Digital India: 


జీ20 డిజిటల్ ఎకానమీ సదస్సు..


ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బెంగళూరులో జరుగుతున్న G20 Digital Economy సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని...ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే భారత్ AI టెక్నాలజీతో ఓ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్‌  ప్లాట్‌ఫామ్‌ని తయారు చేస్తోందని వెల్లడించారు. భారత్‌లోని భాషా వైవిధ్యానికి తగ్గట్టుగా ఇది అన్ని భాషల్లోనూ తయారవుతోందని చెప్పిన ప్రధాని ఈ ప్లాట్‌ఫామ్‌కి "భాషిణి (Bhashini)" అనే పేరు పెట్టినట్టు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు ఇంటర్నెట్ డేటా అందిస్తున్న దేశం భారత్ మాత్రమే అని చెప్పిన ఆయన త్వరలోనే ఇండియాలో డిజిటలైజేషన్‌ ఊహించిన దాని కన్నా వేగంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.





భారత్‌లో ప్రస్తుతానికి 85 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారని, వీళ్లందరూ తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటాని పొందుతున్నారని వెల్లడించారు. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా...భాషిణి పోర్టల్‌ ద్వారా ఇప్పుడున్న 10 భారతీయ భాషలతో పాటు, మొత్తం 22 భాషల్లోకి ట్రాన్స్‌లేషన్‌ వెసులుబాటు కలుగుతుంది.