Waiting Ticket Railway Rules: భారతదేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది  రైళ్లలో ప్రయాణిస్తారు. అతి తక్కువ ఖర్చుతో సుదూర ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో వ్యక్తిగత వాహనాల కంటే రైలు ప్రయాణాలకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వేశాఖ నిత్యం ఏదో ఒక మార్పులు చేర్పులు చేస్తుంటుంది. అయోధ్య రామ మందిరం పున ప్రారంభం, ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా లాంటి సమయాలలో ప్రత్యేక రైళ్లు సైతం నడుపుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం తాజాగా కొన్ని రూల్స్ కఠినతరం చేయడంతో పాటు కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది రైల్వేశాఖ. 

Continues below advertisement


రైలులో ప్రయాణించడానికి కొన్ని రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటారు. కానీ కొందరు సీటు కన్ఫామ్ కాకున్నా రైళ్లు ఎక్కుతుంటారు. ఇది సీటు కన్ఫామ్ అయిన, చాలా రోజుల ముందే బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆలస్యంగా టికెట్ బుక్ చేసుకుంటే  టిక్కెట్లు వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్లిపోతాయి. ఆ సమయంలో మీరు ఏమీ పట్టించుకోకుండా రైలు జర్నీ చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాలి. లేకపోతే ప్రయాణికులు జర్నీ సమయంలో జరిమానాతో పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


రైల్వేశాఖ వెయిటింగ్ టిక్కెట్లపై ప్రయాణించే నియమాలను మార్చింది.  ఇప్పుడు వెయిటింగ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులు జర్నీ చేస్తే వారు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ వెయిటింగ్ లిస్టుకు సంబంధించి  ప్రయాణికులకు రూల్స్ మారాయి.


ఇదివరకు వెయిటింగ్ టిక్కెట్లతో ప్రయాణించేవారు స్లీపర్ (Sleeper), ఏసీ కోచ్‌లలో ఎక్కడానికి, ప్రయాణించడానికి భారతీయ రైల్వే అవకాశం ఇచ్చింది. కానీ ఇప్పుడు రైల్వేలు ఈ రూల్స్ మార్చాయి. ఎవరైనా టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే సంబంధిత రిజర్వ్డ్ కోచ్‌లో ప్రయాణించవచ్చు. ఒకవేళ మీ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే ఇకనుంచి మీరు స్లీపర్‌ కోచ్, ఏసీ కోచ్‌లోనూ ప్రయాణించడం కుదరదు. మీరు స్లీపర్, (AC Coach) కోచ్‌లో ప్రయాణిస్తే  భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ట్రెయిన్ టీసీ (TTE) మిమ్మల్ని స్లీపర్, AC కోచ్ నుంచి దించేసే అవకాశం ఉంది.


ఎంత ఫైన్ కట్టాలి.. 
మీరు వెయిటింగ్ లిస్ట్ టికెట్ తో ప్రయాణిస్తూ స్లీపర్, ఏసీ కోచ్‌లలో ఇకనుంచి ప్రయాణం చేయవద్దు. రూల్స్ అతిక్రమించి మీరు వెయిటింగ్ లిస్టు టికెట్ ఉన్నా స్లీపర్, ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తే జరిమానా చెల్లించాలి. వెయిటింగ్ లిస్ట్ టికెట్‌పై AC కోచ్‌లో ప్రయాణిస్తే రూ.440 జరిమానాతో మీరు తరువాత  స్టేషన్ వరకు ఛార్జీని కట్టాలి. మీరు టికెట్ కన్ఫామ్ కాకున్నా స్లీపర్ కోచ్‌లో ప్రయాణిస్తే.. రూ. 250 జరిమానాతో పాటు తరువాత స్టేషన్ వరకు ఛార్జీ చెల్లించాలని రూల్స్ సవరించారు.