అన్వేషించండి

Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!

Karnataka Congress Crisis: కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం రేగింది. శాఖల కేటాయింపుపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఒక మంత్రి రాజీనామా చేస్తే మరో మంత్రి అందుకు సిద్ధపడుతున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు శాఖల కేటాయింపులో అసంతృప్తి వెల్లువెత్తింది.
  • సీనియర్ మంత్రి మునియప్ప తనకు కేటాయించిన శాఖ మార్పును డిమాండ్ చేశారు.
  • మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేశారు; సీఎం చర్చలతో పరిష్కరిస్తానన్నారు.

Karnataka Congress Crisis: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటలు గడవక ముందే సీఎం డీకే శివకుమార్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఉదయం రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాసేపటికే మునియప్ప అసంతృప్తి గళమెత్తారు. మరి కొంతమంది సీనియర్లు కూడా ఇదే బాటలో ఉన్నారని తెలుస్తోంది.  

శాఖల కేటాయింపు విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రభుత్వంలో అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. సీనియర్ నాయకుడు కేహెచ్ మునియప్ప తన ప్రస్తుత శాఖలో మార్పు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు, మంత్రి రామలింగారెడ్డి కూడా శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కె.హెచ్. మునియప్ప మాట్లాడుతూ, తనకు పోర్ట్‌ఫోలియో మార్పు కావాలని పార్టీ నాయకత్వం ముందు డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటక పర్యటన సందర్భంగా కూడా తాను ఈ అభ్యర్థన చేసినట్లు ఆయన చెప్పారు.

తాను ఈ విషయాన్ని రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా చర్చిస్తానని మునియప్ప అన్నారు . సీనియర్ నాయకులకు ప్రోటోకాల్, అనుభవం ఆధారంగా పోర్ట్‌ఫోలియోలను కేటాయించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తనకు సాంఘిక సంక్షేమం, వ్యవసాయం లేదా నీటిపారుదల శాఖలను కేటాయిస్తే ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయగలనని పేర్కొంటూ, మునియప్ప ఈ శాఖల పట్ల తన ఆసక్తిని వ్యక్తం చేశారు. తాను గత మూడేళ్లుగా ఆహార, పౌర సరఫరాల శాఖను నిర్వహించానని, ఇప్పుడు మార్పు కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.

శాఖల కేటాయింపు విషయంలో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శుక్రవారం తెలిపారు. ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని తన ఆప్తమిత్రుడిగా ఆయన అభివర్ణించారు.

డి.కె. శివకుమార్ ఇంకా ఏం చెప్పారు?

రామలింగారెడ్డి అభ్యంతరం తనకు కేటాయించిన శాఖ సంబంధించిందని, దీన్ని పరిష్కరిస్తామని శివకుమార్ అన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "రామలింగారెడ్డి నా సహచరుడు, ఒక సీనియర్ నాయకుడు. ఆయనకు కేటాయించిన శాఖలో ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తోందని, ఆయనకు వేరే శాఖ కావాలని చెప్పారు. నేను ఈ విషయం ఆయనతో చర్చించి ఒక పరిష్కారం కనుగొంటాను. ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు."

గతంలో, తనకు బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల మంత్రిత్వశాఖ కేటాయించని  రెడ్డి ఆరోపించారు. మాట తప్పినందునే తాను రాజీనామా చేస్తున్నాని అన్నారు. 

Frequently Asked Questions

కర్ణాటక ప్రభుత్వంలో అసంతృప్తికి కారణం ఏమిటి?

శాఖల కేటాయింపు విషయంలో కర్ణాటక ప్రభుత్వంలో అసంతృప్తి పెరుగుతోంది. కొందరు సీనియర్ మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంత్రి రామలింగారెడ్డి రాజీనామాకు గల కారణం ఏమిటి?

ఆయనకు బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని హామీ ఇచ్చి, భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల మంత్రిత్వశాఖ కేటాయించడంతో రాజీనామా చేశారు. మాట తప్పినందునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

కే.హెచ్. మునియప్ప ఏ శాఖలో మార్పు కోరుతున్నారు?

ప్రస్తుతం ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న మునియప్ప, సాంఘిక సంక్షేమం, వ్యవసాయం లేదా నీటిపారుదల వంటి శాఖలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఇదే శాఖలో ఉన్నందున మార్పు కోరుతున్నారు.

రామలింగారెడ్డి రాజీనామాపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందన ఏమిటి?

ఆయన రామలింగారెడ్డిని తన ఆప్తమిత్రుడిగా, సీనియర్ నాయకుడిగా అభివర్ణించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"మొన్నటి ఎన్నికల్లో చెత్తను క్లీన్ చేశారు" కొడాలి నానిపై చంద్రబాబు సెటైర్లు 
Skyroot Vikram-1 launch: నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
నింగిలోకి దూసుకెళ్లిన స్కైరూట్ విక్రమ్‌-1! అంతరిక్షానికి ఉబర్‌ లాంటి సేవలు ప్రారంభం!
West Bengal Politics: బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
బెంగాల్‌లో దీదీ సెంటిమెంటల్ రాజకీయాలు - పార్టీని కాపాడుకోవడానికా.. వారసుడిని నిలబెట్టడానికా?
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Gudivada Tour: రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
రౌడీయిజం చేస్తే తోకలు కత్తిరిస్తాం.. ఆ నోళ్లలో ఫినాయిల్ వేశారు- గుడివాడ గడ్డపై నుండి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ !
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
683 కి.మీ రేంజ్‌ Mahindra BE6 EVపై రూ. 2.50 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Anna Lezhneva Visits Thirumala: శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
శ్రీవారి సన్నిధిలో అన్నా లెజినోవా... తిరుమలలో పవన్ భార్య ఫోటోలు
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Embed widget