PM Modi visits Ayodhya Temple: అయోధ్యలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు, బాలరాముడి ప్రాణప్రతిష్ట తరువాత తొలిసారి!

PM Modi Visits Ayodhya Temple: ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Continues below advertisement

PM Modi performs Pooja at Shri Ram Janmabhoomi Teerth Kshetra Ayodhya: అయోధ్య: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. యూపీ పర్యటనలో భాగంగా అయోధ్యలో రామాలయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయంలో బాల రాముడిని దర్శించుకున్న అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. అనంతరం నేడు తొలిసారి అయోధ్యలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ బాలరాముడ్ని దర్శించుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు.

Continues below advertisement


అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్ షో..
ప్రధాని మోదీ స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా.. మొదటగా అయోధ్యలో బాలరాముడ్ని దర్శించుకున్నారు. అనంతరం బీజేపీ ఎన్నికల ర్యాలీలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సుగ్రీవ్ ఫోర్ట్ నుంచి లతా మంగేష్కర్ చౌక్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో జరగనుంది. అయోధ్య ప్రజలు, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షో ముగిశాక ప్రధాని మోదీ ఎయిర్ పోర్టుకు బయలుదేరతారు. 

రోడ్‌షో కోసం మార్గాన్ని 40 బ్లాక్‌లుగా విభజించారు, సింధీలు, పంజాబీలు, రైతులు సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, బీజేపీ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్‌షో సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. 

Continues below advertisement