One Nation One Election Bill In Lok Sabha : వన్‌ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభ ముందు ఈ బిల్లును ఉంచారు. 129వ రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తూ ఆమోదించాలని చెప్పారు. 


వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రకటించారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రక్రియ, పాలనలో స్పష్టత వస్తుందనే విషయం ఏపీలో చూశామన్నారు. ఇది మా అనుభవమని, దేశవ్యాప్తంగా ఇదే జరగాలని కోరుకుంటున్నామని అన్నారు.


బిల్లును కాంగ్రెస్, ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ ఎంపీలు మనీష్ తివారీ, ధర్మేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ ఇది రాజ్యాంగ స్ఫూర్తి విరుద్దమని విమర్శించారు. 
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఆప్ కూడా చెప్పేసింది. ఇది దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుందని అభిప్రాయపడ్డారు ఆ పార్టీ ఎంపీలు. దీన్ని ఇక్కడితే ముగిస్తే దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుటుందన్నారు. 


8 రాష్ట్రాల్లో ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేని వారు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మాట్లాడుతున్నారని సమాజ్‌వాది పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఒవైసీ నిరసన 
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. ఈ బిల్లు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను నాశనం చేస్తుందన్నారు. ముఖ్యనాయకుడి అహాన్ని సంతృప్తి పరచడానికే దీన్ని ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు. 


బిల్లును వ్యతిరేకించన ఎన్సీపీ శరద్ వర్గం 
ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఎంపీ సుప్రియా సూలే వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకించారు. ఇది సమాఖ్య వ్యవస్థపైనే దాడి అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికలను ఒకటి చేయడం సరికాదన్నారు.


Also Rad: నెహ్రూ లేఖ 80 ఏళ్ల త‌ర్వాత ఎందుకు సంచ‌ల‌నం రేపుతోంది? అస‌లు ఏం జ‌రిగింది?


బిల్లును వ్యతిరేకిస్తూ సీపీఎం
రాజస్థాన్‌కు చెందిన సీపీఎం ఎంపీ అమరారామ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకించారు.


బిల్లుకు జేడీయూ మద్దతు
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించాలని.. పంచాయతీ ఎన్నికలు వేర్వేరుగా జరగాలని మేము ఇంతకుముందు చెప్పాం. ఈ దేశంలో ఎన్నికలు ప్రారంభమైనప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండేది. 1967లో కాంగ్రెస్ రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి పరిస్థితి మారిపోయింది."


కాంగ్రెస్, బీజేపీపై శిరోమణి అకాలీదళ్ ఆగ్రహం
వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మాట్లాడుతూ.. "చర్చించాల్సిన అంశాలు చర్చకు రాకుండా పక్కదారి పట్టించేందుకే వన్‌ నేషన్ వన్‌ ఎలక్షన్ బిల్లు తెచ్చారు. సభను సక్రమంగా నడపాలని ప్రభుత్వం కానీ కాంగ్రెస్ కానీ కోరుకోవడం లేదు. ఎవరికి కావాల్సిన ఫీడ్ వాళ్లకు దొరుకుతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నుంచి ఎవరికి ఉద్యోగాలు వస్తాయి?" అని ప్రశ్నించారు. 


Also Read: 7 దేశాల ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత రూపొందించిందే వన్‌ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు