రెండు రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లోనూ వస్తున్న వార్త రైల్వే ప్రయాణికులను కలవరపెట్టింది. అదేంటంటే ఇకపై ఎవరైనా ఆన్ లైన్ లో జెనరల్ టికెట్స్ తీసుకుంటే వాటిని ప్రింట్ ఔట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలని లేకుంటే చెల్లవు అన్నట్టు ఒక వార్త వైరల్ అయింది. అంటే మనం UTS లాంటి ఆన్లైన్  APP నుండి జెనరల్ టికెట్ బుక్ చేసుకున్నా  వాటిని ప్రింట్ ఔట్ తీసుకుని ట్రైన్ ఎక్కాల్సిందే అంటూ వార్తలు వచ్చాయి. దానితో రైల్వే ప్రయాణికులు ఈ కొత్త రూల్ ఏంటీ అంటూ డౌట్ లో పడ్డారు. అయితే దీనిపై రైల్వే డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చింది. 

Continues below advertisement

అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదు : రైల్వే డిపార్ట్మెంట్ 

జెనరల్ టికెట్స్ విషయం లో ప్రస్తుతానికి అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని రైల్వే డిపార్ట్మెంట్ స్పష్టత ఇచ్చింది. డిజిటల్ జెనరల్ టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు మొబైల్ ల్లో టికెట్ చూపిస్తే సరిపోతోంది. టికెట్ కౌంటర్ లో తీసుకున్న ప్రయాణికులు మాత్రం టమ టికెటట్ ను  ప్రయాణంలో తమ వెంట ఉంచుకోవాల్సిందే అని తెలిపింది రైల్వే డిపార్ట్మెంట్.

Continues below advertisement

రోజూ జనరల్ లో ప్రయాణం చేసే చాలామంది ఈరోజుల్లో సమయం కలిసి రావడం కోసం UTS లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ఫోన్ లోనే జెనరల్ టికెట్ బుక్ చేస్తున్నారు. అలాంటి వారికి ఈమధ్య వచ్చిన ఫేక్ న్యూస్ షాక్ ను కలిగించింది. దానిపై రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లారిటీ వారికి ఊరట కలిగించింది. UTS లో టికెట్ బుక్ చేసుకున్న జెనరల్ బో్గీ ప్రయాణికులు మొబైల్ లో టికెట్ చూపిస్తే సరిపోతుంది.

సంక్రాంతి కి 600 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

పండుగ రద్దీని పురస్కరించుకొని ఇప్పటికే 100 కు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది రైల్వే డిపార్ట్మెంట్. సంక్రాంతి దగ్గరకు వచ్చే సరికి ఈ సంఖ్య ను 600 వరకూ పెంచుతామని హైదరాబాద్ లోని వివిధ స్టేషన్ లనుండి తెలుగు ప్రయాణికుల కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు SCR రైల్వే అధికారులు తెలిపారు. వాటికి సంబందించిన టైమింగ్స్ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేస్తామని వారు తెలిపారు.