భూమిమీద అత్యంత వేడి ప్రదేశాలంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఆఫ్రికన్ దేశాలు అనేది ప్రతి ఒక్కరి భావన. కానీ భారత్ ఇప్పుడు దానిని మించి పోయింది. ఈ భూగ్రహం మీద అత్యంత వేడి ప్రదేశాలు ఇండియాలోనే ఉన్నాయి. ఏప్రిల్ 27న ప్రపంచ వాతావరణ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక వింత చోటుచేసుకుంది. ప్రపంచంలోని టాప్-50 అత్యంత వేడి నగరాల జాబితాలో అన్నీ మన దేశానికే చెందినవే ఉన్నాయి. ఈ షాకింగ్ డీటెయిల్స్ ఇండియాలో ఉష్ణోగ్రతలు పెరుగుదల ఏ రేంజ్‌లో ఉందో తెలియజేస్తున్నాయి.
అసలేం జరిగింది? (The Shocking Data)సాధారణంగా ఎండలు అనగానే మనకు ఆఫ్రికా దేశాలు లేదా మధ్యప్రాచ్య (Middle East) దేశాలు గుర్తొస్తాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ 27న పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్లాట్‌ఫారమ్ AQI సేకరించిన డేటా ప్రకారం, ప్రపంచంలోని టాప్-1 నుండి టాప్-50 వరకు ఉన్న హాటెస్ట్ సిటీలన్నీ కేవలం భారతదేశంలోనే ఉన్నాయి. ఇందులో ఒక్క విదేశీ నగరం కూడా లేకపోవడం వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి ఆధునిక వాతావరణ చరిత్రలో ఎటువంటి ముందస్తు ఉదాహరణలు లేవని నిపుణులు చెబుతున్నారు.
టాప్ లో ఉన్న ప్రాంతాలు ఇవే..
- ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని బాందా (Banda) పట్టణం ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతంగా నిలిచింది. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత గరిష్ట ఉష్ణోగ్రత 46.2°C రికార్డయ్యింది. ఇక్కడ తెల్లవారుజామున కూడా ఉష్ణోగ్రత 34.7°C గా ఉంది.
- కాన్పూర్ (UP)46.1°C గరిష్ట ఉష్ణోగ్రతతో నిప్పుల కొలిమిని తలపించింది.
- మహరాష్ట్రలోని అమరావతి (MAH)- 44.3°C నమోదైంది.
- మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలోని అకోలా, యావత్మాల్, చంద్రపూర్ వంటి నగరాలు కూడా టాప్ జాబితాలో ఉన్నాయి.
ఈ 50 ప్రాంతాల జాబితాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుండి 21 ఉన్నాయి. గంగా మైదాన ప్రాంతం కావడం, చెట్లు తక్కువగా ఉండటం వల్ల ఇక్కడ వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. నోయిడా, ఢిల్లీ, గుర్గావ్ వంటి ఎన్‌సీఆర్ (NCR) ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 44.1°C నుండి 44.9°C మధ్య నమోదయ్యాయి.
ముప్పు పొంచి ఉందా...?
భారత్ లో కనిపిస్తున్న అసాధరణ వాతావరణ పరిస్థితులు భవిష్యత్ గురించి ఆందోళనకర సూచనలు ఇవస్తున్నాయి.ఏప్రిల్ నెలలో ఇన్ని రికార్డులు బద్దలు కావడం ఎన్నడూ జరగలేదు. 2050 నాటికి భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మనుషులు నివసించలేని (Survivability limit) స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇతర కారణాలు:దేశంలో కాలుష్యం పెరుగుతుండటం కూడా వాతావరణంలో మార్పులకు ముఖ్యకారణం. ప్రపంచంలోని టాప్-100 కాలుష్య నగరాల్లో 66 మన దేశంలోనే ఉన్నాయి. ఘజియాబాద్‌లోని లోని (Loni) పట్టణం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతంగా నిలిచింది.
నగరాల్లో కాంక్రీట్ భవనాలు, తారు రోడ్ల వల్ల పగటిపూట వేడి భూమిలో నిలిచిపోయి, రాత్రిపూట కూడా చల్లబడటం లేదు.ఎల్ నినో (El Niño):వాతావరణంలో వస్తున్న మార్పులు, లా నినా నుండి ఎల్ నినోకి మారుతున్న క్రమం వల్ల ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి.
మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, వాతావరణ అప్‌డేట్స్ కోసం 'ABP దేశం'ని ఫాలో అవ్వండి!
