Trains cancelled News: భారతీయ రైల్వే ప్రపంచంలో నాల్గో అతిపెద్ద రైల్వే వ్యవస్థ. ఇప్పుడు ఇది మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీని కోసం, వివిధ మార్గాల్లో కొత్త లైన్లను జోడించే పని జరుగుతోంది. రైల్వే నెట్‌వర్క్‌ను సక్రమంగా నిర్వహించడానికి, వివిధ మార్గాల్లో ట్రాక్‌లు,  సిగ్నలింగ్‌ను మరమ్మత్తు చేసే పని కూడా జరుగుతుంది.

Continues below advertisement


దీని కారణంగా చాలా రైళ్లను రద్దు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగవచ్చు. మీరు కూడా త్వరలో ప్రయాణించాలనుకుంటే, స్టేషన్‌కు చేరుకునే ముందు మీ రైలు స్టాటస్‌ తప్పనిసరిగా చెక్ చేసుకోండి. రాబోయే ఏడు రోజులలో రద్దు చేసిన దారి మళ్లించిన రైళ్ల, అప్‌డేట్ చేసిన జాబితాను రైల్వే విడుదల చేసింది.


రైల్వే ఈ రైళ్లను రద్దు చేసింది


మీరు వచ్చే వారం రైలులో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే, ఈ వార్త మీ కోసం. భారతీయ రైల్వే ప్రస్తుతం తన నెట్‌వర్క్‌ను మరింత సురక్షితంగా, అప్‌డేట్ చేయడానికి కృషి చేస్తోంది. ఈ పనిలో భాగంగా, నవంబర్ 21 వరకు షాలిమార్ స్టేషన్ యార్డ్‌లో రీమోడలింగ్, ట్రాక్ అప్‌గ్రేడ్ పనులు జరుగుతున్నాయి. ఇది చక్రధర్‌పూర్ డివిజన్ గుండా వెళ్ళే అనేక దూరపు రైళ్లపై ప్రభావం చూపింది, వాటిలో కొన్ని రద్దు అయ్యాయి.


ఈ పనిని సురక్షితంగా, సకాలంలో పూర్తి చేయడానికి ఈ చర్య అవసరమని రైల్వే తెలిపింది. కొన్ని రైళ్ల మార్గాల్లో కూడా మార్పులు చేశారు. ప్రయాణానికి ముందు మీ రైలు తాజా స్టాటస్‌ను ఆన్‌లైన్‌లో లేదా హెల్ప్‌లైన్ ద్వారా తనిఖీ చేయాలని ప్రయాణికులకు సూచించారు.


రద్దు చేసిన రైళ్ల జాబితా



  • రైలు నంబర్ 18030 షాలిమార్ - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ కుర్లా ఎక్స్‌ప్రెస్ నవంబర్ 13 నుంచి 21 వరకు రద్దు అయ్యింది.

  • రైలు నంబర్ 22830 షాలిమార్ - భుజ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 15న రద్దు అయ్యింది.

  • రైలు నంబర్ 22829 భుజ్ - షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 18న రద్దు అయ్యింది.

  • రైలు నంబర్ 15022 గోరఖ్‌పూర్ - షాలిమార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 10,  17న రద్దు చేశారు.

  • రైలు నంబర్ 15021 షాలిమార్ - గోరఖ్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 18న రద్దు చేశారు. 

  • రైలు నంబర్ 18029 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - షాలిమార్ కుర్లా ఎక్స్‌ప్రెస్ నవంబర్ 12 నుంచి 19 వరకు రద్దు అయ్యింది.

  • రైలు నంబర్ 12151 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - షాలిమార్ సమరసత ఎక్స్‌ప్రెస్ నవంబర్ 12, 13, 19న రద్దు అయ్యింది.

  • రైలు నంబర్ 12152 షాలిమార్ - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ సమరసత ఎక్స్‌ప్రెస్ నవంబర్ 14, 15, 21న రద్దు అయ్యింది.

  • రైలు నంబర్ 20971 ఉదయపూర్ సిటీ - షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 15న రద్దు అయ్యింది.

  • రైలు నంబర్ 20972 షాలిమార్ - ఉదయపూర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 16న రద్దు అయ్యింది.


దారి మళ్లించిన రైళ్ల జాబితా



  • రైలు నంబర్ 18049 షాలిమార్ - బదంపహార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 15,  22న సాంత్రాగాచి నుంచి బదంపహార్ వరకు నడుస్తుంది.

  • రైలు నంబర్ 18050 బదంపహార్ - షాలిమార్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 16,  23న సాంత్రాగాచి వరకు నడుస్తుంది.

  • రైలు నంబర్ 12101 ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ - షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ నవంబర్ 18న సాంత్రాగాచి వరకు నడుస్తుంది.

  • రైలు నంబర్ 12102 షాలిమార్ - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ నవంబర్ 20న సాంత్రాగాచి నుంచి నడుస్తుంది.

  • రైలు నంబర్ 12905 పోర్‌బందర్ - షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 19న సాంత్రాగాచికి వెళుతుంది.

  • రైలు నంబర్ 12906 షాలిమార్ - పోర్‌బందర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నవంబర్ 21న సాంత్రాగాచి నుంచి నడుస్తుంది.