(Source: ECI/ABP News/ABP Majha)
కేటీఎమ్ బైక్‌పై స్టైలిష్ లుక్‌లో రాహుల్ గాంధీ, లద్దాఖ్‌లో పాంగాంగ్ లేక్ వరకూ లాంగ్ రైడ్
Rahul Gandhi Bike Ride: రాహుల్ గాంధీ లద్దాఖ్‌లో కేటీఎమ్ బైక్‌పై పాంగాంగ్ లేక్ వరకూ రైడ్ చేస్తున్నారు.
Rahul Gandhi Bike Ride:
రాహుల్ బైక్ రైడ్..
కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో ఉన్నారు. అక్కడి ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన..ఆ తరవాత రాజకీయాల్ని పక్కన పెట్టేశారు. ఓ ఎంపీగా కాకుండా ఓ సాధారణ పౌరుడిగా బైక్ రైడ్ చేయాలని అనుకున్నారు. అందుకే...లద్దాఖ్‌లోని పాంగాంగ్ లేక్ వరకూ బైక్‌పై వెళ్తున్నారు. తన రైడ్‌కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రాహుల్. ఇందులో ఆయన చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ప్రో రైడర్ లుక్‌లో KTM 390 Adventure బైక్ నడుపుతున్నారు. మరి కొందరు రైడర్స్ ఆయనను ఫాలో అవుతున్నారు. హెల్మెట్, గ్లోవ్స్, రైడింగ్ బూట్స్, జాకెట్‌తో రైడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆగస్టు 20న రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ జయంతి. ఆయన జయంతిని పాంగాంగ్‌లో జరుపుకోవాలనేది రాహుల్ కల. అందులోనూ ఇది రాజీవ్ గాంధీకి చాలా ఇష్టమైన ప్రదేశమట. ఇదే విషయాన్ని రాహుల్ సోషల్ మీడియాలో చెప్పారు.
"పాంగాంగ్ లేక్‌కి బైక్‌రైడ్ చేస్తూ వెళ్తున్నాను. ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశం అదే అని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ
View this post on Instagram
ఆగస్టు 25 వరకూ పర్యటన..
ఆగస్టు 25వ తేదీ వరకూ రాహుల్ లద్దాఖ్‌లోనే పర్యటించనున్నారు. రాహుల్ ఫొటోలను కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసింది. "అన్‌స్టాపబుల్" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అడ్వెంచర్ టూర్స్‌కి పనికొచ్చి KTM 390 బైక్ గంటకు 155 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. నిజానికి..రాహుల్ గాంధీకి ఈ బైక్ అంటే చాలా ఇష్టం. సొంతగా ఓ బైక్ కొనుక్కున్నారు కూడా. కానీ సెక్యూరిటీ కారణాల వల్ల ఎప్పుడూ దాన్ని నడపలేదు. ఇటీవల ఢిల్లీలోని కరోల్ బాగ్ మార్కెట్‌లో బైక్ సర్వీసింగ్ సెంటర్‌లో కూర్చుని మెకానిక్స్‌తో మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పారు రాహుల్. తనకు బైక్ ఉన్నా సెక్యూరిటీ దాన్ని నడపనివ్వదని అన్నారు.
Upwards and onwards - Unstoppable! pic.twitter.com/waZmOhv6dy
— Congress (@INCIndia) August 19, 2023
ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంట్ నుంచి తిరిగి వెళ్తుండగా నడిరోడ్డుపైనే స్కూటీపై నుంచి ఇద్దరు కింద పడిపోయారు. వెంటనే కాన్వాయ్‌ని ఆపిన రాహుల్...కార్ దిగి వాళ్ల దగ్గరకి వెళ్లారు. ఇద్దరినీ పరామర్శించారు. దెబ్బలు తగిలాయా అని అడిగారు. స్వయంగా ఆయనే స్కూటీని పైకి లేపి వాళ్లకు సాయం చేశారు. ఇద్దరితోనూ మాట్లాడి వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్లీ వెళ్లి కార్లో కూర్చున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో పోస్ట్ చేశారు. జన్నాయక్ అంటూ కాంగ్రెస్ పోస్ట్ చేసింది.
"आपको चोट तो नहीं लगी?"
— Congress (@INCIndia) August 9, 2023
रास्ते में जाते समय @RahulGandhi जी ने देखा कि एक स्कूटर चालक बीच सड़क पर गिर गया है।
वे गाड़ी रुकवाकर चालक के पास गए और उसका हाल पूछा।
जननायक ❤️ pic.twitter.com/aCeDGAMOlY
Also Read: సెప్టెంబర్‌లో మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు - శిందే పదవికి ఎసరు తప్పదా?