహాయింపులు రద్దు కావడం వల్ల, భారత్ తన చమురు అవసరాలను తీర్చడానికి ప్రత్యామ్నాయాలను వెతకాల్సి వస్తుంది.

భారత్ చమురు అవసరాల కోసం ఎలాంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతోంది?

భారత్ చమురు మార్కెటింగ్ సంస్థలు 40కి పైగా దేశాల నుంచి చమురును సేకరించడానికి ప్రయత్నిస్తున్నాయి. బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, గయానా వంటి దేశాలు కీలక సరఫరాదారులుగా మారే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TVK Vijay: గవర్నర్‌కు118 మంది ఎమ్మెల్యేల జాబితా ఇచ్చిన విజయ్ - శనివారమే సీఎంగా ప్రమాణ స్వీకారం!
గవర్నర్‌కు118 మంది ఎమ్మెల్యేల జాబితా ఇచ్చిన విజయ్ - శనివారమే సీఎంగా ప్రమాణ స్వీకారం!
Bengal CM Suvendu Adhikari: బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి - శనివారమే ప్రమాణం
బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి - శనివారమే ప్రమాణం
Tamil Nadu: విజయ్‌కు లైన్ క్లియర్ - మ్యాజిక్ ఫిగర్ 118 రెడీ - ప్రమాణ స్వీకారమే మిగిలింది !
విజయ్‌కు లైన్ క్లియర్ - మ్యాజిక్ ఫిగర్ 118 రెడీ - ప్రమాణ స్వీకారమే మిగిలింది !
Tamilnadu Vijay: విజయ్ ఇంటి ముందు అభిమానుల వింత ప్రవర్తన - ఈ వీడియోలు చూస్తే...
విజయ్ ఇంటి ముందు అభిమానుల వింత ప్రవర్తన - ఈ వీడియోలు చూస్తే...
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Collectors meeting second day: ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
ఆగస్టు 15న రెండున్నర లక్షల ఇళ్ల గృహప్రవేశాలు - కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం
Bengal CM Suvendu Adhikari: బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి - శనివారమే ప్రమాణం
బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి - శనివారమే ప్రమాణం
Janasena Politics: ఆ విషయంలో జనసేన ఘోరంగా ఫెయిల్... విజయ్ తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నా పార్టీ నుండి కౌంటర్ ఏది?
ఆ విషయంలో జనసేన ఘోరంగా ఫెయిల్... విజయ్ తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నా పార్టీ నుండి కౌంటర్ ఏది?
Kodangal Revanth Reddy: కొడంగల్‌ను బంగారు తునకగా మార్చుకుందాం - ప్రజలకు రేవంత్ పిలుపు
కొడంగల్‌ను బంగారు తునకగా మార్చుకుందాం - ప్రజలకు రేవంత్ పిలుపు
Trisha Web Series : గుండెలో 16సార్లు పొడిచి చంపేస్తాడు - సైకో కిల్లర్‌ను త్రిష ఎలా పట్టుకుంది?... ట్రెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
గుండెలో 16సార్లు పొడిచి చంపేస్తాడు - సైకో కిల్లర్‌ను త్రిష ఎలా పట్టుకుంది?... ట్రెండింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
AP CM Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Nora Fatehi Apology : పాటలో బూతు పదాలు - అపాలజీతో ఆగని బాలీవుడ్ బ్యూటీ... అనాథ బాలికల చదువు కోసం...
పాటలో బూతు పదాలు - అపాలజీతో ఆగని బాలీవుడ్ బ్యూటీ... అనాథ బాలికల చదువు కోసం...
Jubilee Hills Murder Case: జూబ్లీహిల్స్‌లో దారుణం- మాజీ డీజీపీ భార్య హత్య - నేపాలీ గ్యాంగ్ ఘాతుకం!
జూబ్లీహిల్స్‌లో దారుణం- మాజీ డీజీపీ భార్య హత్య - నేపాలీ గ్యాంగ్ ఘాతుకం!
Embed widget