Boycott Lenskart: భారత్‌లో ప్రతి చోట కనిపించే ఐవేర్ రిటైలర్ సంస్థ లెన్స్‌కార్ట్ వివాదాల సుడిలో చిక్కుకుంది. ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు ఇచ్చిన డ్రెస్‌ కోడ్ రూల్స్ ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. దీనికి సంబంధించిన స్క్రీన్‌ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఫైర్ అవుతున్నారు. సంస్థ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సాల్‌ను టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మత పరమైన విషయాల పట్ల వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Continues below advertisement

వివాదం ఏంటంటే?

ఈ వివాదం ప్రధానంగా ఎక్స్ వేదికగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా వినియోగదారు షెఫాలీ వైద్య, లెన్స్‌ కార్ట్ అంతర్గత స్టైల్ గైడ్‌ అని పేర్కొంటూ ఒక ఫోటో షేర్ చేశారు. అందులో 11వ పేజీలో ఉన్న రూల్స్ ప్రకారం కంపెనీ ఉద్యోగులు హిజాబ్ ధరించడానికి అనుమతి ఇచ్చారు. కానీ బొట్టు, తిలకం, కంకణం పెట్టుకునేందుకు మాత్రం అనుమతి లేదని తెలిపారు. దీనిపై ఆంక్షలు పెట్టడం కనిపించింది. 

హిందూ మెజారిటీ ఉన్న దేశంలో మెజార్టీ ఉద్యోగులు, వినియోగదారులు హిందువులే అయినప్పటికీ, పీయూష్‌ బన్సాల్ తన ఉద్యోగులకు హిజాబ్ పర్వాలేదు, కానీ బొట్టు, తిలకం పెట్టుకోకూడదని చెబుతున్నారు" అని షెఫాలీ వైద్య చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. 

లెన్స్‌కార్ట్‌పై నెటిజన్ల ఆగ్రహం 

ఈ వైరల్ పోస్ట‌పై స్పందిస్తూ చాలా మంది వినియోగదారులు లెన్స్ కార్ట్‌ తీరును తప్పుపట్టారు. మతపరమైన చిహ్నాల విషయంలో ఒకే సంస్థలో రెండు రకాల రూల్స్ ఉండటం డబుల్ స్టాండర్డ్స్‌ అని విమర్శిస్తున్నారు. హిందూ ఉద్యోగులకు కుంకమ, బొట్టు పెట్టుకునే హక్కు నిరాకరిస్తూ హిజాబ్‌ను అనుతించడం ఏంటని ఇది వివక్ష కాదా అని ప్రశ్నిస్తున్నారు. 

మరికొందరు వినియోగదారులు ఈ నిబంధనలు అన్యాయమైనవని అభివర్ణించారు. కొంతమంది లెన్స్‌కార్ట్ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇంత వివాదం తర్వాత కూడా పాలసీ ఏమైనా మార్చా అని మరికొందరు నిలదీస్తున్నారు. ఇలాంటి విపక్షాపూరితమైన నిబంధనలు అసలు ఎందుకు ఉన్నాయో కంపెనీ సమాధానం చెప్పాలి అని మరికొందరు క్వశ్చన్ చేస్తున్నారు. 

వివరణ ఇచ్చిన క్షమాపణ చెప్పిన పీయూష్ బన్సాల్

వివాదం ముదురుతున్న వేళ లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సాల్‌ రంగంలోకి దిగారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ, వైరల్ అవుతున్న డాక్యుమెంట్ ఇప్పుడు తమ సంస్థలో ఉన్న రూల్స్‌ది కాదని చెప్పారు. తప్పుదారి పట్టించేలా ఉందన్నారు. తమ కంపెనీలో బొట్టు , తిలకకంపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ఎప్పటికప్పుడు కంపెనీరూల్స్ మారుతుంటాయని వివరించారు. ఈ గందరగోళం వల్ల కలిగిన అలజడికి ఆయన క్షమాపణలు చెప్పారు. ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు.