అన్వేషించండి

Subhanshu Shukla : శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్తున్న టైంలో ఫ్యామిలీ భావోద్వేగం

Subhanshu Shukla: శుభాన్షు శుక్లా Axiom-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరారు. ఈ టైంలో ఆయన ఫ్యామిలీ ఎమోషన్‌కు గురైంది.

Subhanshu Shukla Axiom-4: భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్షంలో చారిత్రాత్మక యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా లక్నోలోని ఆయన ఇల్లు, పాఠశాల, ఆయన నివాస ప్రాంతం సంతోషంతో ఆల్‌ ద బెస్ట్ చెప్పాయి.  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత్‌కు కీర్తిని తీసుకురావడమే కాకుండా, తన కుటుంబం, ఉపాధ్యాయులు, పాఠశాలకు పేరు తెచ్చారు. నేటి తరం పిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆక్సియం-4 మిషన్ అనేది కేవలం శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, ఇది ఒక భావోద్వేగ యాత్ర కూడా.

ఎమోషన్ అయిన కుటుంబ సభ్యులు 
శుభాన్షు శుక్లా కుటుంబంలో ఆనందంతో ఎమోషన్ అయ్యారు. తన భావాలను పంచుకుంటూ ఆయన తల్లి ఆశా శుక్లా భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మాట్లాడుతూ, “మేము మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేము… శుభాన్షు గురించి మాకు భయం లేదు… మేము చాలా సంతోషంగా ఉన్నాము, చాలా గర్వంగా ఉంది.” శుభాన్షు శుక్లా బయలుదేరడంతో ఆయన తల్లి ఆశా శుక్లా ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు.

ఈ చారిత్రాత్మక క్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి శుభాన్షు తల్లిదండ్రులు పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి లైవ్ చూశారు. ఈ సందర్భంగా వారిని స్వాగతించడానికి పాఠశాల యాజమాన్యం ఒక సాంప్రదాయ బృందం, ప్రత్యేక అలంకరణలను ఏర్పాటు చేసింది.

అదే సమయంలో, శుభాన్షు తండ్రి శంభు దయాల్ శుక్లా మాట్లాడుతూ, “ఈ విజయం లక్నోకే కాదు, దేశం మొత్తానికి గర్వకారణం. మిషన్ ప్రారంభం చాలా ప్రత్యేకమైనది. మా ఆశీర్వాదం ఎల్లప్పుడూ అతనితో ఉంటుంది.”

భార్య కోసం భావోద్వేగ సందేశం
అంతరిక్షంలో అడుగుపెట్టడానికి ముందు, శుభాన్షు శుక్లా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ పోస్టు పెట్టారు. తన  భార్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “జూన్ 25 ఉదయం భూమిని విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు, ఈ మిషన్‌తో సంబంధం ఉన్న వారందరికీ, ఎల్లప్పుడూ మద్దతునిచ్చిన, ప్రేమించిన నా దేశ ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా కామనకు - నీవు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.”  ఒక ఫోటోను కూడా షేర్ చేశారు, దీనిలో ఆయన, భార్య  నిలబడి వీడ్కోలు క్షణాలను పంచుకుంటున్నారు.

'మినీ మిషన్ కంట్రోల్ సెంటర్'గా మారిన పాఠశాల  
లక్నోలోని శుభాన్షు పాఠశాల ఈ చారిత్రాత్మక క్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో పాఠశాలలో ‘మినీ మిషన్ కంట్రోల్ సెంటర్’ని ఏర్పాటు చేశారు, ఇక్కడ పిల్లలకు అంతరిక్ష నియంత్రణ కేంద్రం వంటి అనుభూతి పొందారు. 

