వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) సర్వేను రెండు రోజుల పాటు నిలిపివేసింది సుప్రీంకోర్టు. వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న చారిత్రాత్మక మసీదు సముదాయంలో చేస్తున్న సర్వేలో భాగంగా తవ్వకాలు చేస్తారని మసీదు నిర్వహణ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. 


సర్వేలో భాగంగా నిర్మాణలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. "ఒక ఇటుకను కూడా తొలగించబోమని అలాంటి ప్లాన్‌ లేదు" అని నొక్కి చెప్పింది.


సర్వే ప్లాన్‌లో కొలత, ఫోటోగ్రఫీ, రాడార్ అధ్యయనాలు చేయాలనే మాత్రమే ఉందని సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.


"ఆర్డర్‌ను అనుసరించి ఏఎస్‌ఐ తవ్వకాలు చేపట్టడం లేదని తెలుస్తోంది. ఈ దశలో వారం రోజుల పాటు ఎలాంటి తవ్వకాలు జరపకూడదని స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తాము" అని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, కేంద్రానికి స్పష్టం చేశారు. 


2021లో ఆ జ్ఞాన్‌వాపీ కాంప్లెక్స్‌లో పూజలకు అనుమతి ఇవ్వాలని హిందూ మహిళలు ఉత్తర్‌ప్రదేశ్‌ కోర్టును ఆశ్రయించడంతో వార్తల్లో నిలిచింది. అక్కడ ఓ శివలింగం ఉందని ప్రచారం జరగడంతో వీడియో సర్వే చేయాలని దిగువ కోర్టు ఆదేశించింది. అయితే ఇది ప్రార్థనలు చేసుకునే ముందు కాళ్లు చేతులు కడుక్కునే పూల్‌ని మసీదు నిర్వహణ కమిటీ చెప్పింది. ఇది వివాదాస్పదం కావడంతో ఆ పూల్‌ను లీస్ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 


హిందూ దేవతను పూజించాలనే అనుమతులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఏడాది మొదట్లో పిటిషను్ హైకోర్టు కొట్టేసింది. 


పూల్‌ ఏరియా కాకుండా మిగతా ప్రాంతంలో ASI సర్వే నిర్వహించాలని వారణాసి కోర్టు రూలింగ్ ఇచ్చింది. దీనిపై అప్పీల్ చేసేందుకు కూడా మసీదు కమిటీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆ కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ మూవ్ చేసింది. 


ఇప్పుడు దీనిపై విచారించిన సుప్రీంకోర్టు పిటిషన్‌దారులు అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించింది. వారం రోజుల పాటు సర్వేను నిషేధించింది. స్టేటస్‌కో ఆదేశాలు ముగిసేలోపు పిటిషన్‌ను బెంచ్‌ ముందుకు తీసుకురావాలని అలహాబాద్‌ హైకోర్టు రిజిస్ట్రీని సుప్రీంకోర్టు ఆదేశించింది.