Rat in Chicken Gravy: 



చికెన్ గ్రేవీలో ఎలుక..


రెస్టారెంట్‌లలో తినడం సరదానే. కాకపోతే...అక్కడ ఫుడ్ క్వాలిటీపైనే బోలెడన్ని అనుమానాలు. ముఖ్యంగా నాన్‌వెజ్ వంటకాల విషయంలో కొన్ని రెస్టారెంట్‌లో షాక్ ఇస్తూనే ఉంటాయి. పంజాబ్‌లోని లుధియానాలో ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. చికెన్ గ్రేవీలో ఎలుక కనిపించింది. చికెన్ ముక్క అనుకుని గబుక్కున నోట్లో వేసుకుందామని చూసిన ఆ కస్టమర్ దెబ్బకు హడలిపోయాడు. ఇదేదో తేడాగా ఉందే అని చూస్తే చచ్చిపోయిన ఎలుక ఆ గ్రేవీలో కనిపించింది. వెంటనే రెస్టారెంట్‌ సిబ్బందిని పిలిచి ఈ విషయం చెప్పాడు. వాళ్లు పట్టించుకోకపోవడమే కాకుండా..అసలు తమది తప్పే కాదన్నట్టుగా మాట్లాడారు. వెంటనే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు ఆ కస్టమర్. టేబుల్‌పై ఉన్న డిషెస్‌ని చూపిస్తూ...చికెన్ గ్రేవీలో ఎలుక కనిపించిందని చెప్పాడు. ఇండియాలో చాలా రెస్టారెంట్‌లలో ఫుడ్ క్వాలిటీ ఇంత దారుణంగా ఉంది. తినే ముందు కాస్త జాగ్రత్త అంటూ అందరినీ హెచ్చరించాడు. దీనిపై ఆ రెస్టారెంట్‌ ఓనర్‌కి, కస్టమర్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. సోషల్ మీడియాలోనూ గొడవ జరిగింది. "ఇదంతా అబద్ధం. కేవలం మమ్మల్ని డీఫేమ్ చేయడానికి ఆడుతున్న డ్రామా" అని ఓనర్ వాదించాడు. ఇక నెటిజన్లు మాత్రం కస్టమర్‌కే సపోర్ట్ చేశారు. అంత పెద్ద తప్పు చేసి మళ్లీ బుకాయిస్తున్నారా అంటూ మండి పడుతున్నారు. కచ్చితంగా హెల్త్ అథారిటీస్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇంకొందరైతే...అసలు ఆ రెస్టారెంట్ లైసెన్స్‌ని క్యాన్సిల్ చేసేయాలని ఫైర్ అవుతున్నారు. లుధియానాలో ఇదేం కొత్త కాదు. చాలా రెస్టారెంట్‌లలో ఇదే పరిస్థితి ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.