దేశ వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో CUET-UG 2026 పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది.
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
Rahul Gandhi On Exams: CUET-UG 2026 ఎగ్జామ్ జాప్యం, నిర్వహణ లోపంపై లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విశ్వగురు క్లెయిమ్‌పై సెటైర్లు వేశారు.

- CUET-UG 2026 పరీక్ష దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో సాంకేతిక లోపం.
- NEET, CBSE, SSC తర్వాత CUET లోనూ నిర్వహణ లోపాలపై విమర్శలు.
- రాహుల్ గాంధీ: విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మోదీపై విమర్శలు.
- NTA: సాంకేతిక సమస్య పరిష్కరించాం, విద్యార్థులకు పూర్తి సమయం ఇచ్చాం.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నేడు పలు కేంద్రాల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-యుజి (CUET-UG 2026) ఎగ్జామ్ ఆలస్యం కావడంపై తీవ్ర దుమారం రేగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దీనిని టెక్నికల్ ప్రాబ్లమ్ అని పేర్కొంది. ఈ కారణంతో ఎగ్జామ్ చాలా సెంటర్లలో కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. నీట్ యూజీ పేపర్ లీక్ ఆరోపణలతో ఎగ్జామ్ రద్దు చేయగా, తాజాగా సీయూఈజీ యూజీ ఎగ్జామ్ నిర్వహణలో లోపాలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు.
విశ్వగురుగా చెప్పుకుంటారు. కానీ ఒక్క ఎగ్జామ్ కూడా సరిగ్గా నిర్వహించడానికి చేతకాదంటూ ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "NEET, CBSE, SSC, ఈరోజు CUET యూజీ. నాలుగు పరీక్షలు. ఒక కోటి మంది విద్యార్థుల భవిష్యత్. కానీ ఒక్కటి కూడా నిజాయితీగా, సరిగ్గా జరగలేదు" అని రాహుల్ గాంధీ విమర్శించారు.
NEET। CBSE। SSC। और आज CUET।
— Rahul Gandhi (@RahulGandhi) May 30, 2026
चार परीक्षाएँ। एक करोड़ बच्चे। एक भी ईमानदारी से नहीं हो पाई।
दावे "विश्वगुरु" के, मगर देश में एक परीक्षा नहीं करवा सकते - मोदी जी ने पूरी शिक्षा व्यवस्था तबाह कर दी है।
जिस पीढ़ी का भविष्य आप बर्बाद कर रहे हैं - वही पीढ़ी आपका हिसाब करेगी।
రాహుల్ గాంధీ ఎక్స్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. 'తాము విశ్వగురువు అని క్లెయిమ్ చేసుకుంటారు. కానీ దేశంలో ఒక పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేరు. ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారు. మీరు ఏ తరం భవిష్యత్తును నాశనం చేస్తున్నారో - అదే తరం మీ లెక్క తేలుస్తుంది' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
CUET-UG 2026 ఎగ్జామ్ సమయంలో సాంకేతిక సమస్య
CUET-UG 2026 పరీక్ష సమయంలో దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. దీని కారణంగా సీయూఈటీ పరీక్ష నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైంది. సాంకేతిక సమస్యను పరిష్కరించామని, ఏ అభ్యర్థికీ నష్టం జరగకుండా విద్యార్థులకు ఎగ్జామ్‌కు పూర్తి సమయం ఇచ్చామని NTA ఓ ప్రకటనలో తెలిపింది.
Today CUET exam was scheduled for 9 to 10 AM nationwide
— Veena Jain (@Vtxt21) May 30, 2026
But in many places, due to server issue exam didn't start at 9
Some students got access to exam at 9 & some around 11 AM
Our country's education system has gone beyond repair under Modi 💀
pic.twitter.com/UxkNgyzi38
ఇటీవల NEET యూజీ, CBSE, SSC లకి సంబంధించిన వివాదాల తర్వాత CUET యూజీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణలో సైతం జరిగిన ఆలస్యం పరీక్షా విధానంపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు మరోసారి ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ నుంచి దీనిపై సమాధానం కోరుతున్నాయి. అయితే పరీక్ష ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు NTA పేర్కొంది.
#CUETUG2026 — Important Notice
— National Testing Agency (@NTA_Exams) May 30, 2026
M/s TCS has reported that a technical glitch at their end delayed the commencement of CUET (UG) 2026 at some centres on 30.05.2026. The issue has since been resolved, and the exam is being conducted with full compensatory time so that no candidate…
చెప్పారు.
ఎన్టీఏ క్లారిటీ
ఉదయం షిఫ్ట్ విద్యార్థులకు ఎగ్జామ్ రాసేందుకు పూర్తి సమయం ఇచ్చామని, ఏ విద్యార్థికి నష్టం జరగనివ్వలేదని NTA క్లారిటీ ఇచ్చింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి ఎన్టీఏ విచారం వ్యక్తం చేసింది. అలాగే సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 91-11-40759000, ఈమెయిల్ ఐడి cuet-ug@nta.ac.in లో సంప్రదించాలని సూచించింది. CUET-UG పరీక్షకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరుకావడం, వివిధ సబ్జెక్టుల కాంబినేషన్ల కారణంగా పరీక్షా షెడ్యూల్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ పరీక్షను పలు రోజులు, పలు షిఫ్టులలో నిర్వహించనున్నారు. ఈ ఏడాది మే 11న CUET-UG 2026 పరీక్ష ప్రారంభం కాగా, మే 31 వరకు నిర్వహించనున్నారు.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Frequently Asked Questions
CUET-UG 2026 పరీక్ష ఎందుకు ఆలస్యమైంది?
సాంకేతిక సమస్య వల్ల విద్యార్థులకు ఏదైనా నష్టం జరిగిందా?
NTA ప్రకారం, ఏ అభ్యర్థికీ నష్టం జరగకుండా విద్యార్థులకు పరీక్షకు పూర్తి సమయం ఇచ్చారు. సాంకేతిక సమస్యను పరిష్కరించారు.
CUET-UG 2026 నిర్వహణపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?
నీట్, సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ వివాదాల తర్వాత సీయూఈటీ నిర్వహణలో లోపాలపై ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రభుత్వాన్ని విమర్శించారు.
NEET, CBSE, SSC లతో CUET-UG 2026 నిర్వహణను ఎలా పోల్చారు?
రాహుల్ గాంధీ ఈ నాలుగు పరీక్షలు (NEET, CBSE, SSC, CUET-UG) సరిగ్గా, నిజాయితీగా జరగలేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















