అన్వేషించండి

West Asia War Effect on Mango Exports: పశ్చిమాసియా యుద్దంతో మామిడి ఎగుమతిదారులకు కష్టం!కంటైనర్ల కొరతతో భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు!

West Asia War Effect on Mango Exports: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్ మామిడి ఎగుమతిదారులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. రిఫ్రిజిరేటెడ్‌ కంటైనర్ల కొరతవల్ల మేలైన రకాలను విదేశాలకు పంపడం భారంగా మారుతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత మామిడి ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
  • హర్మూజ్, ఎర్ర సముద్రాల దిగ్బంధనంతో రవాణా సమయం, ఖర్చులు విపరీతంగా పెరిగాయి.
  • రీఫర్ కంటైనర్ల కొరత, రవాణా ఛార్జీలు ఎనిమిది రెట్లు పెరగడంతో సమస్య తీవ్రమైంది.
  • ఎగుమతులు తగ్గడంతో రైతులకు, ఇతర త్వరగా పాడైపోయే ఉత్పత్తులకు నష్టం వాటిల్లింది.

West Asia War Effect on Mango Exports: భారత్‌లో మామిడి సీజన్ ప్రారంభమైందంటే ఎగుమతిదారులలో ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది. కానీ, 2026 ఏప్రిల్‌ నెలలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పశ్చిమాసియాలో ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా భారతీయ మామిడి ఎగుమతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మేలైన రకాలపై ఆల్ఫాన్సో, కేసర్‌, మన తెలుగు రాష్ట్రాల్లోప్రసిద్ధి చెందిన బంగినపల్లి వంటి రకాల ఎగుమతులకు ఈ యుద్ధం పెద్ద అడ్డంకిగా మారింది. 

ఎందుకు ఈ అడ్డంకులు

గత రెండు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్‌ దిగ్బంధించింది. దీనికి తోడు ఎర్ర సముద్రంలో నెలకొన్న అలజడుల వల్ల ప్రధాన షిప్పింగ్ లైన్లు తమ నౌకలను కేప్ ఆఫ్‌ గుడ్ హోప్‌ మీదుగా మళ్లించాల్సి వస్తోంది. ఈ మార్పు వల్ల  ప్రయాణం కాలం విపరీతంగా పెరగడమే కాకుండా ఓడరేవుల్లో రద్దీ పెరిగి కంటైనర్లు సకాలంలో తిరిగి రావడం లేదు. 

మామిడి వంటి త్వరగా పాడైపోయే పండ్ల రవాణాకు రీఫర్‌ అని పిలిచే రిఫ్రిజిరేటెడ్‌ కంటైనర్లు అత్యవసరం. ఈ కంటైనర్లలో ఉష్ణోగ్రతను కచ్చితంగా 11 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. భారత్‌ సొంతంగా ఈ రీఫర్ కంటైనర్లను తయారుచేయదు. మనం పూర్తిగా అంతర్జాతీయ షిప్పింగ్ లైన్లపైనే ఆధాపడుతున్నాం. యుద్ధం కారణంగా ఈ కంటైనర్ల రాకపోకలు మందగించడంతో ప్రస్తుతం మార్కెట్‌లో వీటి కొరత తీవ్రంగా ఉంది. 

ఎనిమిది రెట్లు పెరిగిన రవాణా ఛార్జీలు 

యుద్ధం కారణంగా రవాణా రంగంపై పడిన ఆర్థిక భారం సామాన్యులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే సముద్ర రవాణా ఛార్జీలు కొన్ని మార్గాల్లో ఏకంగా 8 రెట్లు పెరిగాయి. యుద్ధం ఉన్న ప్రాంతాల గుండా ప్రయాణించే నౌకలపై బీమా ఛార్జీలు, అదనపు పన్నులు భారీగా పెరిగాయి. కేవలం మార్చి నెలలోనే రీఫర్‌ కంటైనర్ల ఛార్జీలు వెయ్యి డాలర్లు వరకు పెరిగాయి. కొన్ని మార్గాల్లో సుమారు నాలుగువేల డాలర్ల వరకు అదనపు పన్నులు విధిస్తున్నారు. ఇది సాధారణ రవాణా ఖర్చు కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. 

ఎగుమతులపై ప్రభావం 

ప్రపంచ మామిడి ఉత్పత్తిలో భారత్ అగ్రమగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పండే మామిడిలో 44 శాతం అంటే సుమారు 20.68  మిలియన్‌ టన్నులు భారత్ నుంచే వస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ 56.5 మిలియన్ డాలర్ల విలువైన 29,938 టన్నుల తాజా మామిడి ఎగుమతి చేసింది. 

