జమ్ముకశ్మీర్‌లో ఉదయం నుంచి వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఎన్‌కౌంటర్‌లు జరుగుతున్నాయి. పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు చెందిన జైషే ఈ మహ్మద్ కమాండర్ హతమైనట్టు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. 2018 నుంచి వివిధ దుర్ఘటనల వెనుక ఉన్న కమాల్ భాయ్ ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్టు పేర్కొన్ననారు.
మరో ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అందులో ఇద్దరు పుల్వామాలో జరిగిన ఎదురుకాల్పుల్లో చనిపోగా.. మరో ఇద్దరు హంద్వారాలో, గండేర్బల్‌లో మృతి చెందారు. ఓ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు.
కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పాకిస్థానీకి చెందిన జైఈఎం కమాండర్ కమాల్ భాయ్ హతమయ్యాడు. అతను 2018 నుంచి వివిధ దాడుల్లో పాల్గొన్నాడు. పుల్వామా ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. అదే గ్రూప్‌నకు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అని వివరించారు.
ఉగ్రవాదులు సంచరిస్తున్నార సమాచారంతో రాత్రి నుంచి ఆపరేషన్ ఏరివేత స్టార్ట్ చేసినచ్టు విజయ్ కుమార్ తెలిపారు. లోకల్ పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ ప్రారంభించారు. నాలుగైదు ప్రాంతాల్లో ఈ ఏరివేత కొనసాగింది. ప్రస్తుతానికి హంద్వారా, పుల్వామాలో ఆపరేషన్ ముగిసినట్టు ప్రకటించారు పోలీసులు.
ఐదుగురు ఉగ్రవాదులు చనిపోవడం, మరో తీవ్రవాది ప్రాణాలతో చిక్కడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులు ఎలాంటి ఎదురు దాటి చేస్తారో ఇంకా ఎలాంటి దుర్మార్ఘాలకు పాల్పడతారో అన్న సందేహంతో లోయ మొత్తంపై నిఘా పెంచారు. ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది నుంచి వివరాలు రాబడుతున్నారు.