సోషల్ మీడియాలో రకరకాల చాలెంజ్‌లు వస్తూ ఉంటాయి. ఆ చాలెంజ్‌లకు ఎవరైనా సెలబ్రిటీలు స్పందిస్తే అవి వైరల్ అయిపోతాయి. ఇటీవల బెంగాల్‌లో ఓ చిరు వ్యాపారి పాడిన కచ్చాబాదం పాట ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన పని లేదు. అలాగే గత ఏడాది బాగా పాపులర్ అయిన చాలెంజ్‌లలో ఒకటి జుగ్ను చాలెంజ్. బాద్షా అనే బాలీవుడ్ సింగర్, ర్యాపర్ పాడిన ఈ పాటలోని డాన్స్ ను అప్పట్లో సెలబ్రిటీలు కూడా కూడా అనుకరించారు. జుగ్ను చాలంజ్‌గా వైరల్ అయిపోయింది. అయితేఇటీవల ఆ జుగ్ను చాలెంజ్ వెనుకబడిపోయింది.కానీ ఇప్పుడు మళ్లీ ముందుకొచ్చింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఎందుకంటే.. ఓ ఎలిమెంటరీ స్కూల్ పాప.. జుగ్ను డాన్స్‌ను అదరగొట్టేసింది. ఆ వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్నారు నెటిజన్లు.
స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఆ బబ్లీ గర్ల్ .. జుగ్ను పాట స్టెప్పులను యాజిటిజ్‌గా దించేసింది. ఈ వీడియోను మోంటీ అనే డీజే తన అఫీషియల్ ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసేవారి సంఖ్య.. ఆ స్కూల్ పిల్లను అభినందించేవారి సంఖ్య అంతకంతకూపెరిగిపోతోంది.
సోషల్ మీడియా రాత్రికి రాత్రి కొంత మంది స్టార్లను చేసేస్తుంది. అందర్ని ఆకట్టుకునే ఒక్క స్టెప్ చాలు. ఇలాంటి చాలెంజ్‌ల ద్వారా.. ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్లు వెలుగులోకి వస్తున్నారు. జుగ్ను డాన్స్‌కు సంబంధించి అనేక మంది సెలబ్రిటీలు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ స్కూల్ బాలిక చేసిన డాన్స్ మాత్రం అందర్నీ మించిపోయింది.