Union Cabinet Decisions approves new pension scheme for employees | న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ 3 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. విజ్ఞాన్ ధార పేరుతో కొత్త పెన్షన్ స్కీమ్ తీసుకురానుంది. 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే పూర్తి పెన్షన్ ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ( 11, 12వ తరగతి) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బయో ఈ-3 విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బయో ఈ3 (బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్) నిర్ణయాలకు ఆమోదం లభించింది.
ఉద్యోగుల కోసం కేంద్ర మంత్రివర్గం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS) ను నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదించింది. రిటైర్మెంట్ తరువాత వారి జీతంలో 50 శాతం పెన్షన్‌ను అందించాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ కొత్త పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఉద్యోగులకు పెన్షన్ పై మార్పులు చేయాలని డిమాండ్లు వస్తున్న సమయంలో.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) స్థానంలో యూపీఎస్ ను కేంద్రం తీసుకొస్తుంది. ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త పెన్షన్ స్కీమ్ అమల్లోకి రానుంది. దీని ద్వారా పింఛనుదారులు గత 12 నెలల సర్వీస్ శాలరీలో బేసిక్ శాలరీలో 50 శాతాన్ని పింఛన్ గా అందుకుంటారు. అయితే ఆ రిటైరైన ఉద్యోగులు 25 సంవత్సరాలు పనిచేసినట్లు అయితేనే ఈ ప్రయోజనాలు పొందుతారు.
Also Read: బాధ్యతలన్నీ తీరిపోయాయి - ముకేష్ , నీతా అంబానీల రిలాక్స్‌డ్ లైఫ్ ఎలా ఉందో తెలుసా ?