అన్వేషించండి

PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనతో వ్యక్తిగతంగా మీకు కలిగే ప్రయోజనం ఏంటీ? ఇంధన భద్రత, సెమీకండక్టర్, గ్రీన్ ఎనర్జీ, వాణిజ్యం- మీ జేబు మీ ఉద్యోగం, దేశ భద్రతపై చూపే ప్రభావం వివరాలు ఇవే

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
  • యూఏఈతో వ్యూహాత్మక చమురు నిల్వల ఒప్పందం, భారత్ భద్రత పెరిగింది.
  • నెదర్లాండ్స్‌తో టాటా చిప్ ప్లాంట్, ఖనిజాల అన్వేషణకు ఒప్పందం.
  • నార్వేతో గ్రీన్ ఎనర్జీ, ఇటలీతో వాణిజ్య కారిడార్‌పై ఒప్పందాలు.

Prime Minister Modi 5 Countries Tour: ప్రధాని నరేంద్ర మోదీ మే 15 నుంచి 20 వరకు ఐదు దేశాల(యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ)పర్యటన పూర్తి చేశారు. ఈ పర్యటనలో చమురు భద్రత, సెమీకండక్టర్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీపై ఒప్పందాలు చేసుకున్నారు. భారత్ ఇంధన భధ్రత 9 రోజుల నుంచి 14-15 రోజులకు పెరగనుంది. టాటా- ఏఎస్‌ఎంఎల్ చిప్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుు ఈ దేశానికి ఎలాంటి లాభం?

మొదటి అడుగు యూఏఈలో...

ప్రధాని మోదీ 15వ తేదీన ఉదయం అబుదాబీకి చేరుకున్నారు. ఆయన మూడు గంటల పాటు ఇక్కడ పర్యటించారు. ఇరు దేశాల మధ్య కీలక ఏడు ఒప్పందాలు చేసుకున్నారు. వాటిలో అత్యంత ముఖ్యమైంది వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌ ఒప్పందం, ఇది వ్యూహాత్మక చమురు నిల్వలపై కుదిరిన అగ్రిమెంట్‌. 
యూఏఈ జాతీయ చమురు సంస్థ అయిన ఏడీఎన్‌ఓసీ, ఇప్పుడు భారత్‌ వ్యూహాత్మక చమురు నిల్వల్లో 3 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేయనుంది. యుద్ధం లేదా సరఫరా అంతరాయాలు ఏర్పడినప్పుడు ఈ నిల్వలపై దేశానికి మొదటి హక్కు ఉంటుంది. ఇలా నిల్వ చేసినందుకు భారత్‌కు యూఏఈ అద్దె ఇస్తుంది. ఇప్పటి వరకు భారత్‌లో ఏపీ, కర్ణాటకలో 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల  సామర్థ్యంతో మూడు వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. కానీ అవి కేవలం 65 శాతం మాత్రమే నిండి ఉన్నాయి.  ఒప్పందం భారత్ వ్యూహాత్మక చమురు నిల్వలు ప్రస్తుతం 9 రోజులుగా ఉంది. ఇప్పుడు చేసుకున్న ఒప్పందంతో అది 14-15 రోజులకు పెరుగుతుంది. 

PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న జగడంతో హూర్ముజ్ జలసంది వద్ద చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. అయితే ఇప్పుడు యూఏఈతో చేసుకున్న ఒప్పందం వల్ల భారత్‌కు నమ్మకమైన సురక్షితమైన చమురు సరఫరా మార్గం తెరుచుకుంటుంది. యూఏఈ చమురు హస్బాన్ చమురు క్షేత్రం నుంచి ఒక ప్రత్యేక పైప్ లైన్ ద్వారా నేరుగా ఫుజైరా ఓడరేవుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఓడలు ద్వారా భారత్‌లోకి చమురు చేరుకోగలదు. 


PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

వీటికి తోడు యూఏఈ గుజరాత్‌లోని వడనార్‌ పోర్టులో ఒక ప్రధాన నౌకా మరమ్మతు కేంద్రాన్ని, నావికుల కోసం ఒక శిక్షణా కేంద్రాన్ని నిర్మించనుంది. మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడికి కూడా అంగీకారం కుదిరింది. PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

నెదర్లాండ్స్‌తో ఒప్పందాల వల్ల ప్రయోజనం ఏంటీ?

ప్రధాని మోదీ మే 15వ తేదీ 9 గంటల ప్రాంతంలో ఆమ్‌స్టర్‌డామ్‌కు చేరుకుని, సుమారు ఒకటిన్నర రోజు అక్కడే ఉన్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ రాజకుటుంబాన్ని, ప్రధానమంత్రిని కలుసుకున్నారు. ఈ పర్యటనలో ఆయన కీలకమైన పదిహేడు ఒప్పందాలు చేసుకున్నారు. అన్నీ దేశానికి ఉపయోగపడేవే అయినప్పటికీ ముఖ్యంగా రెండు ఒప్పందాలు ప్రతి భారతీయుడికి అవసరమైనవి. PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

అందులో మొదటిది చిప్ తయారీ ఒప్పందం. డచ్ దిగ్గజం ఏఎస్‌ఎంఎస్, చిప్ తయారీ కోసం టాటా ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. టాటా, గుజరాత్‌లోని ధోలేరాలో 91వేల కోట్ల వ్యయంతో దేశపు మొదటి సెమీ కండక్టర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.ఏఎస్‌ఎంఎల్ తన లిథోగ్రఫీ టెక్నాలజీని ఉపయోగించి అక్కడ చిప్ ఉత్పత్తిని ప్రారంభించడంలో సహాయపడుతుంది. దీని వల్ల ప్రస్తుతం 90 శాతంగా ఉన్న చిప్ దిగుమతులపై భారత్‌ ఆధారపడటం తగ్గిస్తుంది. 2023-24 1.05 లక్షల కోట్ల విలువైన చిప్‌లు దిగుమతి అయ్యాయి. PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

కోబాల్ట్, లిథియం, గ్రాఫైట్, నికెల్ వంటి 30 కీలక ఖనిజాల అన్వేషణ, తవ్వకం కోసం నెదర్లాండ్స్‌ భారత్‌కు అధునాతన టెక్నాలజీని అందిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో తన ఖనిజాల్లో 70శాతం నుంచి వంద శాతం వరకు చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

ఇవి కాకుండా గుజరాత్‌లోని ఖంభట్‌ గల్ఫ్‌పై నిర్మించనన్న 30 కిలోమీటర్ల ఆనకట్ట రూపకల్పనకు నెదర్లాండ్ ఇంజినీరింగ్ హెల్ప్ చేస్తుంది. పదకొండో శతాబ్ధపు చోళ రాజవంశానికిచెందిన 21 పెద్ద , 3 చిన్న రాగి ఫలకాలను నెదర్లాండ్ తిరిగి భారత్‌కు ఇచ్చింది. వీటిని 18వ శతాబ్ధంలో డచ్‌ మిషనరీలు ఐరోపాకు తీసుకెళ్లారు. 

దేశం   కీలక ఒప్పందం,  భారత్‌కు లాభం 
యూఏఈ     స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్    చమురు భద్రత 14-15 రోజులు 
నెదర్లాండ్స్‌    ASML+ టాటా సెమీకండక్టర్ ప్లాంట్    చిప్ దిగుమతులు తగ్గుతాయి.
నార్వే  గ్రీన్ ఎనర్జీ & ఎల్పీజీ   స్వచ్ఛ ఇంధన లక్ష్యాలు 
ఇటలీ    ఇండియా- మిడిల్ ఈస్ట్- యూరప్ కారిడార్   వాణిజ్యం పెంచుకోవడం రవాణా ఖర్చులు తగ్గించుకోవడం  

స్వీడన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం 

మే 17న ప్రధానమంత్రి మోదీ స్వీడన్ చేసుకున్నారు. అక్కడ అత్యున్నత పురస్కారం రాయల్ ఆర్డర్ ఆఫ్‌ ది పోలార్ స్టార్‌ను అందుకున్నారు. తర్వాత వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పెంపొందించే కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇక్కడ యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్‌ లేయన్ కీలక అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా యూరప్ నుంచి భారత్‌కు వచ్చే 96.6 శాతం వస్తువుపై సుంకాలు పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు. భారత్ కూడా ఇదే విధానం అవలభిస్తుంది. PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

నార్వే టూర్ ముచ్చట్లు 

ప్రధానమంత్రి మోదీ మే 18న నార్వే చేరుకున్నారు. 1983 తర్వాత నార్వేలో పర్యటించిన తొలి ప్రధానమంత్రిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ హిస్టోరిక్ టూర్‌లో కీలక ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాలు 12 అంశాలపై ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో ముఖ్యమైంది హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం. ఈ అగ్రిమెంట్ ప్రకారం భారత్‌లో సౌర, విండ్, వాటర్, అణు విద్యుత్‌ ప్రాజెక్టులపై నార్వే పెట్టుబడులు పెడుతుంది. ఇలాంటి వాటి నుంచే నార్వే 98 శాతం ఇంధనం సరఫరా చేసుకుంటోంది. ఈ ఒప్పందాలతో భారత్‌లో నాలుగేళ్లలో 500 గిగావాట్ల స్వచ్ఛ ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 


PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

నార్వే యూరప్‌లోనే అతి పెద్ద చమురు ఉత్పత్తిదారు. అందుకే ఆ దేశంలో ఎల్పీజీ కొనుగోళ్లపై ఒప్పందం జరిగింది. ఈ దేశం నుంచి రోజుకు సుమారు రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి జరుగుతుంది. ఇరాన్ యుద్ధం తర్వాత నార్వే నుంచి భారత్ ఎల్పీజీ కొనుగోళ్లను పెంచింది. భవిష్యత్‌లో మరింత పెంచేందుకు అవకాశాలను అన్వేషిస్తోంది. 


PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

ఇటలీతో వ్యాపారం, మెలోడీ స్నేహం 

మే 18న తన యూరోపియన్ పర్యటన చివరి అడుగు ప్రధాని మోదీ రోమ్‌లో వేశారు. అక్కడ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ఇద్దరు నాయకులు ఒకే కారులో ప్రయాణించి రెండేళ్ల పురాతన కొలోసియం వద్ద సెల్ఫీ కూడా తీసుకున్నారు. దీని తర్వాత, మెలోని సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు. ఈ టూర్‌లోభారత్ రెండు ప్రధాని ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్ మధ్యప్రాచ్యం యూరప్ ఆర్థిక కారిడార్‌ ను ముందుకు తీసుకెళ్లాలని భారత్ ఇటలీ నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టు రైల్వే, పోర్ట్, షిప్పింగ్ నెట్‌వర్క్‌ల ద్వారా దేశానికి మధ్య ప్రాచ్యం, యూరప్‌కు కలుపుతుంది. దీని వల్ల భారత్ నుంచి యూరప్‌కు వస్తువుల రవాణాకు పట్టే సమయం ఖర్చు 30-40 శాతం వరకు తగ్గుతుంది. 


PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

రెండు దేశాలు తమ సంబంధాన్ని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించాయి. 2029 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ యూరోలకుపైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్యం 14 బిలియన్ యూరోలుగా ఉంది.  


PM మోదీ 5 దేశాల టూర్: యూఏఈతో చమురు భద్రత, చిప్ ప్లాంట్ – మీ జేబు & ఉద్యోగాలపై ప్రభావమేంటీ?

Frequently Asked Questions

ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో ముఖ్యంగా ఏయే రంగాలపై ఒప్పందాలు చేసుకున్నారు?

ప్రధాని మోదీ యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల పర్యటనలో చమురు భద్రత, సెమీకండక్టర్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, వాణిజ్యం వంటి రంగాలపై కీలక ఒప్పందాలు చేసుకున్నారు.

యూఏఈతో జరిగిన వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ ఒప్పందం వల్ల భారత్‌కు కలిగే ప్రయోజనం ఏమిటి?

ఈ ఒప్పందం ద్వారా భారత్‌ వ్యూహాత్మక చమురు నిల్వలు 9 రోజుల నుంచి 14-15 రోజులకు పెరుగుతాయి. యుద్ధం లేదా సరఫరా అంతరాయాలు ఏర్పడినప్పుడు ఇది దేశానికి నమ్మకమైన చమురు సరఫరా మార్గాన్ని అందిస్తుంది.

నెదర్లాండ్స్‌తో జరిగిన చిప్ తయారీ ఒప్పందం భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?

ఈ ఒప్పందం ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్‌, ఏఎస్‌ఎంఎస్‌ కలిసి సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తాయి. దీని వల్ల భారత్‌ చిప్ దిగుమతులపై ఆధారపడటం తగ్గి, స్వదేశీ ఉత్పత్తి పెరుగుతుంది.

నార్వేతో జరిగిన ఒప్పందం ద్వారా భారత్‌ స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను ఎలా చేరుకోగలదు?

ఈ ఒప్పందం ప్రకారం, నార్వే భారత్‌లో సౌర, విండ్, వాటర్, అణు విద్యుత్‌ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతుంది. దీని ద్వారా భారత్‌ నాలుగేళ్లలో 500 గిగావాట్ల స్వచ్ఛ ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi Fight Video: శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Rohini Sindhuri Vs D Roopa: ఐఏఎస్ రోహిణి - ఐపీఎస్ రూపాల కేసుల పోరాటంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - ఇదే వారికి ఫైనల్ చాన్స్ !
ఐఏఎస్ రోహిణి - ఐపీఎస్ రూపాల కేసుల పోరాటంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - ఇదే వారికి ఫైనల్ చాన్స్ !
Strait of Hormuz opens after Iran war: యుద్ధం ముగిసినా పెట్రోల్ ధరలు ఇప్పుడే దిగిరావు - ట్రంప్ చేసిన పని అలాంటిది మరి !
యుద్ధం ముగిసినా పెట్రోల్ ధరలు ఇప్పుడే దిగిరావు - ట్రంప్ చేసిన పని అలాంటిది మరి !
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kesineni Brothers War: అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
అక్రమాల చిట్టాలు బయట పెట్టుకుంటున్న కేశినేని బ్రదర్స్ - ఈ రాజకీయం ఎక్కడి దాకా?
Nagative Campaign on Varanasi: OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
OTT డీల్ పోయింది.. బడ్జెట్ పేలిపోయింది.. వారణాసిపై నడుస్తున్న ప్రచారం వెనుక ఎవరున్నారు?
Football World Cup: మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
మ్యాచ్ డ్రా అయినా మనసులు గెలిచిన జపాన్ అభిమానులు.. వైరల్ అవుతున్న వీల్‌చైర్ ఫ్యాన్ రియల్ హీరో మూమెంట్!
Vaibhav Sooryavanshi Fight Video: శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
శ్రీలంక ప్లేయర్ల పైకి దూసుకెళ్లిన ఇండియా వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీ.. అసలేం జరిగిందంటే?
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
Embed widget