ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసే వరకు వేచి ఉండటానికి మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. భారత్ తన కఠినమైన వైఖరిని కొనసాగించింది.
India US Trade Deal :"మీ బెదిరింపులు ఆపండి! ట్రంప్ దిగే వరకు ఎదురు చూడగలం" అమెరికా మెడలు వంచిన అజిత్ దోవల్ స్టెట్‌మెంట్!
India US Trade Deal : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తన పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు, అయితే బ్లూమ్‌బెర్గ్ నివేదిక ఇదంతా తప్పంటోంది.

India US Trade Deal : భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తాము సాధించిన పెద్ద విజయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మిత్రదేశాలు అభివర్ణిస్తున్నారు, కానీ ఓ నివేదిక ఈ వాదనపై ప్రశ్నలను లేవనెత్తింది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం, వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసే వరకు ఎదురు చూడటానికి సిద్ధంగా ఉందని మోడీ ప్రభుత్వం వాషింగ్టన్‌కు స్పష్టంగా చెప్పిందని తెలుస్తోంది.
భారత్ స్పష్టమైన వైఖరిని కొనసాగించింది
2025 సెప్టెంబర్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మధ్య జరిగిన సమావేశం గురించి బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ సమావేశంలో భారత్ తన కఠినమైన వైఖరిని వివరించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ట్రంప్ దాడి చేస్తూ, ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికా ఉత్పత్తులపై 50% అధిక సుంకాలను విధించిన సమయంలో ఈ సమావేశం జరిగింది.
ట్రంప్ ఒప్పందాన్ని ప్రకటించారు
నివేదిక ప్రకారం, అజిత్ దోవల్ రూబియోతో మాట్లాడుతూ, "ట్రంప్ లేదా ఆయన మిత్రదేశాల వల్ల భారత్ బెదిరిపోదు, భారత్ ఇంతకు ముందు ఇలాంటి క్లిష్ట అమెరికా పాలనను ఎదుర్కొన్నంది. ఆయన అధ్యక్ష పదవి పూర్తి అయ్యే వరకు ఎదురు చూసేందుకు సిద్ధంగా ఉంది" అని అన్నారు. ఈ సమావేశం గురించి తెలిసిన న్యూఢిల్లీలోని అధికారులు బ్లూమ్‌బెర్గ్‌కు సమాచారం చేరవేశారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, US స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈ సమావేశంపై వ్యాఖ్యానించడం లేదు.
విమర్శలు తగ్గించుకోవాలని సూచన
ఈ సమావేశంలో, రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావడానికి ట్రంప్, ఆయన సహాయకులు భారత్‌పై బహిరంగ విమర్శలు తగ్గించుకోవాలని న్యూఢిల్లీ కోరుకుంటున్నట్లు అజిత్ దోవల్ రూబియోతో అన్నారు. ఈ సమావేశం తర్వాత, ట్రంప్, ఆయన సహాయకులు తమ స్వరాన్ని తగ్గించుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ పుట్టినరోజున ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ట్రంప్ సహాయకులు పదునైన వ్యాఖ్యలు
గతంలో, ట్రంప్, పీటర్ నవారో వంటి ఆయన మిత్రులు, భారత్-పాకిస్తాన్ వివాదం గురించి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీని నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. భారత్ నియంతలతో జతకడుతోందని, భారత్ రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్నందున రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని మోడీ యుద్ధంగా అభివర్ణించాలని నవారో అన్నారు. మోడీ వస్త్రధారణపై నవారో దాడి చేసి, ఆయన కాషాయ వస్త్రాలు ధరించి, ఎర్ర తిలకం ధరించి ధ్యానం చేస్తున్న ఫోటోపై నోరు పారేసుకున్నారు.
ట్రంప్ వాదనలను భారత్ తోసిపుచ్చింది.
2025 మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగు రోజుల యుద్ధంలో కాల్పుల విరమణ కుదిరిందని ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు, కానీ భారత్ ఈ వాదనను తిరస్కరించింది. తదనంతరం, గతంలో బాగానే ఉన్న భారత్ -అమెరికా సంబంధాలు అకస్మాత్తుగా క్షీణించాయి. ఆదివారం, ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఎటువంటి అధికారిక ప్రక్రియ లేకుండానే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం పూర్తయినట్లు ప్రకటించారు. తాను ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడినట్లు చెప్పారు.
ప్రధాని మోదీ చర్చలను ధృవీకరించారు కానీ వాణిజ్య ఒప్పందం గురించి ఏం స్పందించలేదు. భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్, రెండు దేశాలు వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నాయని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఫిబ్రవరి 2025 నుంచి కొనసాగుతున్నాయి.
ప్రతిపక్షాలు ప్రశ్నలు
ట్రంప్ ఏకపక్షంగా వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించడంతో, భారత్లో మోడీ ప్రభుత్వం ప్రశ్నలు, విమర్శలు ఎదుర్కొంది. ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకపోవడంపై నిరసన వ్యక్తం అవుతున్నాయి. చమురు, వ్యవసాయ ఉత్పత్తులపై తన షరతులను అంగీకరించాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం స్పష్టంగా ఏం చెప్పలేదు అలాగని వాటిని తిరస్కరించలేదు. అయితే, ట్రంప్ పదవీకాలం పూర్తి అయ్యే వరకు ఎదురు చూడగలదని రూబియోకు అజిత్ దోవల్ చెప్పిన మాట, మోడీ ప్రభుత్వం భారతదేశానికి అనుకూలంగా లేని ఏ షరతులను అంగీకరించలేదని చూపిస్తుంది.
వేచి ఉండటం అంటే ఏమిటి?
అమెరికా అధ్యక్ష పదవీకాలం నాలుగు సంవత్సరాలు, ఒక వ్యక్తి రెండు పర్యాయాలు మాత్రమే పదవిలో కొనసాగగలరు. ట్రంప్ జనవరి 2025లో అధ్యక్షుడయ్యారు. దీని అర్థం భారత్ వాణిజ్య ఒప్పందం కోసం 2029 వరకు వేచి ఉండాల్సి రావచ్చు.
Frequently Asked Questions
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో మోడీ ప్రభుత్వం వైఖరి ఏమిటి?
అజిత్ దోవల్, మార్కో రూబియో మధ్య జరిగిన సమావేశంలో భారత్ ఏమి కోరింది?
రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావడానికి ట్రంప్, ఆయన సహాయకులు భారత్‌పై బహిరంగ విమర్శలు తగ్గించుకోవాలని న్యూఢిల్లీ కోరుకుంది. ఈ సమావేశం తర్వాత ట్రంప్, ఆయన సహాయకులు తమ విమర్శలను తగ్గించుకున్నారు.
ట్రంప్ తన సోషల్ మీడియాలో వాణిజ్య ఒప్పందం గురించి ఏమి ప్రకటించారు?
ఎటువంటి అధికారిక ప్రక్రియ లేకుండానే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం పూర్తయినట్లు ట్రంప్ ప్రకటించారు. తాను ప్రధాని మోడీతో మాట్లాడినట్లు తెలిపారు.
ట్రంప్ ఏకపక్షంగా ఒప్పందాన్ని ప్రకటించడంతో భారత్‌లో ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?
ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకపోవడంపై నిరసన వ్యక్తం అవుతున్నాయి. చమురు, వ్యవసాయ ఉత్పత్తులపై తన షరతులను అంగీకరించాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తెచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.






















