Independence Day 2023: తెలంగాణ అంటే పోరుగడ్డ, పోరాటాల అడ్డ. ఈ నానుడి ఊరికే రాలేదు. ఇక్కడి ప్రజల్లో ఆ స్ఫూర్తి మొదటి నుంచీ ఉంది. పోరాట వారసత్వం కలిగిన ప్రాంతం తెలంగాణ. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో గణనీయమైన పాత్ర పోషించింది ఈ ప్రాంతం. నిజాం ప్రభువుల పాలనలో ఉండటం వల్ల దేశ స్వాతంత్రోద్యమ సంగ్రామంలో తెలంగాణ పేరు పెద్దగా వినిపించదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రముఖ నాయకులు, సంఘటనలకు చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తాయి. అయితే స్వాతంత్ర్య ఉద్యమానికి తెలంగాణ అందించిన సహకారం పూర్తిగా భిన్నమైనది. రిసిలియెన్స్, త్యాగం, అట్టడుగు స్థాయి సమీకరణ లాంటి క్షేత్రస్థాయి అంశాలకు తెలంగాణ ప్రాంతం అర్హమైనది. 


రైతు ఉద్యమాలు, తిరుగుబాటు


భూస్వాముల అణచివేత, దోపిడి, భూ వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం చేసిన ఉద్యమం దేశ స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. రజాకార్ల దోపిడీకి ఎదురొడ్డి నిలబడ్డ తీరు ఆదర్శం. చిన్నా పెద్దా, ముసలి ముతక, ఆడా మగా అంతా కలిసి గుప్పిట్లో కారం, చేతిలో కొడవలి పట్టి చేసిన పోరాటం భారత దేశ స్వాతంత్ర్య యోధుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించింది. 1946 నుంచి 1951 మధ్య జరిగిన తెలంగాణ తిరుగుబాటు ఇది. కమ్యూనిస్టు కార్యకర్తల నేతృత్వంలో జరిగిన ఈ తిరుగుబాటు భూస్వామ్య వ్యవస్థను సవాలు చేసింది. భూమిలేని వారికి, అణగారిన వారికి భూమిని వనరులను పునఃపంపిణీ చేయడమే ఈ పోరాట లక్ష్యం. ఈ రైతాంగ ఉద్యమం సామాజిక, ఆర్థిక అసమానతలను ఎత్తిచూపుతూ వలసవాద వ్యతిరేక భావాన్ని కలిగించింది.


కమ్యూనిజం ప్రభావం


కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో బలమైన మద్దతును, ఉనికిని కలిగి ఉంది. బ్రిటీష్ వలస పాలన, స్థానిక అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు వివిధ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించే వారు. సామాజిక న్యాయం, భూ పునర్విభజన, సాధికారత వంటి వారి భావజాలం అట్టడుగు వర్గాలకు ప్రతిధ్వనించింది. వారిని స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొనేలా చేసింది. 


గెరిల్లా యుద్ధం, సాయుధ ప్రతిఘటన


తెలంగాణ భూభాగంపై దట్టమైన అడవులు, మారుమూల ప్రాంతాలు ఎక్కువ. బ్రిటీష్ దళాలకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధానికి బ్రీడింగ గ్రౌండ్ గా మారింది తెలంగాణ ప్రాంతం. సాయుధ ప్రతిఘటన ఈ పద్ధతిని స్థానిక యోధులు వలస పాలనకు, కమ్యూనికేషన్ లకు అంతరాయం కలిగించడానికి ఉపయోగించారు. ఈ గెరిల్లా వ్యూహాలు నిజాం రజాకార్లకు కూడా సవాలు విసిరాయి. చివరికి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేయడానికి దోహదపడ్డాయి.


Also Read: Women Freedom Struggle: స్వాతంత్య్ర పోరాటంలో తెగించి కొట్లాడిన ధీర వనితలు, ఒక్కొక్కరి జీవితం స్ఫూర్తిదాయకం


మహిళల సహకారం


స్వాతంత్ర్య పోరాటంలో తెలంగాణ మహిళలు కీలక పాత్ర పోషించారు. నిరసనలు, బహిరంగ ప్రదర్శనల్లో కీలక పాత్ర పోషించారు. అండర్ గ్రౌండ్ లో ఉన్న వారికి అన్ని రకాల సహాయసహకారాలు అందించారు. సామాజిక నిబంధనలను ధిక్కరించి మరీ సహాయం చేశారు. 


సాంస్కృతిక, మేధో ఉద్యమాలు


భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో తెలంగాణ పాత్ర రాజకీయ, సాయుధ ప్రతిఘటనకు మించి ప్రభావం చూపించింది. సాంస్కృతిక, మేధో ఉద్యమాలను పెంపొందించింది. జాతీయవాదం స్ఫూర్తి రగిలించడంలో ఇవి ఎంతో సాయం చేశాయి. జానపద గేయాలు, కవిత్వం, సాహిత్యం ప్రజల్లో అవగాహనను, ఐకమత్యాన్ని వ్యాప్తి చేశాయి. అత్యంత శక్తివంతమైన సాధనాలుగా మారాయి.