అన్వేషించండి

Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు

NHAI టోల్ బూత్‌ల వద్ద ఉండే పొడవైన ట్రాఫిక్ జామ్ తొలగించి, మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడానికి ఏప్రిల్ 10 నుంచి టోల్ ప్లాజాల వద్ద క్యాష్ లెస్ పేమెంట్స్ మాత్రమే అంగీకరించనున్నారు.

No Cash payments at Toll Plazas:

న్యూఢిల్లీ: భారత్‌లో టోల్ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా NHAI అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా NHAI ఇటీవల టోల్ వ్యవస్థలో కొన్ని మార్పులు చేయగా.. ఇవి ఏప్రిల్ 10 నుండి అమలులోకి వస్తాయి. దాని ప్రకారం నేషనల్ హైవేలపై టోల్ చెల్లింపులు నగదు (Cash) రూపంలో చేయలేరు. వాహనదారులు కేవలం FASTag లేక UPI ద్వారా మాత్రమే టోల్ ఛార్జీలు చెల్లించాలి. టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్ తగ్గించడం, ప్రయాణికుల టైం ఆదా చేయడం దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇప్పటికే టోల్ చెల్లింపులు చాలావరకు FASTag ద్వారా జరుగుతున్నాయి. కానీ ఏప్రిల్ 10 నుంచి నేషనల్ హైవేలపై పూర్తిగా నగదు చెల్లింపుల నిలిపివేత అమలులోకి వస్తుంది. అయితే యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వారికి టోల్ ఛార్జీలు సైతం పెరగనున్నాయి.

FASTag లేక UPI ద్వారా టోల్ చెల్లింపులు
ఈ కొత్త పద్ధతిలో టోల్ ఛార్జీలను వాహనదారులు FASTag, UPI వంటి డిజిటల్ విధానాల్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై వాహనదారులు నగదు రూపంలో టోల్ చెల్లించలేరు. దాంతో దేశంలో FASTag కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. కొత్త యాన్యువల్ పాస్‌లు తీసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా వాహనానికి FASTag లేకపోతే వారు UPI ద్వారా పేమెంట్ చేయవచ్చు. యూపీఐ ద్వారా పేమెంట్ చేసేవారు సాధారణ ఛార్జీ కంటే 1.25 రెట్లు అదనపు మొత్తాన్ని పేమెంట్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దాంతో టోల్ వసూళ్లు వేగంగా, ట్రాఫిక్ తగ్గడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతుంది.

మినహాయింపు నిబంధనలలో మార్పులు
కొత్త నిబంధనల ప్రకారం కేవలం చెల్లుబాటు అయ్యే మినహాయింపు FASTag లేదా యాన్యువల్ పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ప్రయాణంలో కేవలం ID కార్డు చూపి టోల్ కట్టకుండా వెళ్లే పద్ధతికి ముగింపు పలకనున్నారు. ప్రభుత్వ వాహనాల ఎంట్రీకి కూడా ఇకపై మినహాయింపు పాస్ ఉండాలి. లేకపోతే ప్రభుత్వ వాహనాలను సైతం వెళ్లనివ్వరు. గతంలో చాలా మంది ప్రభుత్వ కార్డులను తమ వ్యక్తిగత పనులకు మినహాయింపు కోసం ఉపయోగించేవారు. టోల్ ఛార్జీల నుంచి తప్పించుకునేవారు. దేశంలోని పలు జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై 1,150కి పైగా Toll plazas ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త విధానాలు అమలులోకి తెస్తున్నట్లు అధికారులు ఇటీవల ప్రకటించారు.

ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి యాన్యువల్ పాస్ బెస్ట్ 
ఓ ఏడాదిలో ఎక్కువ ప్రయాణాలు చేసే వారికి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ మంచి ఆప్షన్ అని భావిస్తున్నారు. తద్వారా పదేపదే రీఛార్జ్ చేయవలసిన అవసరం ఉండదు. ఒకసారి పేమెంట్ చేసి  పదేపదే టోల్ కట్టడానికి రీఛార్జ్ చేసే సమస్య నుండి తప్పించుకోవచ్చు. ఇటీవల యాన్యువల్ పాస్ ధరను పెంచారు. గతంలో 3000గా ఉండే వార్షిక పాస్ ధరను ఏప్రిల్ 1 నుంచి రూ. 3075 కు పెంచారు. ఈ పాస్ ద్వారా ఒక ఏడాదిలో సుమారు 200 ప్రయాణాలకు అవకాశం కల్పిస్తుంది. అత్యవసర సమాయాల్లో మీరు ఫాస్టాగ్ రీఛార్జ్ మరిచిపోయినా, యాన్యువల్ పాస్ ఉంటే మీకు ఏ సమస్యా ఉండదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Strait of Hormuz: హర్మూజ్‌లో భారత చమురు నౌకపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
హర్మూజ్‌లో భారత చమురు నౌకపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
PM Modi Speech: మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
PM Modi: మహిళల్ని విపక్షాలు అవమానించాయి.. ఎంతో ఆవేదన చెందాను - ప్రధాని మోదీ స్పీచ్ Watch Live
మహిళల్ని విపక్షాలు అవమానించాయి.. ఎంతో ఆవేదన చెందాను - ప్రధాని మోదీ స్పీచ్ Watch Live
Modi to Address Nation :రాత్రికి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి మోదీ
రాత్రికి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి మోదీ
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 SRH VS CSK Result Update: హ‌మ్మ‌య్య స‌న్ గెలిచింది.. చివ‌రి బంతికి గెలిచిన SRH.. స‌త్తా చాటిన మ‌లింగా, బ్యాటింగ్ వైఫ‌ల్యంతో చెన్నై బోల్తా
హ‌మ్మ‌య్య స‌న్ గెలిచింది.. చివ‌రి బంతికి గెలిచిన SRH.. స‌త్తా చాటిన మ‌లింగా, బ్యాటింగ్ వైఫ‌ల్యంతో చెన్నై బోల్తా
Pawan Kalyan undergoes surgery: పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత - అత్యవసర ఆపరేషన్ చేసిన వైద్యులు
పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత - అత్యవసర ఆపరేషన్ చేసిన వైద్యులు
Rythu Bharosa Scheme: రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలపై ప్రకటన
రైతులకు గుడ్‌న్యూస్.. రెండో విడత రైతుభరోసా నిధుల విడుదలపై ప్రకటన
Improvement For Inter 2nd Year: ఇకపై ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ రాసే ఛాన్స్.. ఫీజు కట్టేయండి
ఇకపై ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్‌ రాసే ఛాన్స్.. ఫీజు కట్టేయండి
Zolgensma injection cost:  పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
 పునర్విక ప్రాణాలు కాపాడిన ఇంజక్షన్ 16కోట్లా..? Zolgensma ఎందుకంత కాస్ట్.. ?
Razor Trailer: చిన్నారి కోసం రవిబాబు రక్తపాతం... యాక్షన్ ప్యాక్డ్ 'రేజర్' ట్రైలర్ రిలీజ్
చిన్నారి కోసం రవిబాబు రక్తపాతం... యాక్షన్ ప్యాక్డ్ 'రేజర్' ట్రైలర్ రిలీజ్
Rebirth of Punarvika: చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
చిన్నారి పునర్వికకు పునర్జన్మ- రూ.16 కోట్ల ఇంజక్షన్ చికిత్స పూర్తి - లోకేష్ ట్వీట్ వైరల్
AP New SEC: ఏపీ లోకల్ పోల్స్ కు లైన్ క్లియర్ - కొత్త ఎస్‌ఈసీగా పునేఠా నియామకం
ఏపీ లోకల్ పోల్స్ కు లైన్ క్లియర్ - కొత్త ఎస్‌ఈసీగా పునేఠా నియామకం
Embed widget