LPG Cylinder Subsidy: 


రూ.300 సబ్సిడీ..


ఎల్‌పీజీ సిలిండర్ల సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న రూ.200 సబ్సిడీని రూ.300కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. Pradhan Mantri Ujjwala Yojana స్కీమ్‌లో భాగంగా ఎల్‌పీడీ సిలిండర్లపై సబ్సిడీ ఇస్తోంది కేంద్రం. 


"కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అందులో కోట్లాది మంది మహిళలకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకున్నాం. LPG సిలిండర్లపై ఇచ్చే సబ్సిడీని రూ.200 నుంచి రూ.300కి పెంచాలని నిర్ణయించాం"


- అనురాగ్ ఠాకూర్, కేంద్రమంత్రి