మన ఎగుమతుల్లో 40 శాతం నుంచి 45 శాతం వాటా గల్ఫ్‌ దేశాలదే. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉండే పీక్ సీజన్‌లో ఎగుమతిదారులకు ఇప్పటికే భారీ ఆర్డర్లు ఉన్నాయి. మామిడి పండు కోసిన తర్వాత కేవలం 28 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. సముద్ర మార్గంలో ప్రయాణ కాలం పెరగడం వల్ల పండ్లు గమ్యస్థానానికి చేరే లోపే పాడైపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల ఎగుమతిదారులు విమాన రవాణాను ఎంచుకోవాల్సి వస్తోంది. సముద్ర రవాణా ఖర్చు కేజీకి 50 నుంచి 80 రూపాయలు. విమాన రవాణా ఖర్చు కేజీకి 240 రూపాయల నుంచి 300 రూపాయలు. విమాన రవాణా దాదాపు ఐదు నుంచి ఆరు రెట్లు ఖరీదైనదిగా కావడంతో ఎగుమతిదారుల లాభాలు తగ్గిపోతున్నాయ. 

ఈ సంక్షోభం కేవలం ఎగుమతిదారులకే పరిమితం కాలేదు. మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇది పెద్ద దెబ్బ. ఎగుమతులు నిలిచిపోతే, ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్‌కు మళ్లుతాయి. దీని వల్ల దేశీయంగా మామిడి ధరలు భారీగా పడిపోయి రైతులకు కనీస పెట్టబడి పోటీని ఎదుర్కోవడంలో కూడా భారత్ వెనుకబడే అవకాశం ఉంది. 

ఈ సమస్య కేవలం మామిడికే పరిమితం కాలేదు. అరటి, ద్రాక్ష, ఉల్లిపాయలు, సీ ఫుడ్ వంటి త్వరగా పాడైపోయే వస్తువులపై కూడా ఈ ప్రభావం పడింది. ముంబైలోని జీఎన్పీటీ ఓడరేవులో వందలాది కంటైనర్లు నిలిచిపోయాయి. 

Frequently Asked Questions

భారతీయ మామిడి ఎగుమతులకు ప్రస్తుతం ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి?

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి దిగ్బంధం, ఎర్ర సముద్రంలో అలజడులు షిప్పింగ్ మార్గాలను మార్చాల్సి వస్తోంది.

మామిడి రవాణాకు అవసరమైన రిఫ్రిజిరేటెడ్ కంటైనర్ల కొరతకు కారణమేమిటి?

యుద్ధం కారణంగా అంతర్జాతీయ షిప్పింగ్ లైన్లపై ఆధారపడటం, కంటైనర్ల రాకపోకలు మందగించడం వలన మార్కెట్లో వీటి కొరత ఏర్పడింది.

భారతీయ మామిడి ఎగుమతులపై యుద్ధం యొక్క ఆర్థిక ప్రభావం ఏమిటి?

గల్ఫ్ దేశాలకు రవాణా ఛార్జీలు 8 రెట్లు పెరిగాయి, బీమా ఛార్జీలు, అదనపు పన్నులు పెరిగి ఎగుమతిదారుల లాభాలు తగ్గుతున్నాయి.

ఎగుమతులు నిలిచిపోతే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి?

ఎగుమతులు ఆగితే, స్థానిక మార్కెట్లోకి మామిడి రావడంతో ధరలు పడిపోయి, రైతులకు కనీస పెట్టుబడి కూడా తిరిగి రావడం కష్టమవుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Strait of Hormuz: హర్మూజ్‌లో భారత చమురు నౌకపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
హర్మూజ్‌లో భారత చమురు నౌకపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
PM Modi Speech: మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
మహిళలకు జరిగిన అవమానాన్ని మర్చిపోం - పాపాలకు శిక్ష తప్పదు - విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
Advertisement

వీడియోలు

IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
IPL 2026 KKR vs GT Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Shubman Gill GT vs KKR IPL 2026 | అదరగొట్టిన కెప్టెన్ శుభమన్ గిల్
Shubman Gill Success Secret Revealed IPL 2026 | శుబ్మన్ గిల్ సక్సెస్ సీక్రెట్ ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 KKR VS RR Result Update: రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
రింకూ ర‌పారపా.. కేకేఆర్ ను తొలి విజ‌యాన్ని అందించిన ఫినిష‌ర్, రాయ‌ల్స్ పై థ్రిల్లింగ్ విక్ట‌రీ, రాణించిన అనుకుల్, వ‌రుణ్, త్యాగీ
Project Punarvika: ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
ప్రాజెక్ట్ పునర్విక ప్రకటించిన నారా లోకేష్.. అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం నిర్ణయం
Adilabad Airforce Station: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టే కాదు.. Airforce Staton కూడా..!  స్థలాన్ని పరిశీలించిన Indian Airforce 
Blast At Firecracker Factory: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. 19 మంది మృతిపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
Viral Video: ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
ఆరేళ్ల కూతుర్ని నిర్మానుష్య ప్రాంతం కొడుతూ, భయపెట్టిన తండ్రి.. ఒకరు ప్రశ్నించడంతో పరార్
Deepika Padukone Pregnancy: మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
మరోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొనె.. రెండో ప్రెగ్నెన్సీపై నటి పోస్ట్ వైరల్, సెలబ్రిటీల విషెష్
Chandrababu Birthday: చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
చంద్రబాబు పేరు మీద అన్ని అన్నక్యాంటీన్లలో భోజనం ఫ్రీ.. సీఎంకు సతీమణి బర్త్‌డే గిఫ్ట్‌
AP CM Chandrababu: 2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
2 రోజులపాటు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు
Embed widget