భారతదేశ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం
శుభాన్షు శుక్లా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకోనున్న భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామిగా నిలిచారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత ఇది భారతదేశం రెండో మానవ అంతరిక్ష యాత్ర. మొదటిసారిగా ఒక భారతీయుడు ఆక్సియం మిషన్ ద్వారా ప్రైవేట్ భాగస్వామ్యం కింద ISSకి వెళ్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

love story: ముహూర్తాన తెలిసిన నిజం - వరుడు కాదు.. వాడు అన్నయ్య! అప్పుడేంచేశారు?
ముహూర్తాన తెలిసిన నిజం - వరుడు కాదు.. వాడు అన్నయ్య! అప్పుడేంచేశారు?
Dosa Batter Crime news: గుట్టు విప్పిన డైరీ! గుజరాత్‌లో దోసెలు తిని చనిపోయిన అక్కాచెల్లెలు కేసులో కీలక మలుపు!
గుట్టు విప్పిన డైరీ! గుజరాత్‌లో దోసెలు తిని చనిపోయిన అక్కాచెల్లెలు కేసులో కీలక మలుపు!
Tamil Nadu Assembly Elections: తమిళనాడులో బ్రాహ్మణ నేతలకు నిరాదరణ - ఒక్క టిక్కెట్ కూడా కేటాయించని ప్రధాన పార్టీలు - ఇదేం రాజకీయం?
తమిళనాడులో బ్రాహ్మణ నేతలకు నిరాదరణ - ఒక్క టిక్కెట్ కూడా కేటాయించని ప్రధాన పార్టీలు - ఇదేం రాజకీయం?
Bengal Assembly Elections: బెంగాల్ లో అందరి చూపు ముస్లిం ఓటు బ్యాంక్ పైనే - మమతా బెనర్జీని ఈ సారి కూడా గట్టెక్కిస్తారా?
బెంగాల్ లో అందరి చూపు ముస్లిం ఓటు బ్యాంక్ పైనే - మమతా బెనర్జీని ఈ సారి కూడా గట్టెక్కిస్తారా?

వీడియోలు

Vaibhav Suryavanshi about Bumrah Bowling | బుమ్రా బౌలింగ్‌పై వైభవ్ కామెంట్స్
Who is Mukul Choudhary KKR IPL 2026 | ఈడెన్ గార్డెన్స్‌లో ముకుల్ సునామీ
KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం
IPL 2026 Controversy GT vs DC | క్రికెట్ లోని ఆ వింత రూల్ పై ఫ్యాన్స్ ఫైర్
IPL 2026 KKR VS LSG Highlights | లక్నో సూపర్ విక్టరీ.. కేకేఆర్ కు నిరాశ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Macherla ASI Suspension: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులు.. మాచర్ల ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
IPL 2026 Sanju Samson Century: సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ.. చెన్నై భారీ స్కోరు.. ఫిఫ్టీతో మాత్రే స‌త్తా.. విఫ‌ల‌మైన రుతురాజ్
సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ.. చెన్నై భారీ స్కోరు.. ఫిఫ్టీతో మాత్రే స‌త్తా.. విఫ‌ల‌మైన రుతురాజ్
Telangana Inter Results 2026 link: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డ్ కీలక ప్రకటన.. రిజల్ట్స్ ఏ టైమ్‌కు వస్తాయి
Roja supports DMK: కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
కాంగ్రెస్ కూటమికి తమిళనాడులో రోజా మద్దతు - జగన్ అనుమతించారా?
Singer Mangli Case : మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - ఆ ప్రచారం బాధాకరం... డైరెక్టర్ వేణు రియాక్షన్
మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - ఆ ప్రచారం బాధాకరం... డైరెక్టర్ వేణు రియాక్షన్
HYDRA Demolitions: రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!
రంగనాథ్ ప్రభుత్వ ఏజెంట్ అని విమర్శలు! అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతాయన్న హైడ్రా కమిషనర్!
Singer Mangli : లాయర్‌పై సింగర్ మంగ్లీ కంప్లైంట్ - బెదిరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ...
లాయర్‌పై సింగర్ మంగ్లీ కంప్లైంట్ - బెదిరించి ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ...
IPL 2026 PBKS VS SRH Result Update: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆన్ ఫైర్.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో పంజాబ్ ఘ‌న‌విజ‌యం.. బౌల‌ర్ల వైఫ‌ల్యంతో స‌న్ బోల్తా
శ్రేయ‌స్ అయ్య‌ర్ ఆన్ ఫైర్.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో పంజాబ్ ఘ‌న‌విజ‌యం.. బౌల‌ర్ల వైఫ‌ల్యంతో SRH బోల్తా
Embed widget