Independence Day 2023 Celebrations: 77వ స్వాతంత్య్ర వేడుకుల సందర్భంగా ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శాంతి సందేశాన్ని ఇచ్చింది. అహింస, శాంతి తోనే స్వాతంత్య్రం సిద్ధించిందని గుర్తు చేశారు. వాటితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పునురుద్ఘాటించారు. చిన్న చిన్న సమస్యలతోనే పెద్ద పెద్ద అవంతరాలు ఏర్పడతాయన్న మోదీ... వాటికి తావివ్వకుండా జాగ్రత్త పడాలని సూచించారు. 


మణిపూర్‌లో అాలాంటి పరిస్థితి ఏర్పడిందన్న మోదీ... భవిష్యత్‌లో అక్కడ శాంతి నెలకొంటుందని ఆశాభాావం వ్యక్తం చేశారు. ఇటీవల మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ప్రధాని మోదీ అన్నారు. త్వరలోనే అక్కడ శాంతి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. మణిపూర్ ప్రజలకు దేశం అండగా ఉంది. ప్రజలు ఈ శాంతి సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. శాంతి ద్వారానే దేశం వృద్ధి చెందుతుంది. శాంతిని కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయని, భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగుతాయన్నారు.
 


15వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 77న ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. హింసతో అల్లాడుతున్న మణిపూర్‌లో శాంతి నెలకొనాలని మోదీ తన ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో దేశప్రజలకు బదులు కుటుంబం అనే పదాన్ని ఉపయోగించారు. 


ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు 
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇప్పుడు జనాభా పరంగా కూడా అగ్రగామిగా ఉందన్న కామెంట్‌తో మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంత పెద్ద దేశం, నా కుటుంబంలోని 140 కోట్ల మంది ఈ రోజు స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటున్నారు. కోట్ల మందికి, భారతదేశాన్ని ప్రేమించే, గౌరవించే వారికి నా శుభాకాంక్షలు.


స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ,'ఈ దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన సమరయోధులకు నివాళులర్పిస్తున్నాను.


మణిపూర్ గురించి ప్రస్తావిస్తూ, "గత కొన్ని వారాలుగా, ఈశాన్యంలో, ముఖ్యంగా మణిపూర్‌లో ఘర్షణలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మహిళళ గౌరవానికి భంగం వాటిల్లాయి. శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. మణిపూర్ ప్రజలకు దేశం అండగా ఉంది. ప్రజలు కొన్ని రోజులుగా శాంతిని పాటిస్తున్నారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. 


'అమృత్ కాల్‌లోకి ప్రవేశించడం మా అదృష్టం. మనం చేసే పనులు, వేసే అడుగులు, చేసే త్యాగాలు, ఈ కాలంలో మనం తీసుకునే నిర్ణయాలు, రాబోయే 1,000 ఏళ్ల దేశ స్వర్ణ చరిత్రకు కారణమవుతాయి. ఈ కాలంలో జరిగే సంఘటనలు వెయ్యేళ్లు ప్రభావం చూపుతాయి. 


కొత్త ప్రపంచ వ్యవస్థకు పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి, "ఈ రోజు భారతమాత మేల్కొంది. భారత్ పట్ల ప్రపంచంలో కొత్త ఆశలు, కొత్త విశ్వాసం పుట్టుకొచ్చాయి. మూడు 'డి'ల గురించి ప్రస్తావిస్తూ, "జనాభా, ప్రజాస్వామ్యం, భిన్నత్వం మనకు ఉన్నాయి, ఇది భారతదేశాన్ని ముందుకు తీసుకువెళుతుంది.


నేడు భారతదేశ పురోగతి కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు వ్యాప్తి చెందింది. మన దేశ యువతకు అవకాశాలకు కొదవ లేదు, ఆకాశమే హద్దుగా అవకాశాలను ఇవ్వగల సామర్థ్యం ఈ దేశానికి ఉంది.


దేశంలో నేడు అందరి సంక్షేమానికి అంకితమైన ప్రభుత్వం ఉంది. పాత ఆలోచనలను వీడి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.


ఇదీ నవ భారతం... ఇది ఆత్మవిశ్వాసంతో నిండిన భారతదేశం, తీర్మానాలను నెరవేర్చడానికి కష్టపడే భారతదేశం. అందుకే భారత్... అది ఆగదు, అలసిపోదు, ఓడిపోదు.


కోవిడ్ తర్వాత కొత్త ప్రపంచ క్రమం, కొత్త భౌగోళిక రాజకీయ సమీకరణం వేగంగా కదులుతున్న విషయాన్ని చూస్తున్నాం. మారుతున్న ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో 140 కోట్ల మంది దేశప్రజల శ్రమ కనిపిస్తోంది. 


25 ఏళ్లుగా మన దేశంలో కొత్త పార్లమెంటు ఏర్పాటు చేయాలని చర్చ జరుగుతోందని, కానీ మేం కొత్త పార్లమెంటు ఏర్పాటు చేశాం. ఇది పనిచేసే ప్రభుత్వం, నిర్దేశిత లక్ష్యాలతో పనిచేసే ప్రభుత్వం. మా ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ప్రాజెక్టలను మా హయాంలోనే ప్రారంభిస్తాం. 


పదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆయనకు ఇద్దరు మహిళా అధికారులు మేజర్ నికితా నాయర్, మేజర్ జాస్మిన్‌ కౌర్‌ సహాయ పడ్డారు.  తర్వాత ఆకాశంలో ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌కు చెందిన మార్క్‌-3 ధృవ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్ హెలికాప్టర్‌ పూల వర్షం కురిపించాయి.