ఉత్తర్ ప్రదేశ్ ఎటా జిల్లా అవగాడ్ మండలం గులేరియా వాసికి చెందిన ఓంవతీ దేవి రైలు పట్టాల మీదుగా పొలానికి వెళ్లింది. అయితే కుస్బారైల్వే స్టేషన్ సమీపంలో పట్టలు విరిగి ఉండటాన్ని ఆమె గమనించారు. రైల్వే అధికారులకు చెప్పేందుకు టైంలో లేదు. ట్రైన్ వస్తున్నట్టు కూడా ఎక్కడో కూత వినిపిస్తోంది. ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు.
ఇలా రెండు నిమిషాలు ఆలోచించిన ఆమెకు ఓ ఐడియా తట్టింది. వెంటనే ఆలోచన ఆచరణలో పెట్టింది. రైలు పట్టాలు విరిగిపోయిన ప్లైస్‌నుంచి కాస్త దూరం రైలు వస్తున్న వైపు ముందుకు వెళ్లింది. అక్కడ పట్టాలకు ఇరువైపుల రెండు కొమ్మలను పాతిపెట్టింది. ఆ కొమ్మలకు తాను కట్టుకున్న చీరను విప్పేసి కట్టింది.
పట్టాలకు ఎదురుగా ఎర్ర చూసి ట్రైన్ ఆపుతారని ఆమె ఆలోచన. మొత్తానికి ఆమె ఆలోచన ఫలించింది. కాసేపటికి అటుగా వచ్చిన పాసింజర్ రైలు ఆగిపోయింది. డ్రైవర్ దిగి పరిస్థితిని తెలుసుకున్నాడు.
అక్కడే ఉన్న ఓంవతీ దేవిని చూసి పరిస్థితి అర్థం చేసుకున్న డ్రైవర్.. ఆ చీరను ఆమెకు ఇచ్చేశాడు. పట్టాలు విరిగిపడి ఉన్న సంగతిని ఉన్నతాధికారులకు చెప్పాడు. సుమారు గంటపాటు ట్రైన్ ఆగిపోయింది. ఆమె చేసిన సాహసాన్ని అక్కడి వారంతా అభినందించారు. ఆమెకు కొంత నగదు అందజేశారు.
ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలను, వీడియోను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు అధికారి సచిన్ కౌషిక్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎరుపు రంగు ప్రమాదాన్ని గుర్తని.. అందుకే తాను అలా చేశానంటూ చెప్పుకొచ్చారు ఓంవతి.