ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం పుదుచ్చేరీ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే స్టూడెంట్స్ అందరికీ ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సాయంత్ర వేళలో వారికి అల్పాహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రంగస్వామి నిర్ణయించారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సాయంత్రం వేళ చిరుధాన్యాలతో కూడిన అల్పాహారం అందిస్తామని, దీనివల్ల 85 వేలమంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి రంగస్వామి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఆ సమయంలో విద్యార్థుల ఆకలి కష్టాలు అంతా ఇంతా కాదు. విద్యార్థుల ఆకలి కష్టాలు తీర్చడానికి సాయంత్రం వేళ అల్పాహారం ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి రంగస్వామి చెప్పారు. అల్పాహారంలో పాలు, రొట్టె, బిస్కెట్, పండ్లు అందజేస్తామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణతా శాతం పెరిగించేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. చదువుకునే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు రాబట్టాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.
"విద్యార్థులంతా క్రమశిక్షణతో ముందుకు సాగాలని, బాల్యం నుండే మన మేధస్సుని దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఉపయోగించాలని, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ప్రణాళిక బద్దంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పునర్ధ్గాటించారు. చడువులో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రతీ ఒక్క విద్యార్థి పట్టుదలగా కృషి చేయాలి. విద్యార్థులు సక్రమంగా చదువుకొని ఉత్తీర్ణత సాధించి వారి ప్రతిభను కనబరిచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి" అని ముఖ్యమంత్రి రంగస్వామి వ్యాఖ్యానించారు.
85 వేల మంది విద్యార్థులకు లబ్ధి....
కొత్త ప్రాజెక్టులో భాగంగా సాయంత్రం వేళ పాఠశాల ముగిసిన విద్యార్థులు ఇంటికి వెళ్లేటప్పుడు సెనగలు, వేరుశనగలు తదితరాలతో చేసిన ఆహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీని ద్వారా పుదుచ్చేరి, కారైక్కాల్, మహి, యానం, తదితర ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి వరకు చదివే 85 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని చెప్పారు.
స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు...
ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణతా శాతం పెరిగించేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు రాబట్టాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.
మెనూ ప్రకారం అందించాలి....
ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం అందజేస్తామని ప్రకటించిన నేపథ్యంలో... వాటిని మెనూ ప్రకారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతుల దృశ్య ఆకలి తీర్చుకునేందుకు స్నాక్స్ ని అందించడం హర్షించదగ్గ విషయమని తల్లిదండ్రులు చెప్పారు. స్నాక్స్ ని తీసుకోవడం వల్ల విద్యార్థులకు ఆకలితోపాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని వెల్లడించారు.