ABP Network India@2047 Summit: ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికత కలిగిన దేశామైన భారతదేశం ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఆర్థిక వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రపంచ వేదికపై భారతదేశం కీలక పాత్రను పోషిస్తోంది. సరికొత్త సవాళ్లను ఎదుర్కొని, భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చోటు కోసం నిరంతరం కృషి జరుగుతోంది. భాతదేశం 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని.. స్వాతంత్య్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తిచేసుకుకోనున్న శుభ సమయంలో ఆ కల సాకారం కావాలని ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
అందులో భాగంగానే వందేళ్లకు పైగా అనుభవం ఉన్న ఏబీపీ న్యూస్ నెట్‌వర్క్ శత వసంత భారతానికి ఘన స్వాగతం పలుకుతోంది. నేడు (మే 6వ తేదీన) ఢిల్లీలోని భారత మండపంలో ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న India@2047 కాంక్లేవ్ ప్రారంభమైంది. ABP నెట్‌వర్క్ డైరెక్టర్ ధృబ ముఖర్జీ వెల్కమ్ స్పీచ్‌తో సమావేశాన్ని ప్రారంభించారు, భారత్ స్వాతంత్య్రం పొంది 2047లో శతాబ్దం పూర్తి చేసుకోనుందని.. '2047లో ఏమి ఆశించాలి?' ('What to expect in 2047?') అనే అంశంపై పలు సెషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ సమ్మిట్ లో పాల్గొని తమ అభిప్రాయాలు షేర్ చేసుకోనున్నారు. నేటి సాయంత్రం ప్రధాని మోదీ కీలకోపన్యాసం చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌ను ABP నెట్‌వర్క్ ఈ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. భారత్ @2047 రోడ్‌మ్యాప్‌పై భవిష్యత్ లక్ష్యాలను మోదీ ప్రస్తావించనున్నారు.
ABP నెట్‌వర్క్ ఈ సదస్సు ద్వారా భారతదేశాన్ని ముందుకు నడిపించే భవిష్యత్ ఆలోచనలను, పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి వేదికను అందిస్తుంది. ఇండియా @ 2047లో పలు రంగాల ప్రముఖుల ఆలోచనల సమ్మేళనం జరుగుతుంది. భారతదేశం 2047లో స్వాతంత్ర్యం 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రపంచ వ్యాప్తంగా మేటి దేశంగా, నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా మారాలని వ్యూహాలు రచిస్తోంది.
ABP నెట్‌వర్క్ సదస్సు కాస్త భిన్నంగా కనిపిస్తుంటుంది. ఎందుకటే ఇది కేవలం ఒక చర్చా వేదిక మాత్రమే కాదు. కొందరు ప్రముఖుల ఆలోచనల సమాహారం. ఇది రాబోయే సంవత్సరాలలో ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని నిర్దేశించే దిశగా స్పష్టమైన, సరైన లక్ష్యంతో ముందుకు సాగడానికి సదస్సు ప్రేరేపిస్తుంది.
ప్రధానమంత్రి మోడీ ముఖ్య అతిథి
ABP నెట్‌వర్క్ ప్రత్యేక కార్యక్రమం India@2047 SUMMIT లో ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు, భవిష్యత్ నిర్దేశకులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతం గంభీర్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, టీవీ హోస్ట్ బేర్ గ్రిల్స్, అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా, రేమాండ్స్ ఎండీ గౌతమ్ సింఘానియా, బాక్సర్ లవ్లీనా బోర్గోహోం, ఇతర ప్రముఖులు కూడా హాజరవుతున్నారు.
ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ చూడండి
ABP న్యూస్ (హిందీ)- https://www.abplive.com/ABP న్యూస్ (ఇంగ్లీష్)- https://news.abplive.com/ABP న్యూస్ యూట్యూబ్- https://www.youtube.com/watch?v=nyd-xznCpJc