కార్బి ఆంగ్లాంగ్: అస్సాంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ Su-30MKI యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో భారత వైమానిక దళానికి (IAF) చెందిన ఇద్దరు పైలట్లు అమరులయ్యారు. పైలట్‌లను స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పుర్వేష్ దురాగ్‌కర్ అని గుర్తించినట్లు ఐఏఎఫ్ తెలిపింది. 

ఇండియన్ ఏయిర్ ఫోర్స్ తమ ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేసింది. IAF సిబ్బంది తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం. KI శిక్షణ మిషన్ కోసం బయలుదేరిన కొద్దిసేపటికే జోర్హాట్ ఎయిర్‌బేస్ నుండి అదృశ్యమైందని, ఆ తర్వాత కూలిపోయిందని సమాచారం. ఈ ఎయిర్‌బేస్ ప్రమాద స్థలం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఈ ఫైటర్ జెట్ తో గురువారం రాత్రి 7:42 గంటలకు సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. Su-30MKI అనేది రెండు సీట్ల మల్టీపర్పస్ ఫైటర్ జెట్. రష్యా విమాన తయారీదారు అయిన సుఖోయ్ దీన్ని డెవలప్ చేసింది. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం లైసెన్స్ కింద హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సుఖోయ్ ఫైటర్ జెట్స్ తయారు చేస్తోంది.

 అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం సుఖోయ్ భారత వైమానిక దళం 260 కంటే ఎక్కువ Su-30MKI జెట్ విమానాలను కలిగి ఉంది. ఈ ఫైటర్ జెట్ కూలిపోయిన తీరు చూస్తుంటే, దాని నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2000 ల ప్రారంభంలో IAF లో చేరిన సుఖోయ్ Su-30 MKI అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలలో ఒకటిగా చెప్పవచ్చు. 

ముందు ఎప్పుడు కూలిపోయిందిఅయితే, సుఖోయ్ జెట్ కూలడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు సుఖోయ్-30 MKI విమానం కూలిపోవడం తెలిసిందే. ఆగస్టు 2019లో సుఖోయ్-30 MKI సాధారణ ట్రైనింగ్ మిషన్ సమయంలో అస్సాంలోని తేజ్‌పూర్ సమీపంలో వరి పొలంలో కూలిపోయింది. ఆ ఘటనలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడగలిగారు. 

మే 2015లో సుఖోయ్-30 MKI విమానం టేకాఫ్ అయిన వెంటనే తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి సుమారు 36 కిలోమీటర్ల దూరంలో క్రాష్ అయింది. ప్రమాదం జరుగుతున్న సమయంలో కొంత ముందుగా ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.