IND vs AUS World Cup Match Updates:


జెర్సీలకు ఫుల్ డిమాండ్..


వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ (World Cup Final Match) కారణంగా అహ్మదాబాద్ సిటీ (Narendra Modi stadium) కిక్కిరిసిపోయింది. హోటళ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వేలు ఖర్చు చేసి మరీ వేరే సిటీల నుంచి ఈ మ్యాచ్ (India Vs Australia Match) చూసేందుకు భారీ ఎత్తున తరలి వచ్చారు క్రికెట్ అభిమానులు. ఈ మ్యాచ్ వల్ల ఒక్కసారిగా అహ్మదాబాద్‌లో వ్యాపారులు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ జెర్సీలకు (Cricket Jerseys Demand) డిమాండ్‌ పెరిగింది. నంబర్ 18 విరాట్ కోహ్లీ జెర్సీలు (Virat Kohli Jersey) హాట్‌కేక్‌లా అమ్ముడుపోతున్నాయి. తెచ్చినవి తెచ్చినట్టుగా ఎగబడి కొంటున్నారు ఫ్యాన్స్. ఈ డిమాండ్‌ని చూసి గ్రాసరీ డెలివరీ యాప్స్‌ కూడా జెర్సీలను సేల్‌కి పెట్టాయి. బుక్ చేసుకున్న కాసేపటికీ నేరుగా ఇంటికే వచ్చి డెలివరీ చేస్తున్నాయి. వ్యాపారులు చెబుతున్న వివరాల ప్రకారం...జెర్సీ సేల్స్‌ ఊహించిన దాని కన్నా రెట్టింపయ్యాయి. IPL T20 మ్యాచ్‌ల సమయంలోనూ జెర్సీలు భారీగా అమ్ముడుపోయినప్పటికీ..ఇప్పుడు రికార్డు బద్దలు కొట్టేసి మరీ సేల్ అవుతున్నాయి. టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లి, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ జెర్సీలకు డిమాండ్ బాగా ఉంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.





ఇక ఆస్ట్రేలియా ప్లేయర్స్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ జెర్సీలు అమ్ముడవుతున్నాయి. వీళ్లతో పాటు ఎమ్‌ఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ జెర్సీలకూ డిమాండ్ కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లో యూనివర్సిటీల క్యాంపస్‌లూ ఫైనల్ మ్యాచ్‌ కోసం సిద్ధమయ్యాయి. విద్యార్థులంతా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.