Varanasi Railway Station | వారణాసిలోని వివిధ రైల్వే స్టేషన్ల నుండి ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. అయితే, బనారస్ రైల్వే స్టేషన్, కెంట్ రైల్వే స్టేషన్‌కు సంబంధించి ప్రయాణికులలో తరచుగా గందరగోళం ఏర్పడుతుంది. చాలాసార్లు, ఈ రైల్వే స్టేషన్ల కోడ్‌ల గురించి కన్‌ఫ్యూజన్ కారణంగా ప్రయాణికులు తమ రైళ్లను మిస్ అవుతున్నారు. ఇప్పుడు వారణాసి (బనారస్) రైల్వే స్టేషన్ కోసం కొత్త కోడ్ అమలు చేస్తున్నారు.దీని వలన ప్రయాణికులు వీటిలో తమ రైలు వచ్చే స్టేషన్‌ను గుర్తించడం సులభం అవుతుంది.

Continues below advertisement

BSBS నుంచి BNRSకి మార్పుABP లైవ్ తెలిపిన సమాచారం ప్రకారం, డిసెంబర్ 1 నుంచి వారణాసిలోని బనారస్ రైల్వే స్టేషన్ కోడ్ BNRSగా మారుతుంది. ఇంతకు ముందు, ఈ స్టేషన్ నుండి ప్రయాణించే వారి రైలు టిక్కెట్‌పై BSBS అని ముద్రించేవారు. ఇక్కడ నుండి దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల దూరంలో వారణాసి కెంట్ రైల్వే స్టేషన్ ఉంది. దీని రైల్వే స్టేషన్ కోడ్ BSB. బనారస్ రైల్వే స్టేషన్ నుండి బెంగాల్, బిహార్‌తో సహా ఉత్తర భారతదేశంలోని వివిధ నగరాలకు ప్రతిరోజూ డజన్ల కొద్దీ రైళ్లు సేవలు అందిస్తుంటాయి. 

గందరగోళం కారణంగా రైళ్లు మిస్సవుతున్న ప్రయాణికులు చాలాసార్లు ప్రయాణికులు ఈ రైల్వే స్టేషన్ల కోడ్ గందరగోళంలో పడి ఇతర స్టేషన్‌లకు వెళ్తున్నారు. దీని కారణంగా వారు సకాలంలో సరైన రైల్వే స్టేషన్ చేరుకోలేక.. తమ రైళ్లను కోల్పోతున్నారు. కానీ ఇప్పుడు ఈ గందరగోళం ఉండదు. బనారస్ రైల్వే స్టేషన్‌కు BNRS కోడ్ డిసెంబర్ 1, 2025 నుండి అమలు చేస్తున్నారు.

Continues below advertisement

ఈ స్టేషన్‌ను ఇంతకు ముందు మడువాడి స్టేషన్ అని పిలిచేవారుబనారస్ రైల్వే స్టేషన్ దాని పరిశుభ్రత మరియు ఏర్పాట్ల కారణంగా దేశంలోని ఉత్తమ రైల్వే స్టేషన్లలో ఒకటిగా భావిస్తారు. జూలై 2021కి ముందు ఈ రైల్వే స్టేషన్‌ను మడువాడి స్టేషన్ అని పిలిచేవారు. కానీ దీనిని బనారస్ రైల్వే స్టేషన్ అని పేరు మార్చారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ కోడ్ BNRS అని మార్చగా.. ఇది డిసెంబర్ 1 నుండి అమలులోకి వస్తుందని ప్రయాణికులు ఇది గుర్తించాలని రైల్వేశాఖ అధికారులు సూచించారు.