By: Ram Manohar | Updated at : 16 Jun 2023 05:30 PM (IST)
యూపీలో ఓ వరుడు కట్నం అడిగాడన్న కోపంతో వధువు తరపు బంధువులు చెట్టుకి కట్టేశారు. (Image Credits: Twitter)
Viral Video:
యూపీలో ఘటన..
యూపీలోని ప్రతాప్‌ఘర్‌లో వింత సంఘటన జరిగింది. ఓ జంట పెళ్లి చేసుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి వరుడు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం మొదలైంది. వేదికపైన దండలు మార్చుకుంటుండగా..పెళ్లి కొడుకు కట్నం అడిగాడు. అంతే. వధువు తరపు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా గొడవకు దిగారు. కట్నం అడుగుతావా అంటూ నిలదీశారు. అక్కడితో ఆగలేదు. పెళ్లి కొడుకుని అమాంతం ఎత్తుకుని తీసుకొచ్చి చెట్టుకి కట్టేశారు. నానా బూతులు తిట్టారు. ఇంత చేస్తున్నా వరుడు ఒక్క మాటా అనలేదు. ఎందుకిదంతా చేస్తున్నారని ప్రశ్నించలేదు. "మా పరువు మర్యాదలతో ఆడుకుంటావా" అంటూ వధువు తరపు బంధువులు తిడుతుంటే సైలెంట్‌గా నిలబడిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్లు నచ్చజెప్పాల్సింది పోయి..."గట్టిగా కట్టేయండి" అని సలహాలు ఇచ్చారు. గంటల కొద్దీ అలాగే ఉంచారు. ఈ పెళ్లికి హాజరైన ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలాంటి వీడియోలు వైరల్ కాకుండా ఉంటాయా..? అది కాస్తా పోలీసుల దృష్టి వరకూ వెళ్లింది. వెంటనే ఆ వేదిక వద్దకు వచ్చారు. కట్లు విప్పి పెళ్లి కొడుకుకి విముక్తి కలిగించారు. ఆ తరవాత అదుపులోకి తీసుకున్నారు. రెండు వర్గాల వాళ్లూ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అక్కడ కూడా గొడవ పడ్డారు. సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నించినా అది వర్కౌట్ అవ్వలేదు. వధువు తరపు బంధులు మరో డిమాండ్ కూడా చేస్తున్నారు. పెళ్లికైన ఖర్చులంతా తిరిగి ఇచ్చేయాల్సిందేనని పట్టు పడుతున్నారు. పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అసభ్యంగా ప్రవర్తించారని, దీనికి తోడు వరుడు కట్నం అడగడం వల్ల వధువు తరపు బంధువులకు కోపం తెప్పించిందని స్థానికులు చెబుతున్నారు.
प्रतापगढ की तस्वीरें देखिए
दूल्हे ने किया शादी से इंकार ,दूल्हे को बंधक बनाकर दी गई तालिबानी सज़ा#pratapgarh pic.twitter.com/OtqTdzNj5A— Rahul Sisodia (@Sisodia19Rahul) June 15, 2023
యూపీలోనే మరో ఘటన..
తాళి కడతాడు అనుకున్న టైమ్‌లో ఉన్నట్టుండి మ్యారేజ్ హాల్ నుంచి పారిపోయాడు వరుడు. పెళ్లికొచ్చిన వాళ్లంతా ఇది చూసి షాక్ అయ్యారు. "ఇదేం వింత" అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ వధువు మాత్రం అలా నిలబడిపోలేదు. ఇక్కడి వరకూ వచ్చాక తాళి కట్టకుండా వెళ్తావా అని ఆ వరుడి వెంట పడింది. చాలా దూరం వరకూ తరిమింది. నిలదీసి మరీ తాళి కట్టించుకుంది. యూపీలోని బరేలీలో జరిగిందీ వింత ఘటన. తనకు పెళ్లి ఇష్టం లేదని చివరి క్షణంలో చెప్పడం వల్ల వచ్చిన తంటా ఇది. కానీ...ఆ వధువు మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుపట్టింది. పంతం నెగ్గించుకుంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఈ జంట రిలేషన్షిప్లో ఉంది. ముహూర్త సమయానికి వరుడు కనిపించకపోయే సరికి ఆ అమ్మాయికి డౌట్ వచ్చింది. వెంటనే కాల్ చేసింది. "అమ్మను తీసుకురావడానికి వచ్చాను" అని అబద్ధం చెప్పాడు వరుడు. ఇది నమ్మని ఆ యువతి వెంటనే వరుడి కోసం వెతకడం మొదలు పెట్టింది. పెళ్లి డ్రెస్‌లోనే బయటకు వచ్చి గాలించింది. దాదాపు 20 కిలోమీటర్ల వరకూ వెంటపడి మరీ వరుడిని పట్టుకుంది. ఓ పోలీస్ స్టేషన్ సమీపంలోని బస్సులో కనిపించాడు వరుడు. చాలా సేపు డ్రామా తరవాత దగ్గర్లోని ఆలయానికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంది వధువు. ఇరు వర్గాలూ కాసేపయ్యాక శాంతించి...జంటను ఆశీర్వదించాయి.
Jaahnavi Kandula: జాహ్నవి కందులను హేళన చేసిన అధికారి సస్పెండ్, వెల్లడించిన సియాటెల్ పోలీసులు
GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల- సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు ఇదే!
Law Commission: లైంగిక కార్యకలాపాల సమ్మతి వయస్సును 16 ఏళ్లకు తగ్గించవద్దు, కేంద్రానికి లా కమిషన్ నివేదిక
Bank CEO Quits: క్యాబ్ డ్రైవర్ అకౌంట్‌లోకి 9వేల కోట్లు - ఆ బ్యాంకు సీఈవో రాజీనామా!
Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?
అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!
Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి
IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
/body>