PM Narendra Modi Warning To Terrorists: గుజరాత్‌లోని కెవాడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన 'జాతీయ ఐక్యతా దినోత్సవం' పరేడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే వారిని హెచ్చరిస్తూ.. ఉగ్రవాదానికి ఆశ్రయించిన వారు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందేనని అన్నారు.


'జాతీయ ఐక్యతా దినోత్సవం' సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ప్రధాని అన్నారు. ఈసారి జాతీయ ఐక్యతా దినోత్సవానికి చాలా ప్రత్యేకత ఉందన్నారు. ఒకవైపు ఐక్యతా పండుగ జరుపుకుంటూనే మరోవైపు పవిత్రమైన దీపావళి పండుగ కూడా చేసుకుంటున్నామని గుర్తు చేశారు. 


దీపావళి శుభాకాంక్షలు
'జాతీయ ఐక్యతా దినోత్సవం' సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈసారి జాతీయ ఐక్యతా దినోత్సవం మరో పండగ తీసుకొచ్చింది. ఈరోజు మనం ఐక్యత దినోత్సవం జరుపుకుంటున్నాము, మరోవైపు అదే టైంలో దీపావళి జరుపుకుంటున్నాము. దేశం మొత్తం దీపాలతో కళకళలాడుతోంది. ఇప్పుడు చాలా దేశాల్లో జాతీయ పండుగగా దీన్ని జరుపుకుంటున్నారు, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు నుంచి సర్దార్ పటేల్ 150వ జయంతి ప్రారంభం కానుందని, రానున్న రెండేళ్లపాటు సర్దార్ పటేల్ 150వ జయంతిని దేశం జరుపుకోనుందని, భారతదేశానికి ఆయన చేసిన అసాధారణ సేవలకు ఇదే దేశప్రజల నివాళి అని అన్నారు.


'వేర్పాటువాదులు తిరస్కరణకు గురయ్యారు'
వేర్పాటువాదులను జమ్మూకశ్మీర్‌ ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఇప్పుడు టెర్రర్ మాస్టర్లు దేశం విడిచి వెళ్ళవలసి ఉంటుంది. నక్సలిజం భారతదేశ ఐక్యతకు సవాలుగా మారింది. నేడు నక్సలిజం ఆఖరి శ్వాస తీసుకుంటోంది. నేడు భారతదేశానికి దిశ, దృక్పథం రెండూ ఉన్నాయి. ప్రపంచ దేశాలు భారత్‌తో తమ సత్సబంధాలను పెంచుకుంటున్నాయి. దశాబ్దాల కాలం నాటి ఎన్నో సవాళ్లకు ముగింపు పలికాం. 






గత 10 ఏళ్ల కాలంలో భారతదేశ ఐక్యత, సమగ్రత విషయంలో అనేక విజయాలు సాధించాం. నేడు ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో జాతీయ సమైక్యత పట్ల నిబద్ధత కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.


ఒకే దేశం, ఒకే ఎన్నికపై కీలక ప్రకటన 
"ఇప్పుడు మనం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఒక దేశం- ఒకే ఎన్నికలపై వర్క్ చేస్తున్నాం. అభివృద్ధి చెందిన భారతదేశం కలలను సాధించడంలో కొత్త ఊపందుకుంటుంది. శ్రేయస్సు సాధిస్తుంది" అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.






భారత్‌కు హాని కలిగిస్తే భారత్ ప్రభుత్వం విడిచిపెట్టదని ఉగ్రవాదుల ‘మాస్టర్’లకు ఇప్పుడు తెలుసునని అన్నారు మోదీ. ఈశాన్య రాష్ట్రాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాయని అన్నారు. చర్చలు, నమ్మకం, అభివృద్ధి ద్వారా ఆ మంటలు ఆర్పివేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత 10 సంవత్సరాల చేపట్టిన అనేక చర్యలతో నక్సలిజం భారతదేశంలో చివరి శ్వాస తీసుకుంటోందని తెలిపారు. 


Also Read: టీ షర్ట్ వేసుకున్నారని డిప్యూటీ సీఎంపై పిటిషన్- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు