Chandrayaan-4 Mission News:


చంద్రయాన్ 4 మిషన్‌పై కసరత్తు..


చంద్రయాన్-3 సక్సెస్‌తో (Chandrayaan-3 ) ఇస్రో పేరు అంతర్జాతీయంగా మారు మోగింది. అత్యంత కష్టమైన సౌత్‌పోల్‌పై ల్యాండర్‌ని చాలా సేఫ్‌గా ల్యాండ్‌ చేసింది ఇస్రో. ఈ ప్రయోగం విజయవంతం అయిన నేపథ్యంలో మరో రెండు లూనార్ మిషన్స్  (ISRO Lunar Missions)చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇస్రోకి చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. త్వరలోనే ఇస్రో రెండు కీలక లూనార్ మిషన్స్‌ని చేపట్టనున్నట్టు తెలిపారు. అప్పుడే వీటికి పేర్లు కూడా పెట్టారు. ఒకటి  LuPEx, మరోటి చంద్రయాన్-4 (Chandrayaan-4).ఈ మిషన్‌ ద్వారా 350 కిలోల బరువున్న ల్యాండర్‌లను చంద్రుడిపై చీకటి ఉన్న 90 డిగ్రీల ప్రాంతంలో ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 


"చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ తరవాత ఇస్రోపై అంచనాలు పెరిగాయి. దేశమంతా సంతోషం వ్యక్తం చేసింది. అందుకే ఈ సారి మరో రెండు లూనార్ మిషన్స్‌ని చేపట్టాలని కసరత్తు చేస్తున్నాం. చంద్రయాన్ 3తో 70 డిగ్రీల వద్దకు చేరుకోగలిగాం.  LuPEx మిషన్ ద్వారా మరికొంత దూరంలో ఏమీ కనిపించని 90 డిగ్రీల కోణం వద్ద ధ్రువంపై ల్యాండర్‌ని ల్యాండ్ చేయాలని చూస్తున్నాం. చంద్రయాన్ 3 మిషన్‌లో వినియోగించిన ల్యాండర్ బరువు 30 కిలోలు మాత్రమే. అంటే ఈ సారి ల్యాండర్ బరువు భారీగా ఉండనుంది. 350 కిలోల బరువున్న ల్యాండర్‌ని ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చంద్రయాన్ 3 సక్సెస్ తరవాత ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా పెద్దసవాళ్లు ఎదుర్కోవాలని సూచించారు. వచ్చే 5-10 ఏళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశిస్తున్నాం"


- నీలేష్ దేశాయ్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ 


100 రోజుల మిషన్..


చంద్రయాన్-3 మిషన్‌ లైఫ్‌టైమ్ 14 రోజులు కాగా...చంద్రయాన్ 4లో ఈ గడువు 100 రోజుల వరకూ ఉండనుంది. ఈ మిషన్‌లో భాగంగా...రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై నుంచి మట్టి, రాళ్లను సేకరిస్తుంది. ఈ మిషన్ కోసం జపాన్ అంతరిక్ష సంస్థ సహకారం తీసుకోనుంది ఇస్రో. 


Also Read:


Uttarkashi Tunnel Rescue: ఉత్తరాఖండ్ సీఎంకి ప్రధాని మోదీ ఫోన్‌ కాల్, రెస్క్యూ ఆపరేషన్‌పై ఆరా