By: ABP Desam | Updated at : 03 Dec 2022 04:16 PM (IST)
మీడియాతో బీజేపీ నేత సీటీ రవి (Photo Credit: Twitter/ANI)
BJP on Congress PM Modi Bhasmasura Comments: కాంగ్రెస్ సీనియర్ నేత ఉగ్రప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీని భస్మాసురుడు అని శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. మోదీ భస్మాసురుడు అని కాంగ్రెస్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ప్రతిపక్ష పార్టీ నేతలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. దేశ ప్రజలకు మోదీ నారాయణుడు అని, దేశ ద్రోహులకు ఆయన భస్మాసురుడు అని సీటీ రవి అన్నారు.
బీజేపీ నేత సీటీ రవి శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ‘ ప్రధాని మోదీ అవినీతికి, దేశ ద్రోహులకు వ్యతిరేకం అని.. అలాంటి వారికి ఆయన భస్మాసురుడు అని, దేశ ప్రజలకు మోదీ నారాయణుడు అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అవినీతిపరులను అంతం చేసేందుకు భస్మారుడిగా మారుతాడన్నారు. కర్ణా టక, మహారాష్ట్ర ప్రజల సంస్కృతి దాదాపు ఒకే విధంగా ఉంటాయని, కన్నడ ప్రజలు, మరాఠాలు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు ఎలా వచ్చినా ఈ బంధం ఇలాగే కొనసాగించాలని రెండు రాష్ట్రాల ప్రజలను సీటీ రవి కోరారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉగ్రప్ప ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఖండించారు. జీ 20 దేశాలు ప్రధాని మోదీని కొనియాడుతుంటే, కాంగ్రెస్ నేతలు విమర్శించడం, దూషించడం సరికాదని సూచించారు.
PM Modi is against the corrupt&anti-nationals so for them he's 'Bhasmasura' but for countrymen, he's like Lord Narayana. PM Modi is in power to 'bhasma' (burn&turn to ashes)the corrupt: BJP National General Secy CT Ravi on ex-Cong MP VS Ugrappa's 'Bhasmasura' statement on PM Modi pic.twitter.com/Jecg3cVZlg
— ANI (@ANI) December 3, 2022
2020లోనూ వివాదాస్పద వ్యాఖ్యలు..
కాంగ్రెస్ నేత ఉగ్రప్ప 2020లోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని భస్మాసురుడు అని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను శని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ దిగజారిపోతుందని, నిరుద్యోగం పెరిగిందని, పేదరికం వంటి ఎన్నో సమస్యలు ఉండగా.. బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు భావోద్వేగ, మత పరమైన సున్నిత అంశాల గురించి మాట్లాడుతూ ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని రెండేళ్ల కిందట ఉగ్రప్ప విమర్శించారు. ఈ కారణాలతో తాను ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను భస్మాసురుడు, శని అన్నట్లు చెప్పారు.
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ
Naba Kishore Das: ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నబా కిషోర్ దాస్ మృతి
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
CM Jagan Delhi Tour : రేపు దిల్లీకి సీఎం జగన్, ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు హాజరు
BRS Nanded Meeting: నాందేడ్‌లో బీఆర్ఎస్ సభ, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్