టర్కీకి అన్ని విధాలా సాయం అందించేందుకు భారత్‌ సిద్ధం: ప్రధాని మోదీ

టర్కీలో సంభవించిన భూకంప ప్రమాదాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. గుజరాత్‌లోని కచ్ భూకంపాన్ని గుర్తు చేసుకున్నారు.

Continues below advertisement

BJP Parliamentary Party Meeting: భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సమావేశంలో టర్కీలో సంభవించిన వినాశకరమైన భూకంపాన్ని ప్రస్తావించారు. గుజరాత్‌లోని కచ్ భూకంపం వచ్చిన రోజుల్లో ఎదుర్కొన్ని ఇబ్బందులను మోదీ గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.  ''మనం కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాం. టర్కీకి భారత్ అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.

Continues below advertisement

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపంపై సంతాపం వ్యక్తం చేశారు. 2021లో కచ్‌లో సంభవించిన భూకంపాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ,'మనం కూడా ఇలాంటి విపత్తులను ఎదుర్కొన్నాం. ఈ క్లిష్ట సమయంలో టర్కీకి మేము (భారత్) అన్ని విధాలా సహాయం చేస్తాము.

వాస్తవానికి సోమవారం (ఫిబ్రవరి 6) టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం ఎంత తీవ్రంగా ఉందంటే ఇప్పటివరకు ఐదు వేల మందికిపైగా ప్రజలు మరణించారు. 15 వేల మందికి పైగా గాయపడ్డారు.

పేదల ప్రయోజనాల కోసమే బడ్జెట్: ప్రధాని మోదీ

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని మోదీ బడ్జెట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. బడ్జెట్లో పేదల ప్రయోజనాలకు పెద్దపీట వేశామని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని ఎవరూ ఎన్నికల బడ్జెట్ అనడం లేదన్నారు. అయితే, వచ్చే లోక్ సభ ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తి బడ్జెట్.

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విలేకరులతో మాట్లాడుతూ బిజెపిని సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్న వారు కూడా బడ్జెట్ ను స్వాగతించారని అన్నారు.

క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని కోరిన ప్రధాని...
 
ముఖ్యంగా నగరాల నుంచి వచ్చే ఎంపీలు క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ కోరారు. వివిధ జీ20 సమావేశాల కోసం భారత్ కు వచ్చిన విదేశీ అతిథులు దేశంలో వారి ఆతిథ్యాన్ని ప్రశంసించారు.

Continues below advertisement