న్యూఢిల్లీ: నేవీ వైస్ అడ్మిరల్ ఎఎన్ ప్రమోద్ మాట్లాడుతూ, "పహల్గాం ఉగ్రదాడి జరిగిన 96 గంటల్లోనే అరేబియా సముద్రంలో మేం పరీక్షలు నిర్వహించాం. మా వ్యూహాలకు తగినట్లుగా టార్గెట్స్ ఛేదించడానికి గల ప్రయత్నాలలో భాగంగా కొన్నింటిని పరీక్షించి, కొన్ని మెరుగుపరిచాం. టార్గెట్స్‌పై ఆయుధాలను కచ్చితంగా ప్రయోగించడానికి పరీక్షించి, సిద్ధంగా ఉన్నాం. ఆ తరువాత, మా దళాలు ఉత్తర అరేబియా సముద్రంలో నిర్ణయాత్మకంగా ముందుకు సాగాయి. కరాచీతో సహా ఉపరితలంపై ఎంపిక చేసిన లక్ష్యాలను అనుకున్న సమయంలో ఛేదించడానికి పూర్తి సామర్థ్యంతో నేవీ సిద్ధంగా ఉంది. మనం అటాకింగ్ మోడ్‌లో ఉండటం వల్ల పాకిస్తాన్ నావికాదళం, పాక్ ఎయిర్‌ఫోర్స్ డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లాయని" తెలిపారు.
పాక్ దాడులను ఈజీగా తిప్పికొట్టాం, ఏ నష్టం జరగలేదు
పాకిస్తాన్ జరిపిన దాడుల్లో భారత వైమానిక కేంద్రాలకు ఎలాంటి డ్యామేజ్ జరగలేదని, వారి దాడులను తిప్పికొట్టడంతో పాటు లాహోర్, గుజ్రావాలాలోని పాక్ రాడార్ సిస్టమ్స్ పై దాడి చేశామని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. పాకిస్తాన్ ప్రయోగించిన కొన్ని ఫైటర్ జెట్స్‌ను భారత ఆర్మీ కూల్చివేసినట్లు వెల్లడించారు. మేం కేవలం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపితే, పాక్ మాత్రం అమాయక పౌరులపై దాడులు చేసి వికృత బుద్ధిని మరోసారి బయటపెట్టిందన్నారు.
ఆపరేషన్ సిందూర్, అనంతరం జరిగిన పాక్ దాడులు, వాటిని తిప్పికొట్టడంపై డీజీఎం, త్రివిధ దళాధిపతులు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ.. "DGMO చెప్పినట్లుగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌కు ప్లాన్ చేశాం. మొత్తం తొమ్మిది లక్ష్యాలలో, భారత వైమానిక దళానికి బహవల్పూర్, మురిడ్కేలోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలను కేటాయించారు. ఈ 2 పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. బాగా క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత సమర్థవంతంగా దాడులు చేశాం. గగనతనం నుంచి భూ ఉపరితలం పైకి మందుగుండుతో దాడి చేసి టార్గెట్స్ ఛేదించాం.
పాకిస్తాన్ దాడుల్లో భారత వైమానిక స్థావరాలకు నష్టం జరగలేదుఆపరేషన్ సిందూర్ తరువాత మే 8వ తేదీ రాత్రి 22:30 గంటల నుండి 9న సైతం పలు భారత నగరాల్లో డ్రోన్లు, మానవరహిత వైమానిక దాడులు చేసింది పాక్. అటు శ్రీనగర్ నుండి నలియా వరకు మేం సిద్ధంగా ఉన్నాం. దాంతో శత్రువులు నిర్దేశించిన టార్గెట్స్‌కు ఎటువంటి నష్టం జరగకుండా వారి దాడులను తిప్పికొట్టాం. భారత బలగాలు మరోసారి సైనిక స్థావరాలు, లాహోర్, గుజ్రాన్‌వాలాలోని రాడార్ సైట్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు చేశాం. లాహోర్‌కు దగ్గరగా డ్రోన్ దాడులు మొదలుపెట్టగా.. శత్రువు పౌక్ వారి పౌర విమానాలను లాహోర్ నుండి ఫ్లైయింగ్ కు అనుమతించారు. దాంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి టార్గెట్ ఫినిష్ చేశామని ఎయిర్ మార్షల్ ఎకె భారతి చెప్పారు.
నిరంతరం సమీక్షలు, ఏర్పాట్లతో తిప్పికొట్టిన బలగాలుఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ ఉగ్రస్థావరాలను నాశనం చేయగా.. పాక్ ఆర్మీ శ్రీనగర్ నుండి నల్య వరకు డ్రోన్లు, యూఏవీలు, ఫైటర్ జెట్స్ తో దాడులకు యత్నించింది. మేం ముందుగానే ఎదురుదాడికి సిద్ధమైన కారణంగా పాక్ కుయుక్తులు చెల్లలేదు. వారి దాడికి ప్రతిదాడి చేసి, పాక్ లోని కొన్నిచోట్లకు వెళ్లి దాడులతో సత్తా చాటాం.