News
News
వీడియోలు ఆటలు
X

New Parliament Video: ప్రారంభోత్సవానికి రెడీ అయిన కొత్త పార్లమెంట్, ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ - మీరూ చూసేయండి

ఈ నెల 28 వ తేదీన(ఆదివారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నూతన పార్లమెంట్ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు.

FOLLOW US: 
Share:

Video: ఆధునిక హంగులు, అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 28వ తేదీన(ఆదివారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా న్యూ పార్లమెంట్ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేశారు. 1.48 నిమిషాల నిడివి గల వీడియోలో కొత్త పార్లమెంట్ భవనాన్ని చూపించారు. ప్రధాన ద్వారం నుండి లోపలకి ప్రవేశిస్తూ.. ప్రారంభం అవుతుంది ఈ ఫస్ట్ లుక్ వీడియో. పార్లమెంట్ భవనం లోపలి, బయటి దృశ్యాలను చిత్రీకరించారు. లోక్ సభ, రాజ్యసభ.. ఈ రెండు సభల్లో సభ్యుల సీటింగ్ అమరికను చూపించారు. 

ఎన్నో హంగులతో రూపుదిద్దుకున్న కొత్త భవనం

64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్లమెంట్ నాలుగు అంతస్తులతో ఉంటుంది. మొత్తం 1,224 మంది ఎంపీలు కూర్చునే అవకాశం ఉంటుంది. కొత్త పార్లమెంట్ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. వాటికి జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అని పేర్లు పెట్టారు. ఇందులో  పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కమిటీ గదులు కూడా ఎన్నో హంగులతో రూపుదిద్దుకున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ తో పాటుగా దేశంలో ప్రధాన మంత్రులుగా చేసిన వారి ఫొటోలను పొందుపరచనున్నారు.   పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు జూలైలో కొత్త భ‌వ‌నంలో జ‌రిగే అవకాశం ఉంది. 

కరోనా వల్ల ఆలస్యమైన పనులు

2020 డిసెంబర్ 10వ తేదీన ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మోదీ. అయితే...కొవిడ్ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. 2021 జనవరిలో నిర్మాణం మొదలైంది. అహ్మదాబాద్‌కి చెందిన HCP Design Planning and Management ఈ బిల్డింగ్‌ని డిజైన్ చేసింది. ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ (Bimal Patel)దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌ పక్కనే Tata Projects Limited ఈ నిర్మాణాన్ని చేపట్టింది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ కొత్త పార్లమెంట్‌ విశేషాలేంటో ఓ సారి చూద్దాం. 

1. సీటింగ్ కెపాసిటీ 

పాత పార్లమెంట్‌లో లోక్‌సభలో 543 మంది, రాజ్యసభలో 250 మంది కూర్చునేందుకు వీలుండేది. కొత్త పార్లమెంట్‌లో సీటింగ్ కెపాసిటీ పెంచారు. 888 మంది లోక్‌సభలో, 300 మంది రాజ్యసభలో కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. 

2. విస్తీర్ణంలోనూ భారీతనమే..

కొత్త పార్లమెంట్‌ భవనాన్ని 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. పాత భవనం డయామీటర్ 560 అడుగులు. అది కేవలం 24,281 చదరపు మీటర్ల విస్తీర్ణంలోనే ఉంది. ఇప్పుడీ విస్తీర్ణాన్ని భారీగా పెంచారు. 

3. సెంట్రల్ హాల్‌ లేదు 

ప్రస్తుత పార్లమెంట్‌లో సెంట్రల్ హాల్ ఉంది. ఇందులోనే మీటింగ్‌లు జరిగేవి. అయితే.. కొత్త పార్లమెంట్‌లో మాత్రం ఈ వసతి లేదు. లోక్‌సభ ఛాంబర్‌లోనే జాయింట్ సెషన్స్ ఏర్పాటు చేసుకునేలా మార్పులు చేర్పులు చేశారు. 

4. హై ఎండ్ టెక్నాలజీ

పాత పార్లమెంట్‌లో ఫైర్ సేఫ్‌టీ (Fire Safety) లేదు. అసలు ఆ బిల్డింగ్‌ని ఫైర్‌ సేఫ్‌టీ నార్మ్స్ ప్రకారం నిర్మించలేదన్న వాదనలూ ఉన్నాయి. సెంట్రల్ విస్టా వెబ్‌సైట్‌లో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కొత్త పార్లమెంట్‌లో ఇలాంటి సమస్యలేవీ రాకుండా జాగ్రత్తగా డిజైన్ చేశారు. కొత్త టెక్నాలజీతో రూపొందించారు. బయోమెట్రిక్స్ తీసుకొచ్చారు. ట్రాన్స్‌లేషన్ సిస్టమ్, ప్రోగ్రామబుల్ మైక్రోఫోన్స్ లాంటి హంగులూతోడయ్యాయి. 

Also Read: New Parliament Building : కొత్త పార్లమెంట్ బిల్డింగ్ రెడీ - ప్రారంభోత్సవం స్పెషల్స్ ఇవే !

5. రూ.1,200 కోట్ల ఖర్చు 

సనాతన పరంపర, వాస్తు శాస్త్రానికి సంబంధించిన పెయింటింగ్స్, డెకరేటివ్ ఆర్ట్స్, వాల్ ప్యానెల్స్, శిల్పాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ నిర్మాణానికి రూ.1,200 కోట్లు ఖర్చు చేసింది కేంద్రం. ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లో భాగంగా కొత్త సెంట్రల్ సెక్రటేరియట్‌ నిర్మాణం, రాజ్‌పథ్‌లో మార్పులు చేర్పులు, ప్రధాని కొత్త ఇల్లు, ప్రధాని కొత్త కార్యాలయం..ఇలా అన్నింటినీ నిర్మించారు. పాత పార్లమెంట్‌ భవన నిర్మాణాన్ని 1921లో మొదలు పెట్టి 1927లో పూర్తి చేశారు. అప్పట్లో దీని కోసం రూ.83 లక్షలు ఖర్చు పెట్టారు.

Published at : 26 May 2023 06:55 PM (IST) Tags: PM Modi First look New Parliament Building Parliament Video May 28

సంబంధిత కథనాలు

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

Odisha Train Accident: ఒడిశా దుర్ఘటనకు కారణాలేంటి? ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?

Odisha Train Accident: ఒడిశా దుర్ఘటనకు కారణాలేంటి? ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేదెవరు?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి- ట్వీటర్ ద్వారా సంతాప సందేశం

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి-  ట్వీటర్ ద్వారా సంతాప సందేశం

Odisha Train Accident LIVE: ఒడిశా రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన మమత బెనర్జీ

Odisha Train Accident LIVE: ఒడిశా రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన మమత బెనర్జీ

టాప్ స్టోరీస్

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం