బుధవారం (7 మే 2025) తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. కోట్లి ఉగ్రవాద స్థావరంపై భారతదేశం జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది ఖారీ మొహమ్మద్ ఇక్బాల్ హతమయ్యాడు.
NIA మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఖారీ మొహమ్మద్
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రెండు వారాల తర్వాత, బలమైన ప్రతీకార చర్యలో, భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేసింది, వీటిలో ఉగ్రవాద గ్రూపులైన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ స్థావరాలను మట్టుపెట్టింది. ఈ దాడుల్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. అాలంటి వారిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు కూడా ఉన్నారు అందులో ఒకరు ఖారీ మొహమ్మద్ ఇక్బాల్. ఇతను NIA మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. యువకులకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదులుగా మారుస్తున్నాడు. వారిని పాకిస్థాన్ తీసుకెళ్లి ట్రైనింగ్ ఇస్తున్నాడు.
మౌలానా మసూద్ అజహర్ కుటుంబం హతం
ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో జేషే మమ్మద్ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజహర్ కుటుంబం మొత్తం చనిపోయింది. భారత్ సైన్యం చేపట్టిన మెరుపు దాడుల్లో అతని కుటుంబంలో 14 మంది వరకు చనిపోయారని సమాచారం. ఈ మరణాలపై అజహర్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ కుటుంబ సభ్యులు పది మంది, నలుగురు సన్నిహితులు మరణించినట్లు పేర్కొన్నాడు. పీటీఐ వార్తా సంస్థ ఇచ్చిన కథనం ప్రకారం పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం, జామియా మసీద్ సుభాన్ అల్లాపై దాడి జరిగిది. ఈ దాడుల్లో అజహర్ పెద్ద సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, ఇంకా తమ బంధువర్గానికి చెందిన ఐదుగురు పిల్లలు చనిపోయినట్టు ఒక ప్రకటనలో చెప్పాడని సమాచారం
గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది దాయాది దేశం. ఇది పీవోకే , పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాలలో విస్తరించి ఉంది. పీఓకేలో మొదటి లక్ష్యం ముజఫరాబాద్‌లోని సవాయి నాలా శిబిరం, ఇది నియంత్రణ రేఖ నుంచి 30 కి.మీ దూరంలో ఉంది. ఇది లష్కరే తోయిబా శిక్షణా కేంద్రం. 2024 అక్టోబర్ 20న సోనామార్గ్, 24 అక్టోబర్ 2024న గుల్మార్గ్, 22 ఏప్రిల్ 2025న పహల్గామ్‌లో జరిగిన దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం
ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం, వైమానిక దళం, విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం (మే 7, 2025) ఉదయం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. దీనిలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత సైన్యం కల్నల్ సోఫియా ఖురేషి పాల్గొన్నారు. ఉగ్రవాద స్థావరాలపై దాడికి సంబంధించిన క్లిప్‌లను కూడా సైనిక అధికారులు చూపించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయడానికే ఆపరేషన్ సిందూర్ ప్రాంభించినట్టు కల్నల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ గురించి చెప్పారు.
ఉగ్రవాద స్థావరాలే లక్ష్యం
భారత సైన్యం 25 నిమిషాల్లో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. వీటిలో కసబ్, హెడ్లీ వంటి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన రహస్య స్థావరాలు కూడా ఉన్నాయి. "ఆపరేషన్ సిందూర్ కింద, ముజఫరాబాద్‌లోని లష్కరే సవాయి నాలా శిక్షణా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. సోనామార్గ్, గుల్మార్గ్ , పహల్గామ్ దాడుల ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందారు. దీనితో పాటు, ముజఫరాబాద్‌లోని సయ్యద్నా బిలాల్ శిబిరంపై దాడి జరిగింది" అని ఆర్మీ అధికారులు తెలిపారు.