Arvind Kejriwal's Speech: 


ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో ప్రసంగం..


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా ఉన్నట్టుండి ఆప్‌కి వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. కాసేపటి వరకూ "మోదీ మోదీ" అంటూ గట్టిగా నినదించారు. దీంతో కేజ్రీవాల్ అసహనానికి గురయ్యారు. అంతలోనే కూల్ అయిపోయి.."దయచేని నేను చెప్పేది 5 నిముషాలు వినండి" అని చేతులు జోడించి వేడుకున్నారు. నినాదాలతో విద్యావ్యవస్థ బాగు పడుతుందనుకుంటే  70 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చేవని అన్నారు. అప్పటికే బీజేపీ, ఆప్ మద్దతుదారుల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. అటు ఆప్ కార్యకర్తలూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈస్ట్ ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అలజడి రేగింది. ఈ కార్యక్రమానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో పాటు బీజేపీ ఎంపీ, క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా హాజరయ్యారు. ఇటీవలే ఈ క్యాంపస్‌ని నిర్మించారు. మొత్తం 19 ఎకరాల్లో చేపట్టిన ఈ నిర్మాణానికి రూ.388 కోట్లు ఖర్చైంది. 2,400 మంది విద్యార్థులకు సరిపడ వసతులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ప్రసంగిస్తుండా..బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 


"రెండు పార్టీల కార్యకర్తలు కాసేపు శాంతించాలని కోరుకుంటున్నాను. నేను చెప్పేది ఓ 5 నిముషాలు వినండి. అప్పటికి కూడా మీకు నచ్చకపోతే నినదించండి. అప్పటి వరకూ మాత్రం శాంతించండి. నినాదాలతో విద్యావ్యవస్థ మారిపోతుందనుకుంటే..గత 70 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చుండేవి"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం