Udhayanidhi Stalin: రాష్ట్రాలను బలహీన పరచాలని కేంద్రం కుట్ర చేస్తోంది- ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ABP Southern Rising Summit 2025: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు కాలరాయాలని చూస్తోందని, రాజకీయంగా, ఆర్థికంగా బలహీనం చేయాలని చూస్తోందని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు.

ABP Southern Rising Summit 2025: ABP సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాయాలని చూస్తోందని, రాష్ట్రాల పేర్లు మార్చాలని కుట్ర చేస్తుందన్నారు. ఉదయనిధి మాట్లాడుతూ, కోయంబత్తూరులో మెట్రో ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. తగినంత జనాభా లేకపోవడమే కారణమని కేంద్రం చెబుతోంది. తమిళనాడు గవర్నర్ రాష్ట్రం పేరు మార్చాలని చూశారు... అనంతరం జరిగిన పరిణామాల తర్వాత, ఆయన తన నిర్ణయంపై వెనక్కి తగ్గారని ఉదయనిధి స్టాలిన్ సంచలన విషయాలు వెల్లడించారు.
రాష్ట్రాలను బలహీనపరచాలని కేంద్రం కుట్రలు..
కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారాలను తన ఆధీనంలో ఉంచుకోవాలని చూస్తోంది. ఆర్థికంగా బలమైన రాష్ట్రాలను రాజకీయంగా బలహీనంగా, రాజకీయంగా బలమైన రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనంగా చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్రం చేసే చర్యలను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించవు. మనల్ని కేంద్ర ప్రభుత్వం అని ఎలా పిలవవచ్చో కేంద్ర ప్రభుత్వం చెబుతోంది, కానీ మన రాష్ట్రాల పేర్లు మార్చాలని చూస్తారు. మన హక్కులను కాలరాసే ప్రయత్నం కేంద్రం చేస్తోందన్నారు.
డ్రవిడియన్ మోడల్ ఫాలో అయితేనే రాష్ట్రాలకు ప్రయోజనం..
‘ప్రతిష్టాత్మక ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. కేంద్రాలకు మాత్రమే అధికారాలు పరిమితం అవుతున్నాయి. రాష్ట్రాల హక్కులు హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళనాడు మోడల్ నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాల్సి ఉంది. గతంలోనే ఇదే విషయం చెప్పాను. Dravidian Alagarithm విషయానికి వస్తే.. భారత్ అంటే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమూహంగా చూడాలి. ఆల్‌గారిథమ్ అంటే సరైన ఔట్ పుట్ రావడానికి కంప్యూటర్‌కు స్టెప్ బై స్టెప్ సూచనలు ఇచ్చి కావాల్సిన ఫలితాన్ని పొందుతాం. అదే విధంగా ఇప్పుడు తమిళనాడులో ద్రవిడియన్ ఆల్‌గారిథమ్ ఫాలో అవుతాం. రాజకీయంగా ఎలా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే ఏకమవుతాం. దేశంలోని ఇతర రాష్ట్రాలు మా విధంగానే ఆలోచిస్తే ప్రయోజనం ఉంటుందని’ ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
కుటుంబ నియంత్రణతో దక్షిణాది రాష్ట్రాలు నేడు నష్టపోతున్నాయి..
గతంలో కుటుంబ నియంత్రణ విధానం రావడంతో దక్షిణాది రాష్ట్రాలను వాటిని సరిగ్గా అమలు చేశాయి. దాంతో నేడు మనకు తక్కువ పేరుతో అన్యాయం జరుగుతుంది. ఉత్తరాధి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించకపోవడం నేడు వారి ఎంపీ సీట్లను పెంచి వారి అధికారాలను మరింత పెంచుతుంది. జనాభా తక్కువ ఉన్నారనే సాకులు చెప్పి తమిళనాడులోని కొయంబత్తూరు, మధురై సిటీలలో మెట్రో ప్రాజెక్టులను కేంద్రం అడ్డుకుంటోంది. డిలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు మరింత నష్టం చేకూరుతుంది. దీనిపై బాధిత రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని’ ఉదయనిధి పిలుపునిచ్చారు.






















