Viral Video: 



హైవేపైనే రొమాన్స్..


యూపీలోని ఘజియాబాద్‌లో ఓ జంట బైక్‌పైనే రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. బైక్‌పై యువతి పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని బండి నడుపుతున్న యువకుడిని గట్టిగా హగ్ చేసుకుంది. హైవేపై ఇద్దరూ ఇలాగే చాలా దూరం ట్రావెల్ చేశారు. వెనకాల కార్‌లో వస్తున్న ఓ వ్యక్తి ఇది గమనించి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పబ్లిక్ ప్లేస్‌లో ఏంటీ రచ్చ అంటూ ఆ వ్యక్తి పెద్ద పోస్ట్ పెట్టాడు. కేవలం వైరల్ అవ్వడం కోసమే ఇలా రోడ్లపై స్టంట్‌లు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యాడు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఆ నెటిజన్ రిక్వెస్ట్ చేశాడు. హెల్మెట్‌లు కూడా పెట్టుకోకుండా ఇద్దరూ ఇలాంటి స్టంట్‌లు చేస్తున్నారని, వీళ్ల వల్ల మిగతా వాళ్లూ ప్రమాదంలో పడే అవకాశముందని అసహనం వ్యక్తం చేశాడు. ఈ వీడియోని చాలా మంది ట్విటర్ యూజర్స్ రీట్వీట్ చేశారు. ఆ ట్వీట్స్‌లో యూపీ పోలీస్‌తో పాటు ఘజియాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అకౌంట్‌లనూ ట్యాగ్ చేశారు. "ఇది యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది. ఇక్కడ రూల్స్ ఏమీ వర్తించవా..? ఆ అమ్మాయి ఎలా కూర్చుందో చూడండి" అని పోస్ట్‌లు పెట్టారు. దీనిపై ఘజియాబాద్ డిప్యుటీ కమిషనర్ స్పందించారు. తప్పకుండా విచారిస్తామని తేల్చి చెప్పారు. ఆ ఇద్దరిపైనా చర్యలు తీసుకోవాలని ఇందిరాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇన్‌స్పెక్టర్‌కి ఇప్పటికే చెప్పినట్టు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరికీ భారీ జరిమానా విధించారు. ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.