నేడు భారత ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. ఎన్నికై సుదీర్ఘకాలం భారత ప్రధానిగా సేవలు అందించిన నేతగా నిలిచారు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును 6 దశాబ్దాల తరువాత బద్దలుకొట్టారు. నేటితో జూన్ 8, 2026 నిరంతరాయంగా 12 సంవత్సరాలు ప్రధానిగా పరిపాలనను పూర్తి చేసుకున్నారు. అయితే భారత ప్రధానిగా ఎక్కువ కాలం జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి సేవలు అందించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికల వరకు ప్రధానిగా వ్యవహరించిన నెహ్రూ మరణించే వారకు ఆ పదవిలో కొనసాగారు.
భారత్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన టాప్ 5 ప్రధాన మంత్రులు వీరే. భారత ప్రజాస్వామ్య చరిత్రలో తమదైన ముద్ర వేసి, దేశాన్ని దశాబ్దాల పాటు నడిపించిన అగ్ర నేతలు కాంగ్రెస్, ఎన్డీయే, యూపీఏ కూటమి నుంచి ప్రధానులు అయ్యారు.
1. జవహర్‌లాల్ నెహ్రూ మొత్తం పదవీకాలం: 16 సంవత్సరాల 286 రోజులు (మొత్తం 6,130 రోజులు.1952 ఎన్నికల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా 4,398 రోజులు పాలించారు. ఆగస్టు 15, 1947న స్వతంత్ర భారత తొలి తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మొదట స్వతంత్య్ర భారతావనిలో తొలి ఎన్నికలకు ముందు 1947– 1952 మధ్య కాలంలో ఆయన ప్రధానిగా సేవలు అందించారు. దేశంలో ఎన్నికైన తొలి ప్రధాని నెహ్రూనే. ఒకటోసారి పదవీకాలం (1951-52 ఎన్నికలు): దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని అయ్యారు. 1957 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ విజయంతో మూడోసారి సారి ప్రధాని అయ్యారు. 3వ ఎన్నికైన పదవీకాలం 1962 ఎన్నికలు కాగా.. నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మే 27, 1964న పదవిలో ఉన్న సమయంలో కన్నుమూశారు.
2. ఇందిరా గాంధీ మొత్తం పదవీకాలం: 15 సంవత్సరాల 350 రోజులు (రెండు విడతలుగా) ప్రధానిగా సేవలు.పదవీకాలాలు & ఎన్నికల సంవత్సరాలు: మొదటి విడత 1966 నుంచి 1977 వరకు ప్రధానిగా కొనసాగారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణం తర్వాత ఇందిరాగాంధీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ప్రధానిగా సేవలు అందించారు. "గరీబీ హటావో" నినాదంతో 1971 ఎన్నికల్లో విజయంతో చారిత్రాత్మక విజయం సాధించారు. ఈ కాలంలోనే ఆమె పాలనపై వ్యతిరేకత రావడంతో దేశంలో ఎమర్జెన్సీ (1975-77) విధించి అప్రతిష్ట మూట కట్టుకున్నారు. రెండో విడతలో 1980– 1984 మధ్య కాలంలో దేశాన్ని పాలించారు. 1980 ఎన్నికల్లో విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చారు. అక్టోబర్ 31, 1984న హత్యకు గురయ్యే వరకు వరకు ప్రధానిగా కొనసాగారు.
3. నరేంద్ర మోదీ మొత్తం పదవీకాలం: 12 సంవత్సరాల 14 రోజులు (ప్రస్తుతం కొనసాగుతున్నారు). పదవీకాలం & ఎన్నికల సంవత్సరాలు: మే 26, 2014న తొలిసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ అందించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సంచలనం సృష్టించారు. జీఎస్టీని అమలు చేశారు. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి రెండోసారి ప్రధాని అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయంతో జూన్ 9, 2024న ఎన్డీయే (NDA) కూటమి ప్రభుత్వ అధినేతగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి విజయవంతంగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికై సుదీర్ఘంగా ప్రధానిగా సేవలు అందించిన నేతగా నెహ్రూ రికార్డు క్రియేట్ చేశారు. సీఎంగా, పీఎంగా చూసుకుంటే ప్రజల చేత ఎన్నికై ఎక్కువ రోజులు ప్రభుత్వాధినేతగా సేవలు అందించిన జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నారు.
4. మన్మోహన్ సింగ్ మొత్తం పదవీకాలం: 10 సంవత్సరాల 4 రోజులు.అత్యధిక కాలం ప్రధానిగా చేసిన జాబితాలో మన్మోహన్ సింగ్ నాలుగో స్థానంలో ఉన్నారు. విజయవంతంగా రెండు టర్మ్స్ పూర్తి చేసుకున్న నెహ్రూ, గాంధీయేతర ఫ్యామిలీకి చెందిన తొలి నేతగా రికార్డు నెలకొల్పారు. 2004 ఎన్నికల్లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA-1) కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. సోనియా గాంధీ పట్ల సీనియర్ నేతలు అనాసక్తిగా ఉండటంతో ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. 2009 ఎన్నికల్లో యూపీఏ కూటమి రెండోసారి విజయవం సాధించగా మరోసారి ప్రధాని అయ్యారు. మే 26, 2014 వరకు పదేళ్ల పాటు ఆర్థిక సంస్కరణల దిశగా దేశాన్ని నడిపించారు.
5. అటల్ బిహారీ వాజ్‌పేయీ మొత్తం పదవీకాలం: 6 సంవత్సరాల 80 రోజులు (మూడు విడతలుగా కలిపి). మొదటి విడత 1996 ఎన్నికల్లో తొలిసారి ప్రధాని అయ్యారు. మే 1996లో కేవలం 13 రోజుల పాటు అత్యల్ప కాలం ప్రధానిగా కొనసాగారు. 1998 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయంతో మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినా, కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో 13 నెలలకే ఈ ప్రభుత్వం కూలిపోయింది. కార్గిల్ యుద్ధం అనంతరం జరిగిన 1999 ఎన్నికల్లో విజయం సాధించి, పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని (1999-2004) పూర్తి చేశారు. ఆ సమయంలో పూర్తి 5 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా వాజ్‌పేయీ రికార్డు సృష్టించారు. ఈయన హయంలోనే అబ్దుల్ కలాం రెండోసారి అణు పరీక్షల్లో భారత్ విజయం సాధించి సత్తా చాటింది.
