అన్వేషించండి

Keralam CM Oath Taking: కేరళం కొత్త సీఎంగా వి.డి సతీశన్ ప్రమాణం.. 14 మంది కొత్త వారికి మంత్రి పదవులతో రికార్డ్

Keralam New CM | కేరళం ముఖ్యమంత్రిగా వి.డి. సతీశన్ ప్రమాణం చేశారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం, మంత్రులతో ప్రమాణం చేయించారు.

 Kearala New CM VD Satheesan | తిరువనంతపురం: కేరళం నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వి.డి. సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కేరళం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ మొదట ముఖ్యమంత్రి సతీశన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం మంత్రులతో గవర్నర్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. రమేశ్ చెన్నితాలకు హోం శాఖ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

కేబినెట్‌లో 14 మంది కొత్త వారికి ఛాన్స్ 
కేరళ క్యాబినెట్ లో ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం 20 మంది మంత్రులలో 14 మంది తొలిసారిగా మంత్రి పదవులను చేపడుతున్నారని సీఎం సతీశన్ ప్రకటించారు. కొత్త రక్తాన్ని ప్రోత్సహించడంతో పాటు, మంత్రివర్గంలో ఇద్దరు మహిళలకు, అలాగే ఎస్సీ (SC) వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు చోటు కల్పించినట్లు వివరించారు. ఈ మేరకు ఖరారు చేసిన మంత్రుల తుది జాబితాను కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు సతీశన్ ఇదివరకే అందజేశారు.

కేరళ మంత్రుల జాబితా (Kerala Ministers List)
కాంగ్రెస్ పార్టీ

1. వి.డి. సతీశన్ (ముఖ్యమంత్రి)
2. రమేశ్ చెన్నితాల
3. కె. మురళీధరన్
4. సన్నీ జోసెఫ్
5. ఎ.పి. అనిల్ కుమార్
6. పి.సి. విష్ణునాథ్
7. టి. సిద్ధిఖ్
8. బిందు కృష్ణ (మహిళ)
9. కె.ఎ. తులసి (మహిళ)
10. రోజీ ఎమ్. జాన్
11. ఎమ్. లిజు
12. ఒ.జె. జనీష్

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)
13. పి.కె. కున్హలికుట్టి
14. ఎన్. శంషుద్దీన్
15. కె.ఎమ్. షాజీ
16. పి.కె. బషీర్
17. వి.ఇ. అబ్దుల్ గఫూర్

ఇతర కూటమి పార్టీలు 
18. మోన్స్ జోసెఫ్ (కేరళ కాంగ్రెస్ - జోసెఫ్)
19. షిబు బేబీ జాన్ (రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ - RSP)
20. అనూప్ జాకబ్ (కేరళ కాంగ్రెస్ - జాకబ్)
21. సి.పి. జాన్ (కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ - CMP)

ఇదివరకే వి.డి. సతీశన్ క్యాబినెట్ కూర్పును అధికారికంగా పూర్తి చేశారు. యూడీఎఫ్ (UDF) కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరం మొత్తం 20 మందితో కూడిన మంత్రుల జాబితాను ఆయన ఆదివారం నాడు ఖరారు చేశారు. ఈ కొత్త మంత్రివర్గంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలకు పెద్దపీట వేసినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.

మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రమేశ్ చెన్నితాల, కె.మురళీధరన్, ఎ.పి.అనిల్ కుమార్, సన్నీ జోసెఫ్‌లకు కీలక స్థానాలు లభించాయి. అలాగే, కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీకి ఐదు మంత్రి పదవులు దక్కాయి. ఈ ఐదుగురి పేర్లను ఐయూఎంఎల్ అధినేత సాదిక్ అలీ షిహాబ్ తంగల్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ నేత థిరువాంచూర్ రాధాకృష్ణన్‌ను, డిప్యూటీ స్పీకర్‌గా మహిళా నేత షనిమోల్ ఉస్మాన్‌ను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి వీడీ సతీశన్ స్పష్టం చేశారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EPFO 3.0 ATM Withdrawal: పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏటీఎంలో విత్‌డ్రా అప్‌డేట్ వచ్చేసింది !
పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏటీఎంలో విత్‌డ్రా అప్‌డేట్ వచ్చేసింది !
Breaking News:RRR కస్టోడియల్ టార్చర్ కేసులో బిగ్ ట్విస్ట్- సునీల్ నాయక్‌ను లొంగిపోమన్న ఏపీ హైకోర్టు 
RRR కస్టోడియల్ టార్చర్ కేసులో బిగ్ ట్విస్ట్- సునీల్ నాయక్‌ను లొంగిపోమన్న ఏపీ హైకోర్టు 
NDA Delimitation Magic Number:ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
ఢిల్లీ పీఠంపై బీజేపీకి తిరుగులేని పట్టు! డీలిమిటేషన్ వైపు మోదీ సర్కార్‌ వేగంగా అడుగులు! జస్ట్‌ 6 ఓట్లు దొరికితే ఆ బిల్లులు అమోదం పొందినట్టే!
Ambernath Suicide Case:బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
బెడ్‌ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టిన డాక్టర్ బాబు! పెళ్లయిన 48 రోజుల్లోనే నవ వధువు సూసైడ్!
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa In Telangana 2026: తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
Government School Admissions: పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
Kadiri TDP BJP controversy: బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
Elon Musk: పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
Save The Tigers 3 First Review: 'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
Cristiano Ronaldo Struggles : పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
Samantha: సమంత కటౌట్స్... స్టార్ హీరోస్ రేంజ్‌లో - ఇదెక్కడి మాస్ మావా
సమంత కటౌట్స్... స్టార్ హీరోస్ రేంజ్‌లో - ఇదెక్కడి మాస్ మావా
Karumuri son Sunil arrested by ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
Embed widget