News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

సనాతన ధర్మం HIV కన్నా ప్రమాదకరం, డీఎమ్‌కే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Sanatan Dharma Row: సనాతన ధర్మంపై డీఎమ్‌కే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 
Share:

Sanatan Dharma Row: 

HIV కన్నా డేంజర్..

సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదే అని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం ఆగకముందే...మరో వివాదం రాజుకుంది. DMK పార్టీకి చెందిన నేత ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం HIV లాంటిదని, ఇదో సామాజిక వ్యాధి అని అన్నారు. HIV కన్నా ప్రమాదకరమైన జబ్బు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజా కామెంట్స్‌పై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. ట్వీట్‌తో రాజాపై మండి పడ్డారు. 

"ఈ దేశంలో 80% మంది అనుసరించే ధర్మాన్ని, మతాన్ని కించపరుస్తున్నారు. డీఎమ్‌కే ఎంపీ రాజా హిందూమతాన్ని సామాజిక వ్యాధి అని అన్నారు. ఇది మత విద్వేష ప్రసంగం కాకపోతే మరేంటి..? ఇది కాంగ్రెస్ అసలు స్వరూపం. విపక్ష కూటమి స్వరూపమూ ఇదే. హిందూ మతాన్ని అనుసరించే వాళ్లను కించపరిచి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు"

- అమిత్ మాల్వియా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ 

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్  (Udayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలోనే కాదు. దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టించాయి. రాజకీయంగా నిప్పు రాజేసిన ఈ కామెంట్స్‌ని ఇప్పటికే సమర్థించుకున్నారు ఉదయనిధి. లీగల్‌గా ఎవరు ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇప్పుడు డీఎమ్‌కే నేతలందరినీ ఉద్దేశించి ఓ నోట్ విడుదల చేశారు. అనవసరంగా ఈ వివాదాన్ని పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. తనపై విమర్శలు చేసిన వాళ్లపై కేసులు పెట్టడం, వాళ్ల దిష్టి బొమ్మల్ని తగలబెట్టడం లాంటివి చేయొద్దని వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి సహా అయోధ్యకు చెందిన సాధువు మహంత్ పరమహన్స్‌పైనా విమర్శలు చేశారు. తన తలను తీసుకొచ్చిన వారికి నజరానా ఇస్తారనని మహంత్ పరమహన్స్‌ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. పెరియార్, అన్నా, కలైజ్ఞర్, పెరసిరియార్ చూపిన బాటలోనే అందరూ నడుద్దాం అంటూ పిలుపునిచ్చారు. సామాజిక న్యాయంపై తనకు నమ్మకముందని తేల్చి చెప్పారు.

Published at : 07 Sep 2023 11:59 AM (IST) Tags: Sanatan Dharma Sanatan Dharma Row Sanatan Dharma Remark A Raja

ఇవి కూడా చూడండి

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

AFCAT 2023: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

Rajasthan Elections: ముస్లిం ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరికి కీలక బాధ్యతలు

Rajasthan Elections: ముస్లిం ఎంపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరికి కీలక బాధ్యతలు

NIA Raids: 6 రాష్ట్రాల్లో 51 చోట్ల ఎన్ఐఏ సోదాలు- ఖలిస్థానీ, గ్యాంగ్‌స్టర్స్ సమాచారంతో దాడులు

NIA Raids: 6 రాష్ట్రాల్లో 51 చోట్ల ఎన్ఐఏ సోదాలు- ఖలిస్థానీ, గ్యాంగ్‌స్టర్స్ సమాచారంతో దాడులు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !

Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !

టాప్ స్టోరీస్

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి